Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ స్టేజిపైకి మెగా హీరో.. టైటిల్ విన్నర్ అతడేనా?
Bigg Boss 9 Telugu: స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్‌కు ఎండ్‌కార్డ్ పడనుంది. ఊహించని ట్విస్టులు, ఎన్నడూ చూడని హై వోల్టేజ్ టాస్కులు, భావోద్వేగ క్షణాలు అన్నీ కలిపి ఈ సీజన్ ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. మరో నాలుగు వారాల్లో గ్రాండ్ ఫినాలే రానుండటంతో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది.గత వారం మొత్తం ఫ్యామిలీ డ్రామాతో సాగిన బిగ్ బాస్ హౌస్, ఈ వారం శనివారం ఎపిసోడ్‌ను మరింత స్పెషల్, ఎమోషనల్‌గా మార్చేందుకు బిగ్ బాస్ టీం పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ కంటెస్టెంట్స్‌కు సపోర్టుగా మెగా బ్రదర్ నాగబాబు బిగ్‌బాస్ స్టేజీ పైకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఎంటీ?
ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు బిగ్ బాస్ టీం భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు సపోర్ట్‌గా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సెలబ్రిటీలు స్టేజీపైకి రానున్నారు. కళ్యాణ్ పడాలకు సపోర్టుగా ఆయన తండ్రి, అన్నయ్య స్టేజ్‌పైకి వచ్చి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు. ఇక ఇమాన్యుయల్ కు సపోర్టు ఇవ్వడానికి అతని బ్రదర్ తో పాటు కామెడీ యాంకర్ ముక్కు అవినాష్ కూడా స్టేజీపై కనిపించనున్నారు. ఇదే విధంగా దివ్య నిఖితకు సపోర్ట్‌గా ఆమె తాతయ్య, ఒక సన్నిహిత ఫ్రెండ్ హాజరవుతారు. ఇక బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనుజకు ప్రత్యేకంగా సపోర్ట్‌గా ప్రముఖ టెలివిజన్ నటులు హరిత, పవన్ సాయి స్టేజీపైకి రానున్నారు. ఈ ప్రత్యేక అతిథుల ఎంట్రీలతో శనివారం ఎపిసోడ్ మరింత భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా ఉండనుంది.

అయితే, ఈ అందరి కంటే హైలైట్‌గా నిలవబోయే ఎంట్రీ మెగా బ్రదర్ నాగబాబు. భరణి కోసం నాగబాబు బిగ్ బాస్ స్టేజీపై అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం బయటకు రావడంతోనే ఇంటర్నెట్ మొత్తం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. నాగబాబు ఎంట్రీ అంటే మెగా ఫ్యాన్స్ పవర్, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆర్మీ అన్నమాట. వీరంతా ఓటింగ్‌లో దిగితే భరణి ఓటింగ్ గ్రాఫ్ అమాంతం ఆకాశాన్నంటుతుందని సోషల్ మీడియాలో వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నెటిజన్లు "నాగబాబు వచ్చాడంటే... భరణికే టైటిల్!" అని కామెంట్లు పెడుతున్నారు. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీలో ఇండస్ట్రీ నుంచి స్టేజీకి వచ్చిన సపోర్ట్ చాలా అరుదు. అలాంటి స్థాయిలో నాగబాబు రావడం భరణి పక్షాన భారీ మార్పులు తీసుకురాగలదని భావిస్తున్నారు.
భరణి జర్నీ విషయానికి వస్తే.. ఈ సీజన్ మొదటి నాలుగు వారాల్లోనే ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. లీడర్‌లా వ్యవహరించడం, హౌస్‌కి దిశా నిర్దేశం చేయడం, టాస్కుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించడం... ఇవన్నీ కలిసి భరణిని టైటిల్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో తనుజతో ఉన్న "తండ్రి-కూతురు" బాండ్, దివ్యతో ఉన్న "అన్న-చెల్లెలు" సంబంధం కారణంగా తీసుకున్న భావోద్వేగ నిర్ణయాలు అతన్ని 5వ వారం ఎలిమినేషన్‌కు దారితీశాయి. కానీ ప్రేక్షకుల ప్రేమ, సోషల్ మీడియాలో వచ్చిన భారీ డిమాండ్ కారణంగా భరణికి రీ-ఎంట్రీ లభించడం అతని పాపులారిటీని మరింత పెంచింది.
రీ ఎంట్రీ తర్వాత భరణి మళ్లీ తన పాత ఫామ్‌ను చూపించాడు. కానీ, అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో జారి గాయపడ్డారు. అయినా.. ఆగకుండా టాస్కుల్లో పాల్గొనడం, తన శక్తికొద్దీ ఫైట్ ఇవ్వడం... ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 11వ వారం నామినేషన్స్‌లో భరణి ఇచ్చిన ఫైట్ హౌస్‌లోనే కాకుండా బయట కూడా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో భరణికి ఊహించని సపోర్టు ఉంది. అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అలా భారీ ఓటింగ్ సంపాదించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నాగబాబు సపోర్ట్‌గా రావడం భరణి స్థాయిని మరో మూడు రెట్లు పెంచే అవకాశం ఉంది. విశ్లేషకుల ప్రకారం, నాగబాబు ఎంట్రీ తర్వాత భరణి ఓటింగ్ విపరీతంగా పెరిగి, అతను సునాయాసంగా టాప్ 3లోకి వెళ్లడమే కాకుండా టైటిల్ రేస్‌లో మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదగవచ్చు. ముఖ్యంగా షో చూడని మెగా ఫ్యాన్స్ కూడా "భరణి మనోడు" అంటూ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముంది.
మొత్తానికి, బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నుండి పూర్తిగా మరో మలుపు తిరగబోతోందని చెప్పచ్చు. భరణి ప్రస్తుతం ఉన్న పాజిటివ్ వేవ్, రీ-ఎంట్రీ హైప్, పర్ఫార్మెన్స్ గ్రోత్ అన్నీ కలిసి అతన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు నాగబాబు ఎంట్రీతో అది మరింత బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్‌కు వెళ్లడం ఖాయం, రన్నర్ అప్ అవ్వడం సాధ్యం, వీలైతే..టైటిల్ కూడా కైవసం చేసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బిగ్ బాస్ 9 టైటిల్ ఎవరి సొంతం అవుతుందో! ఇక ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











