Bigg Boss 9 Telugu 9 Week Elimination: బిగ్‌బాస్‌‌‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్.. అసలు ట్విస్ట్ అదే?

మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రతి వారం నామినేషన్లలో వచ్చే ట్విస్టులు, కంటెస్టెంట్స్ మధ్య తలెత్తే కాంట్రవర్సీలు, స్ట్రాటజీలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంటాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడనీ భావిస్తే.. టాప్ 5 కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారు. ఇంతకీ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? అసలేం జరిగింది?

ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. సింగర్ రామ్ రాథోడ్ (Ramu Rathod), మొదట్లో రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్‌లో చురుకుగా ఉండేవాడు. ప్రతి టాస్క్‌లలో యాక్టివ్‌గా పాల్గొంటూ, హౌస్ మేట్స్‌తో మంచి రిలేషన్లు కొనసాగించారు. రాము రాథోడ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే అయినా, రియాలిటీ షోలో స్ట్రాటజీ లేకపోవడం ఆయనకు నష్టమైంది. ఫైట్ చేయాల్సిన చోట సైలెంట్‌గా ఉండటం, టాస్క్‌లలో నెమ్మదిగా ఆడటం వల్ల ఆయన ప్రెజెన్స్ హౌస్‌లో తగ్గిపోయింది. అయితే ఆయనపై ఎటువంటి నెగిటివ్ భావన లేదు. తన పని తాను చూసుకునే స్వభావం ఉన్న ఆయన, గొడవల్లో దూరకుండా గేమ్ ఆడటమే ఇష్టపడ్డాడు.

Bigg Boss 9 Telugu Ramu Rathod s Shocking Self-Elimination Is Sai Srinivas Safe

అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి వచ్చిన తర్వాత రాము గేమ్‌లో పూర్తిగా మారిపోయాడు. క్రమంగా అతని యాక్టివిటీ తగ్గిపోయి, టాస్క్‌లలో కూడా ఆసక్తి చూపడం మానేశాడు. ఏ టాస్క్ వచ్చినా మధ్యలోనే "గివ్ అప్" అంటూ తప్పుకుంటున్నాడు. నామినేషన్ల సమయంలో కూడా "చేయండి.. వెళ్లిపోతా" అని నిరుత్సాహంగా స్పందించడం ప్రేక్షకుల్లో నెగిటివ్ ఫీలింగ్ కలిగించింది. అలాగే గత మూడు వారాల్లో ఉన్న రామ్ రాథోడ్ కు అంతగా ఓట్లు పోల్ కావడం లేదనే చెప్పాలి. ప్రతిసారి డేంజర్ జోన్ లోనే ఉంటున్నారు. ప్రతి సారి ఎలిమినేషన్ దగ్గర వరకు వెళ్లిన సందర్బాలు ఉన్నాయి.

సోషల్ మీడియా ఇన్ పుట్ ప్రకారం.. హోస్ట్ నాగార్జునతో రామ్ రాథోడ్ కన్వేక్షన్ రూమ్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంలో రాము తన మనసులోని బాధను బయటపెట్టాడు. "హౌస్‌లో ఉన్నా నా మనసు బయటే ఉంది. ఇంట్లో వాళ్లు బాగా గుర్తొస్తున్నారు. ఇక నేను కొనసాగలేను. అలాగే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి" అని చెప్పడంతో బిగ్ బాస్ రాము రాథోడ్ అభ్యర్థనను ఆమోదించి, అతన్ని సెల్ఫ్ ఎలిమినేట్ చేసే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ ఆదివారం రోజున జరుగుతుంది. ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఈ వారం సాయి శ్రీనివాస్ లీస్ట్ ఓట్లు సాధించాడు. దీని ప్రకారం చూస్తే.. ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ పక్కా అని అందరూ భావించారు. కానీ రాము రాథోడ్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడంతో, సాయి శ్రీనివాస్ తాత్కాలికంగా సేఫ్ అయ్యాడు. ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే.. పరిణామాలు మరోలా ఉంటాయి. రామ్ రాథోడ్ ను శనివారం హౌస్ నుండి పంపిస్తారు. ఆదివారం నాడు సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ ఆదివారం జరిగే అవకాశం ఉందని బిగ్ బాస్ అనలిస్టులు అభిప్రాయపడతున్నారు.

ఇక సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే, ఆయనకు ఫ్యాన్ బేస్ తక్కువ అయినప్పటికీ గేమ్‌ను క్లీన్‌గా ఆడుతున్నాడనే అభిప్రాయం ఉంది. "నేను పోటీ పడటానికి వచ్చా, ప్రాధేయపడటానికి కాదు" అని స్పష్టంగా చెప్పారు. రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ సాయికి ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. సాయి కూడా ముళ్లే ముఠా సర్దుకోవాల్సిందే. మొత్తం మీద, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదవ వారం మరో అంచనాలకతీత ట్విస్ట్‌తో సాగుతోంది. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ గేమ్ డైనమిక్స్‌ ఎలా మారుతాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X