Nikhil Nair Remuneration: నిఖిల్ నాయర్ షాకింగ్ ఎలిమినేషన్.. 5 వారాల రెమ్యూనరేషన్ ఇంతేనా ?
Nikhil Nair Remuneration: బిగ్‌బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఇక 10 వారం వీకెండ్ ఎపిసోడ్ షాకింగ్ ట్విస్ట్‌లతో నిండిపోయింది. నాగార్జున మాస్ ఎంట్రీ ఇచ్చి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. దీంతో హౌస్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక శనివారం నాడు మొదటి ఎలిమినేషన్ జరిపేశారు. పదో వారం నామినేట్ అయిన 10 మంది కంటెస్టెంట్స్‌లో నిఖిల్ నాయర్ కు ఎలిమినేషన్ షాక్ తగిలింది. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా వచ్చిన నిఖిల్, గత రెండు వారాలుగా తన ఆటతో ఆకట్టుకుని, "స్ట్రాంగ్ కంటెస్టెంట్" ట్యాగ్ తెచ్చుకున్న సమయంలోనే అతడ్ని హౌస్ నుంచి పంపిచేశారు. ఇలా 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ నాయర్ రెమ్యూనరేషన్ ఎంత?
వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో నిఖిల్ నాయర్ కూడా ఒకరు. అయితే..నిఖిల్ మొదట్లో ప్రెజెన్స్ తక్కువగా ఉన్నా.. తరువాత టాస్కుల్లో పరుగులు పెట్టడం, "బీబీ రాజ్యం" టాస్క్‌లో కమాండర్‌గా ఉండి కింగ్ అవ్వడం, కెప్టెన్సీ పోటీలో తనూజ, రీతూ లకు గట్టిపోటీ ఇవ్వడం వంటి టాస్కులతో నిఖిల్ గేమ్ స్ట్రాంగ్‌గా మారింది. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో నిఖిల్‌ను సపోర్ట్ చేస్తానని సంజన మాట ఇచ్చింది. కానీ, చివరికి తనూజను సపోర్ట్ చేయడం ట్వీస్ట్. చివరికి "నువ్వు కెప్టెన్ అయి ఉంటే సేవ్ అయ్యేవాడివి.. నా వల్లే నువ్వు పోయావ్" అని సంజన ఎమోషనల్ అయ్యింది.

మరోవైపు హౌస్‌మేట్స్ ముందుకు వచ్చాక నాగార్జున నిఖిల్‌ను మెచ్చుకున్నారు. "ఈ వారం నువ్వు నిజంగా సూపర్బ్ ఆట ఆడావ్, కింగ్ కూడా అయ్యావ్..కానీ, ఓట్లు సరిపోలేదు" అని కామెంట్ చేశారు. నీకు ఎవరిమీద నెగిటివ్ ఫీలింగ్ ఉందని నాగ్ అడిగినప్పుడు.. తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, భరణిలో సైలెన్స్, దివ్యలో ఒవర్ కమాండింగ్ నచ్చలేదని నిఖిల్ చెప్పాడు.
బిగ్ బాస్ 10 వారం ఓటింగ్ లో దివ్య, గౌరవ్, నిఖిల్ లు తక్కువ ఓటింగ్ పొంది, డేంజర్ జోన్ లో నిలిచారు. ఇక సోషల్ మీడియా పోల్స్ ప్రకారం ఆ వారం దివ్య ఎలిమినేట్ అవుతుందని చాలామంది అంచనా వేశారు. కానీ, 10 వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనీ, నిఖిల్ సీటుకు ఎసరు పెట్టారు. దీంతో "నిఖిల్ ఓటింగ్ పరంగా కాదు, ప్లానింగ్ వల్లే బయటకు పంపించబడాడు" అనే అనుమానం మొదలైంది. ముఖ్యంగా తనూజ దగ్గర ఉన్న "సేవింగ్ పవర్" దివ్యను సేవ్ చేయడానికి వాడబడింది, అందుకే నిఖిల్ ఔట్ అయ్యాడని సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది.
ఇక గౌరవ్ కూడా ఎలిమినేట్ కాబోతున్నాడనే టాక్ రావడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. బిగ్‌బాస్ 9లోకి వచ్చిన 6 వైల్డ్‌కార్డ్స్ అందరూ ఇప్పుడు హౌస్ బయటకే వెళ్లిపోయారు. రమ్య, మాధురి, అయేషా, సాయి శ్రీనివాస్ తర్వాత తాజగా నిఖిల్, గౌరవ్ కూడా ఔట్ కావడంతో "వైల్డ్‌కార్డ్స్‌కు ఈ సీజన్‌లో అసలు ఛాన్స్ ఇవ్వలేదు" అన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ వారం నిఖిల్ గేమ్‌లో ఇరగదీసినా, కింగ్ టాస్క్ గెలిచినా, కెప్టెన్సీ రేస్‌లో హైలైట్ అయినా కంటెస్టెంట్ ను కూడా బయటకు పంపారనే విషయంపై బిగ్ బాస్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నిఖిల్ నాయర్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. బిగ్ బాస్‌లో నిఖిల్ ప్రయాణం కేవలం 5 వారాలే ఉన్నా.. ఆ 5 వారాల్లో అతను ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ మారింది. బిగ్‌బాస్ కు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన నిఖిల్‌కు వారానికి దాదాపు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. అంటే ఐదు వారాలకు నిఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి 10 లక్షల వరకు సంపాదించి బయటకు వచ్చాడన్న మాట.
ఇక్కడ బిగ్ బాస్ లో నిఖిల్ ఎంత రెమ్యూనరేషన్ సంపాదించాడో అన్న దానికి కంటే.. మంచి గుర్తింపు, పబ్లిసిటీ తీసుకుని బయటకు వచ్చిన నిఖిల్ "బిగ్‌బాస్ 9లో స్ట్రాంగ్ ప్లేయర్‌గా నిలిచాడు" అనేది మాత్రం నిజం. అతని ఎలిమినేషన్ టాక్‌పై ఇంకా క్లారిటీ రాకపోయినా... ఓటింగ్ వల్లనా, ప్లానింగ్ వల్లనో నిఖిల్ ఎలిమినేట్ కావడం ఈ వారం బిగ్ ట్విస్ట్.


Click it and Unblock the Notifications











