Bigg Boss 9 Telugu Finale Voting: చివరి రోజు ఓటింగ్‌ తారుమారు.. తనూజ, కళ్యాణ్, డిమోన్.. టైటిల్ విన్నర్ ఎవరంటే?

Bigg Boss 9 Telugu Finale Voting: తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తెలుగు 9 ( Bigg Boss Telugu 9). ఈ షో ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు కేవలం ఒక్క రోజే మిగిలి ఉండటంతో విన్నర్ ఎవరనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ సీజన్ మొత్తం డ్రామా, ఎమోషన్స్, ట్విస్టులు, టర్న్స్, అనూహ్య పరిణామాలతో సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారాయి.

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ 9 సీజన్.. సెప్టెంబర్ 7, 2025న ప్రారంభమై, డిసెంబర్ 21, 2025న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులుగా తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల డీమాన్ పవన్, సంజన గల్రానీ, జబర్దస్త్ ఎమ్మాన్యువల్ నిలిచారు. ఈ ఐదుగురిలో ఎవరు ట్రోఫీ అందుకుంటారో అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎక్కడ బిగ్ బాస్ గురించి చర్చ జరిగినా అక్కడ ఈ సీజన్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనే హాట్ టాఫిక్ మారింది. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్థరాత్రితో క్లోజ్ కావడంతో, చివరి రోజు ఓటింగ్ ట్రెండ్స్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

Bigg Boss 9 Telugu Finale Voting Last Day Vote Shuffle Tanuja Kalyan Demon in Winner Race

సోషల్ మీడియా ఓల్స్, అన్ ఆఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌ ప్రకారం.. ఫినాలే ఓటింగ్ లో సోల్జర్ కళ్యాణ్ పడాల టాప్‌లో ఉన్నారు. అతని ఫ్యాన్ బేస్ బలంగా ఉండటం, గేమ్‌లో చూపించిన స్ట్రాటజీ, ఎమోషనల్ కనెక్ట్ కారణంగా కళ్యాణ్ విన్నర్ అనే అంచనాలు ఎక్కువగా వినిపించాయి. రెండో స్థానంలో తనూజ, మూడో స్థానంలో ఇమ్మాన్యువల్ ఉన్నారని పలువురు పేర్కొన్నారు. సంజన, డీమాన్ పవన్ తర్వాత స్థానాల్లో ఉన్నారని టాక్ నడిచింది.

అయితే ఫైనల్ ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయిందని సమాచారం. ఫినాలే చివరి రోజు ఓటింగ్‌ లో భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు వినిపిస్తోంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం.. కళ్యాణ్ మొదటి స్థానం, తనూజ రెండో స్థానంలోకి ‌ రాగా, డీమాన్ పవన్ మూడో స్థానంలోకి వచ్చినట్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మూడో స్థానంలో ఉన్న ఇమ్మాన్యువల్ నాలుగో స్థానంలోకి , చివరగా సంజన ఉన్నట్టు టాక్. ఈ మార్పులతో విన్నర్ ఎవరు అన్న ప్రశ్నకు కళ్యాణ్ పడాల అనే సమాధానమే వస్తుంది.

ఈ ఓటింగ్ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే కళ్యాణ్ పడాల విన్నర్ అవుతారనే ప్రచారం బలపడుతోంది. గత కొన్ని రోజులుగా కూడా ' కళ్యాణ్ పడాల నే టైటిల్ విన్నర్' అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే..ఓటింగ్ ఎక్కువగా కళ్యాణ్‌కు ఉన్నా, ఫైనల్ మేకింగ్‌లో తనూజకే టైటిల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే మరోవాదన కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదంతా నిజమా కాదా అన్నది ఫినాలే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది. గత అనుభవాలు చూస్తే.. ఏ క్షణమైనా ఏమైనా మార్పులు జరగవచ్చనే అభిప్రాయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇక ఎలిమినేషన్ల విషయానికి వస్తే.. డేంజర్ జోన్‌లో సంజన, డీమాన్ పవన్, ఇమ్మాన్యువల్ ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురిలో ముందుగా సంజనను ఎలిమినేట్ చేయనున్నారని, ఆ తర్వాత డీమాన్ పవన్ బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్. ఇమ్మాన్యువల్‌కు సూట్‌కేస్ ఆఫర్ ఇవ్వనున్నారని, కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేస్తారని సమాచారం. ఇమ్మాన్యువల్ కూడా విన్నర్ అవుతాననే ఆశతో ఉన్నారని చెబుతున్నారు. మనం ఊహించిన వ్యక్తే విన్నర్ అవుతాడా? లేక బిగ్ బాస్ మరో షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడా? అన్న ఉత్కంఠంగా మారింది. గ్రాండ్ ఫినాలే రోజునే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X