Bigg Boss 9 Telugu Finale Voting: ఓటింగ్‌లో వార్ వ‌న్‌సైడ్‌.. తనూజకు షాక్.. టైటిల్ విన్నర్ ఎవరంటే?

Bigg Boss 9 Telugu Winner: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఈ రియాలిటీ షోకు మరో మూడు రోజుల్లో ఎండ్ కార్డు పడుతుంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన ఈ షో... టీఆర్పీ రేటింగ్స్ పరంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఓ ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ సారి గొడవలు, వివాదాల కంటే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడంతో ఈ సీజన్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అదే ఈ సీజన్‌ను బ్లాక్‌బస్టర్ హిట్‌గా మార్చింది. ఈ నేపథ్యం ఫినాలే ఓటింగ్ ఎలా ఉంది? టైటిల్ విన్నర్ ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం నుంచి అనేక మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టి, తమ ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు. అయితే చివరకు ఐదుగురు మాత్రమే టాప్ 5లో నిలిచారు. వారిలో సంజన గల్రానీ, తనూజ పుట్టస్వామి, పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. ఈ ఐదుగురు ప్రస్తుతం బిగ్ బాస్ 9 టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ముగ్గురు సెలబ్రిటీలు కాగా, ఇద్దరు కామన్‌మెన్ కేటగిరీలో హౌస్‌లోకి వచ్చారు.

Bigg Boss 9 Telugu Finale Voting One-Sided Battle Shocks Tanuja Is Kalyan Padala the Winner

టైటిల్ రేసు - ఆ ఇద్దరి మధ్యే!
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ టాప్ 5లో ఐదుగురు ఉన్నప్పటికీ, వాస్తవంగా టైటిల్ రేసు మాత్రం ఇద్దరి మధ్యే నడుస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వారే తనూజ పుట్టస్వామి, పడాల పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి మధ్య మొదటి నుంచే 'నువ్వా నేనా' అన్నట్లుగా వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. సోషల్ మీడియా ట్రెండ్స్, ఆన్‌లైన్ పోల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.

వాస్తవానికి కామన్‌మెన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన పడాల పవన్ కళ్యాణ్ మొదట్లో అంత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి నాలుగు వారాల్లో ఆయన ఆట ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. అయితే ప్రియా శెట్టి ఎలిమినేషన్ సమయంలో పవన్ కళ్యాణ్ డేంజర్ జోన్‌లోకి రావడం అతనికి కీలక టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పాలి. ఆ రోజు నుంచి తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు.

ఫ్యామిలీ వీక్ సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, ఆయన తల్లిదండ్రులు చెప్పిన భావోద్వేగ వ్యాఖ్యలు ప్రేక్షకుల్ని బాగా టచ్ చేశాయి. ఆ తర్వాత వరుసగా రెండు వారాలు పవన్ కళ్యాణ్‌కు పాజిటివ్ ఎపిసోడ్స్ రావడంతో అతని ఓటింగ్ గ్రాఫ్ ఊహించని స్థాయిలో పెరిగింది. అదే సమయంలో టాస్క్‌లలో దూకుడు, కెప్టెన్సీ బాధ్యతల్లో మెచ్యూరిటీ అన్ని పవన్ కళ్యాణ్‌కు కలసివచ్చాయి. రెండు సార్లు కెప్టెన్‌గా నిలవడమే కాకుండా, ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

మరోవైపు తనూజ పుట్టస్వామి తన నిజాయితీ, సింప్లిసిటీ, కలుపుగోలుతనంతో ప్రేక్షకుల మనసులు గెలిచింది. ఆమె గ్రూపులు కట్టకుండా, సింపతీ కార్డు వాడకుండా తన ఆటను తాను ఆడుతూ ముందుకు సాగింది. ముఖ్యంగా తాను గెలిచే ప్రైజ్‌మనీని పేద విద్యార్థుల కోసం వినియోగిస్తానని చెప్పడం ఆమెకు మరింత పాజిటివిటీ తెచ్చిపెట్టింది. సీరియల్ ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఆమెకు ఓట్లు వేస్తున్నారు. కానీ, గత రెండు వారాలుగా ఆమెకు షాక్ తగులుతుంది. ఎప్పుడు మొదటి స్థానంలో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఓటింగ్‌లో నెంబర్ 2 స్థానాల్లో నిలిచింది.

సంజన గల్రానీ మొదట్లో ఫైర్ చూపించినా.. చివరి దశలో అంత ప్రభావం చూపలేకపోయింది. ఆమె కూడా తనూజ, పవన్‌ల మధ్యే అసలు పోటీ ఉందని పరోక్షంగా చెప్పడం గమనార్హం. జబర్దస్త్ ఇమ్మానుయేల్ మూడు సార్లు కెప్టెన్‌గా నిలిచినా, నామినేషన్స్‌కు దూరంగా ఉండటం అతని ఓటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఇక డిమోన్ పవన్ కామన్‌మెన్‌గా చివరి వరకు నిలిచి ప్రశంసలు అందుకున్నా, టైటిల్ వరకు చేరడం కష్టమేనని బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

ఓటింగ్ ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి?
తాజా సోషల్ మీడియా, అన్-ఆఫీషియల్ పోల్స్ ప్రకారం.. పవన్ పడాల టాప్‌లో దూసుకుపోతున్నాడు. కొన్ని పోల్స్‌లో పవన్ కి 46 శాతం వరకు ఓటింగ్ నమోదవగా, తనూజకు 26 శాతం ఓట్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ 13శాతం, డిమోన్ పవన్ 9.5 శాతం, సంజన గల్రానీ 5.63 శాతం ఓటింగ్‌తో చివరి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కే టైటిల్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. అయితే ఓటింగ్ లైన్స్ మరికొన్ని రోజులు ఓపెన్‌లోనే ఉంటాయి. దాంతో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని భావిస్తున్నారు.

ఫైనల్ ట్విస్ట్ ఉంటుందా?
డిసెంబర్ 21న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటింగ్ లైన్స్ ఇంకా ఓపెన్‌లో ఉండటంతో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ జరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అయితే, ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా పడాల పవన్ కళ్యాణ్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చివరి క్షణంలో ఎవరి అదృష్టం మారుతుందో చూడాలంటే... ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X