Bigg Boss 9 Telugu 10th Week Voting: ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ ఉల్టా పల్టా.. డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) తుది దశలోకి అడుగుపెడుతోంది. ఈ సీజన్ ముగిసేందుకు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉండటంతో, హౌస్‌లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు తొమ్మిది వారాల్లో అనేక ఎలిమినేషన్లు, రీ-ఎంట్రీలు, సీక్రెట్ టాస్క్‌లు జరిగినా ఈ వారం జరిగిన నామినేషన్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా, ఊహించని రీతిలో సాగాయి. ఎందుకంటే, ఈసారి బిగ్ బాస్ నేరుగా 11 మందిలో 10 మందిని నామినేట్ చేయడం హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కేవలం కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే సేఫ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? మీరూ ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా విరుద్దంగా సాగింది. గార్డెన్ ఏరియాలో హౌస్‌మేట్స్‌ని షవర్ కింద కూర్చోబెట్టి, ఎవరు నామినేట్ అయితే వారి మీద బురద నీరు పడేలా సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈసారి నామినేషన్స్ కేవలం మాటల యుద్ధం కాదు, నిజంగా "బురద యుద్ధం"గా మారాయి. ప్రతి కంటెస్టెంట్‌కి నామినేట్ చేసే సమయం కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఇవ్వడం ద్వారా బిగ్ బాస్ ఒత్తిడి వాతావరణం సృష్టించాడు. ఈ పరిస్థితుల్లో కంటెస్టెంట్స్ భావోద్వేగంగా, కొంతమంది వ్యూహాత్మకంగా తమ నిర్ణయాలు తీసుకున్నారు.

Bigg Boss 9 Telugu Week 10 Voting Update Kalyan Thanuja Lead Gaurav Shocks All

నామినేషన్స్ ప్రక్రియలో భరణిని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశారు. "కెప్టెన్సీ టాస్క్‌లో తనుజ కోసం గివ్-అప్ చేయడం నచ్చలేదు" అని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ తో హౌస్ లో మాటల యుద్దం మొదలైంది. ఆ తర్వాత రీతూ చౌదరి, దివ్య నిఖితపై "నువ్వు హౌస్‌లో ఒక గ్యాంగ్‌ను సృష్టించి, అవసరం వచ్చినప్పుడు వాళ్లను నీ బాణాల్లా వదులుతావు" అంటూ మానిప్యులేషన్ ఆరోపణలు చేసింది. దానికి దివ్య దీటుగా స్పందిస్తూ "నా మాట విన్నంత మాత్రాన వాళ్లు చిన్నపిల్లలా చేస్తారా?" అంటూ గట్టిగా సమాధానమిచ్చింది. ఈ వాదనతో వాతావరణం మరింత వేడెక్కింది.

ఇదే క్రమంలో గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీని నామినేట్ చేస్తూ.. "నీ ఆటలో సరైన ప్రదర్శన లేదు, కేవలం ఎమోషనల్ డ్రామా మాత్రమే కనిపిస్తోంది" అని విమర్శించాడు. దీనికి కౌంటర్‌గా సంజనా కూడా వెంటనే గౌరవ్‌ను తిరిగి నామినేట్ చేస్తూ "నువ్వు లాజిక్ పేరుతో ఎమోషనల్ గేమ్ ఆడుతున్నావు" అని బదులిచ్చింది. ఇక భరణి, దివ్యను నామినేట్ చేయడం మాత్రం హౌస్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఒకరిపై మరొకరు మాటల యుద్దం ప్రకటించుకున్నారు. పరిస్థితి తారాస్థాయికి చేయడంతో బిగ్ బాస్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అందరూ తమ నామినేషన్స్ పూర్తి చేసేసరికి, హౌస్‌లో కొంత శాంతి నెలకొంటుందనుకున్నారు. కానీ, బిగ్ బాస్ తన స్టైల్‌లో అసలు ట్విస్ట్ బయటపెట్టాడు. నేరుగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ, "మీ ఆట, మీ ప్రవర్తన, మీ పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే సమయం వచ్చింది. అందుకే, ఈ వారం అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను!" అంటూ షాక్ ఇచ్చాడు. అంతే కాదు, "ఈ నామినేషన్స్ మీ కళ్లు తెరిపిస్తాయో లేక బిగ్ బాస్ గేట్లు తెరుస్తాయో చూద్దాం" అని చెప్పడం ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద ట్విస్ట్‌గా నిలిచింది.

ఇక కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ విషయంలో కూడా బిగ్ బాస్ మరో కొత్త మలుపు ఇచ్చాడు. కెప్టెన్సీ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీని ఉపయోగించుకోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని హౌస్‌మేట్స్‌కే వదిలేశాడు. ఓటింగ్‌లో భరణి తప్ప మిగతా అందరూ ఇమ్మాన్యుయేల్ సేఫ్ అవ్వాలని ఓటేశారు. దీంతో ఇమ్మాన్యుయేల్ మాత్రమే ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో భరణి శంకర్, దివ్య నిఖితా, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్ ఇలా పది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ లో నిలిచారు.

ఇక నామినేషన్స్ అనంతరం సోషల్ మీడియాలో ఓటింగ్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు భారీ ఎత్తున ఓట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఓటింగ్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం.. కళ్యాణ్ పదాల 22.14 శాతం, తనూజ 21.97 శాతం ఓటింగ్ తో టాప్ లో కొనసాగుతున్నారు. వీరి తర్వాత ఎవరూ ఊహించని విధంగా గౌరవ్ గుప్తా 13.22 శాతం కైవసం చేసుకుని మూడో స్థానంలో నిలిచారు. ఇక భరణి 12.84 శాతం ఓట్లు సాధించగా.. రీతూ చౌదరి 10.7 శాతం ఓట్లు కైవసం చేసుకుని సేఫ్ జోన్ నిలిచినట్లు తెలుస్తోంది.

ఇక సంజనా 5 శాతం, సుమన్ శెట్టి 4.62 శాతం, డీమాన్ పవన్ 3.36 శాతం, దివ్య 3.07 శాతం, నిఖిల్ 2.78 శాతం ఓట్లు సాధించారు. అయితే.. తక్కువ ఓటింగ్ పొందటంతో ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓటింగ్ పూర్తి కావడానికి మరింత సమయంలో ఉండటంతో ఏ క్షణంలో నైనా ఓటింగ్ శాతం మారవచ్చు. మొత్తం మీద, పదో వారంలో బిగ్ బాస్ ఇచ్చిన ఈ "ఆల్ నామినేషన్ ట్విస్ట్" షోను మరోసారి ట్రాక్ మార్చే స్థాయికి తీసుకెళ్లింది. మరి ఈ వారం ఎవరు గేట్లు దాటుతారు, ఎవరు ఫైనల్ దిశగా అడుగులు వేస్తారు అనేది ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X