Bigg Boss 9 Telugu 13th Week Voting: ఓటింగ్‌లో అనూహ్య పరిణామం.. రీతూకు ఎదురుదెబ్బ.. ఈ వారం ఎలిమినేట్ ఎవరు?

Bigg Boss 9 Telugu 13th Week Voting: బిగ్‌బాస్ సీజన్ 9లో క్లైమాక్స్ లోకి ప్రవేశించడంతో ఉత్కంఠ భరితంగా మారింది. హౌస్‌లో టెన్షన్, డ్రామా, గేమ్ ప్లానింగ్ మితిమీరిన స్థాయికి చేరుకుంది. గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి టాస్క్, ప్రతి నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లు ప్రారంభమయిన తర్వాత గేమ్ షోలో ఉత్కంఠ మరింత పెరిగింది. హౌస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. ఇక ప్రేక్షకుల్లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? టాప్ 5లో ఎవరుంటారు? టైటిల్ విన్నర్ ఎవరు? అన్నదే చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో 13వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారు? ఓటింగ్ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే వివరాలు మీ కోసం..

బిగ్‌బాస్ సీజన్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో భారీ డ్రామా, ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. గ్రాండ్ ఫినాలే టాస్క్ లో వరుస విజయాలతో ఎవరూ ఆపలేని దూకుడులో ఉన్న కళ్యాణ్ పడాల మరో గ్రాండ్ విక్టరీ కొట్టి, సీజన్ చివరి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు, టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలుస్తూ టైటిల్ రేస్‌లో ముందంజలో నిలిచారు. సీజన్ ప్రారంభం నుంచి సామాన్యుడిగా, సైలెంట్‌గా ఆడిన కళ్యాణ్, చివరి వారాల్లో అసలైన సైనికుడిలా మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తనూజ కంటే ఓ అడుగు ముందుకేసి, కెప్టెన్సీతో పాటు ఫినాలే టికెట్‌ను సొంతం చేసుకోవడంతో టైటిల్‌కి మరింత చేరువ అయ్యాడు.

Bigg Boss 9 Telugu Voting Thanuja Leads the 13th Week Race Ritu Sanjana Suman Shetty in Danger Zone

ఇదిలాఉంటే.. 13వ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు చెబుతూ.. వారి కారణాలు తెలిపి, బాటిల్స్ పగులగొట్టి నామినేట్ చేయాలి. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. తీవ్ర వాదనలు, కౌంటర్లు, భావోద్వేగ క్షణాలు.. ఇలా హోరాహోరీగా సాగిన ఈ రౌండ్‌లో చివరకు సంజన గల్రానీ, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజా పుట్టస్వామి, భరణి శంకర్ నామినేషన్‌లో నిలిచారు. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా నామినేట్ కావడంతో హౌస్‌లో టెన్షన్ క్లైమాక్స్ స్థాయికి చేరింది. ఎవరు బయటకు వెళ్లబోతున్నారు? ఎవరికీ ఎక్కువ ఓట్లు వస్తాయి? అనే సందేహాలతో హౌస్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగిపోయింది.

ఇక 13వ వారం ఆన్‌లైన్ ఓటింగ్ ఊహించని మలుపులు తీసుకుంటోంది. నామినేషన్స్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో భారీ ఓటింగ్ వేవ్ ప్రారంభమైంది. ఫ్యాన్ పేజీలు, అనధికార పోల్స్, ఓటింగ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ప్రకారం.. ప్రస్తుతం తనూజా పుట్టస్వామి ఇంతవరకు లేనంతటి ఓటింగ్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. తనూజ దాదాపు 27.5 శాతం ఓట్లతో టాప్ లో నిలిచింది. ముఖ్యంగా ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడంతో అతనికి వచ్చే ఓట్లలో ఎక్కువ శాతం తనూజ వైపే మళ్లినట్లు కనిపిస్తోంది. రెండో స్థానంలో డిమాన్ పవన్ ఉండటం గమనార్హం. టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో జరిగిన డ్రామా అతని ఇమేజ్‌కి ఒక రకమైన పబ్లిసిటీగా మారి, అతడికి 16.25 శాతం ఓట్లు రావడానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక భరణి శంకర్ 15.36 శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు. ఫినాలే రేసులో ఓడిపోయినా.. ఫ్యాన్‌బేస్ అతడిని టాప్ 3 లో ఉంచినట్టుగా కనిపిస్తోంది. అయితే గత రెండు రోజుల్లో ఓటింగ్‌లో భారీ పతనం రావడంతో రీతూ చౌదరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆమె ప్రస్తుతం 13.93 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక సంజన గల్రానీ 13.49 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంది. కానీ, ఆమె కూడా ఎలిమినేషన్ జోన్ నుంచి పూర్తిగా బయటపడలేకపోయింది. ఇక అత్యంత క్లిష్ట పరిస్థితి సుమన్ శెట్టిది. ఒక్కో టాస్క్‌లోనూ ఫామ్ తిరగకపోవడంతో ఓటింగ్ క్రమంగా పడిపోయి ప్రస్తుతం 13.47 శాతం ఓట్లతో బాటమ్‌లో నిలిచాడు.

ఈ మొత్తం ట్రెండ్‌ను చూసినప్పుడు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అత్యధిక అవకాశాలు సుమన్ శెట్టికే ఉన్నట్లు బిగ్ బాస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రీతూ, సంజన ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఓటింగ్ శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగుతుండటంతో, చివరి గంటల్లో ఫ్యాన్ వేవ్ ఏదైనా దిశగా తిరగవచ్చు. అందుకే ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్నదాన్ని చివరి నిమిషం వరకు చెప్పడం కష్టమే.

More from Filmibeat

Read more about: bigg boss telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X