Bigg Boss 9 Telugu Finale Voting: ఉత్కంఠగా ఫినాలే ఓటింగ్.. కల్యాణ్ వర్సెస్ తనూజ.. ఇమ్మూ కథ ముగిసినట్లేనా?
Bigg Boss 9 Telugu Finale Voting: అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9. ఈ రియాలిటీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు చేరువైంది. దాదాపు 15 వారాల సుదీర్ఘ ప్రయాణంలో గొడవలు, భావోద్వేగాలు, టాస్క్‌లతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హౌస్‌లో తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఓటింగ్ రేసు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎవరు? చివరి వారం ఓటింగ్ ఎలా సాగుతోంది? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఫినాలే వీక్‌లో బిగ్‌బాస్ 'వన్స్ మోర్' కాన్సెప్ట్‌తో పాత టాస్క్‌లను తిరిగి ఇచ్చి, కంటెస్టెంట్లలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. బెలూన్ టాస్క్, 'పిక్ ది బోన్' టాస్క్‌లలో పోటీ తీవ్రంగా సాగింది. ఈ టాస్క్‌ల ద్వారా కంటెస్టెంట్ల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఇక 'ప్లేయర్ ఆఫ్ ది డే' అవార్డు, కుటుంబ సభ్యుల వీడియో సందేశాలు, బిగ్‌బాస్ జర్నీ వీడియోలు హౌస్‌మేట్స్‌ను భావోద్వేగానికి గురిచేశాయి.

ఇదిలాఉంటే.. అసలు ఆసక్తి మొత్తం ఓటింగ్ ట్రెండ్స్ మీదే ఉంది. ప్రారంభంలో తనూజ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించినా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారినట్లు సమాచారం. సోషల్ మీడియా ట్రెండ్స్, అన్-ఆఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నాడు. అంచనాల ప్రకారం కళ్యాణ్‌కు సుమారు 38 శాతం, తనూజకు 32 శాతం, డిమోన్ పవన్‌కు 13 శాతం, ఇమ్మానుయేల్‌కు 12 శాతం, సంజనకు5 శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక తనూజ అభిమానులు ఆమెను తొలి మహిళా విజేతగా నిలబెట్టాలనే లక్ష్యంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ క్యాంపైన్ సైలెంట్‌గా కనిపించినా, అతడికి వస్తున్న ఓట్లు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య పోటీలో ఇమ్మానుయేల్ కొంత వెనుకబడ్డట్లు తెలుస్తోంది. ఒకప్పుడు విజేతగా చెప్పుకున్న ఇమ్ము ఇప్పుడు మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ పోరు కళ్యాణ్ పడాల - తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్‌గా మారింది. ఫినాలే వరకు ఇంకా కొంత సమయం ఉండటంతో ఓటింగ్ ట్రెండ్ మారే అవకాశమూ ఉంది. చివరి క్షణంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో? బిగ్‌బాస్ 9 టైటిల్ ఎవరిని వరిస్తోందో చూడాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక రియాలిటీ షోకు ముగింపు పడనున్నది. ఈ ఆదివారం, డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే వైభవంగా జరగనుంది. ఈ ఫినాలే ఎపిసోడ్‌లో సినీ తారల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. టాలీవుడ్ ప్రముఖులు హాజరై స్టేజ్‌పై సందడి చేయనున్నారు.
అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్‌లు, స్పెషల్ యాక్ట్స్, ఫైనలిస్టుల బిగ్‌బాస్ జర్నీ వీడియోలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయనున్నాయి. గ్రాండ్ ఫినాలేకు ఛీప్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెలబ్రిటీ గ్లామర్ అన్నీ కలగలిపిన ఈ గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులకు ఓ గుర్తుండిపోయే అనుభవంగా మారనుంది.


Click it and Unblock the Notifications











