TRP Rating: బిగ్‌బాస్ తెలుగు స‌రికొత్త రికార్డు.. ఐదేళ్ల టీఆర్పీ రేటింగ్ బ్రేక్..

Bigg Boss 9 Telugu TRP Rating: తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత పాపులారిటీ సంపాదించిన రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఒకటి. కానీ సీజన్ 9 మాత్రం రొటీన్ ప్యాటర్న్‌ను విభిన్నంగా సాగుతోంది. ఎన్నాడూ చూడని ట్విస్టులు, టాస్కులు, కాంట్రవర్సీలు అన్ని కలసి బిగ్ బాస్ షోను రణరంగంలాగా మార్చేస్తున్నాయి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్, వారానికి వారానికి కొత్తకొత్త ట్విస్టులతో దూసుకెళ్తుంది. ప్రేక్షకుల తాకిడి పెరుగుతుండటంతో వరుసగా టీఆర్పీ గ్రాఫ్ పెరుగుతోంది. గత సీజన్స్ కు నమోదైన రేటింగ్స్‌ కంటే ఎక్కువ రేటింగ్ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో గత ఐదేండ్ల రికార్డు బ్రేక్ చేసిందట. వివరాల్లోకెళ్తే..

బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తో ఈక్వెషన్స్ పూర్తిగా మారిపోయాయి. బిగ్ బాస్ సీజన్ 9లో ఒక ఎమోషనల్ ఎక్స్‌ప్లోజన్‌ను సృష్టిస్తోంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన కళ్యాణ్, డీమాన్, దివ్య వంటి కామనర్ కంటెస్టెంట్ల కుటుంబాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "మన వారే" అనే అటాచ్‌మెంట్‌ను కలిగించాయి. కళ్యాణ్ తల్లి మధ్యతరగతి పోరాటాలు, ఇమ్మానుయేల్ తల్లి ఉత్సాహకర మాటలు, దివ్య తల్లి చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ప్రేక్షకులను షోతో రీ కనెక్ట్ అయ్యేలా చేశాయి. మరి ముఖ్యంగా తనూజ గౌడ్ సిస్టర్ పెళ్లికూతురు లుక్ ఎపిసోడ్ మాత్రం ఫ్యామిలీ వీక్‌ను హైలెట్ చేయగా.. వీకెండ్ పవన్ పడాల తండ్రి మాటలు వైరల్ గా మారాయి.

Bigg Boss 9 Telugu TRP Rating Season Breaks 5-Year Records with Massive 11 2 TVR

ఇక 11 వారంలో దివ్య-తనూజ ల ఘర్షణ షోకు మరొక భారీ బజ్ తెచ్చింది. ఇద్దరు మహిళా కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న ఎమోషనల్ వార్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ ఫైట్ వల్ల దివ్య ఎలిమినేషన్ నుంచి తప్పించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక 12 వారం రీతూ సంజనల మధ్య జరిగిన డైలాగ్ వార్ మాత్రం పీక్స్ .. ఇద్దరూ తమ వాద ప్రతివాదనలతో హౌస్ ను హీటెక్కించారు.ఇలా బీబీ బాస్ హౌస్ లోకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వడం, స్పెషల్ ఎపిసోడ్‌లకు సెలబ్రెటీలు, నాగబాబు స్పెషల్ ఎంట్రీ అని బిగ్ బాస్ సీజన్ 9 ను హైలెట్ చేస్తున్నాయి.

ఇలా రొటిన్ కు భిన్నంగా సాగుతోన్న బిగ్ బాస్ సీజన్ 9 అరుదైన రేటింగ్ నమోదు అయినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. గత నాలుగు సీజన్లలో కంటే.. ఈ సారి వీకెండ్ ఎపిసోడ్స్ కు భారీ రేటింగ్ నమోదవుతుండట. బిగ్ బాస్ సీజన్ 9 TRP పర్ఫార్మెన్స్ క్రమంగా పెరుగుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకూ సగటుగా 8.4 TVR ఉంటే.. వీకెండ్‌లో 13.4 TVR నమోదవుతుందట. ఇలా మొత్తం సీజన్ సగటుగా 11.2 TVR నమోదు అయినట్టు తెలుస్తోంది. ఇది తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్‌కు బిగ్ సక్సెస్ అని చెప్పవచ్చు. వాస్తవానికి రియాలిటీ షోలలో సాధారణంగా మధ్య సీజన్‌లో TRP పడిపోతుంటుంది. కానీ, ఈసారి సీజన్ 9 ఫ్యామిలీ వీక్ను టర్నింగ్ పాయింట్‌గా మార్చి రేటింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

ఇలా రికార్డు స్థాయిలో రేటింగ్ పెరగడానికి కంటెస్టెంట్స్ ఆటతీరు మాత్రమే కాదు.. నాగార్జున హోస్టింగ్ కూడా మరో ముఖ్య కారణం. అతని ఇంటెన్స్ వీకెండ్ చర్చలు, కంటెస్టెంట్లకు సలహాలు, కొన్ని సందర్భాల్లో ఆయన మాస్ వార్నింగ్స్, ప్రేక్షకుల ఇంటరెస్ట్‌ అన్ని కలిపి అరుదైన రికార్డు క్రియేట్ చేయడానికి కారణమయ్యాయి. ఇది గత ఐదేళ్లలో ఏ బిగ్ బాస్ తెలుగు సీజన్ సాధించలేని రికార్డు. టీవీ ప్రేక్షకుల భారీ స్పందన ఈ సీజన్‌ను పూర్తిగా లీడర్‌ బోర్డ్ టాప్‌కు తీసుకొచ్చింది. ఇలా బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ సక్సెస్ పుల్ గా దూసుకెళ్తుంది. మొత్తంగా చూస్తే.. బిగ్ బాస్ తెలుగు 9 చివరి వారాల్లోకి అడుగుపెట్టినకొద్దీ, గేమ్ రేంజ్ పెరిగిపోగా, ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ మరింత టాప్ లెవెల్‌కి చేరుకుంది. గ్రాండ్ ఫినాలే వరకు ఇంకా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: nagarjuna bigg boss telugu trp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X