Bigg Boss 9 Telugu Week 11 Voting: కాలర్ ఎగరేస్తున్న కళ్యాణ్... డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్

Bigg Boss 9 Telugu Week 11 Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోని పదకొండో వారం నామినేషన్ల పర్వం రసవత్తరంగా జరిగింది. ఈ సమయంలో చోటు చేసుకున్న స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా హౌస్‌ను ఒక్కసారిగా హీటెక్కించింది. గతంలో ఎన్నాడూ లేని విధంగా ఈ వారం జరిగిన నామినేషన్స్, రీతూ-డెమన్ పవన్ ఫైట్, ఫ్యామిలీ వీక్ స్టార్ట్, మరోవైపు,ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ అన్నీ కలిపి షోకి మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో 11 వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోని పదకొండో వారం నామినేషన్స్ ప్రాసెస్‌ చూస్తే.. బిగ్ బాస్ టీం స్పెషల్‌గా డిజైన్ చేసినట్టుగా ఉంది. కెప్టెన్ తనూజ చేతికి నామినేషన్స్ పవర్స్ ఇచ్చి, ఆమెకు నచ్చిన వారికి 1,2 టోకెన్లు ఇచ్చారు. నిర్దిష్ట టైమ్‌లో దిష్టిబొమ్మను పగలగొట్టడం ద్వారా నామినేట్ చేయాలనే రూల్ పెట్టారు. ప్రాసెస్ మొత్తం చూస్తుంటే... "కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బిగ్ బాసే, కంటెస్టెంట్స్ కేవలం యాక్టర్స్ మాత్రమే" అన్నట్టు అనిపించింది. ఈ నామినేషన్స్ తో పాటు ఫ్యామిలీ వీక్ స్టార్ట్ కావడంతో హౌస్‌లో ఎమోషన్స్ మరింత పెరిగాయి. అయితే స్క్రీన్‌పై కనపడిన డ్రామా,కంటెస్టెంట్ల డైలాగ్ వార్ చూస్తే.. "ఇది పక్కా ప్లానింగ్" అనేది సోషల్ మీడియాలో కామన్ టాక్‌గా మారింది.

Bigg Boss 9 Telugu Week 11 Voting Kalyan Leads Demon Pawan Sanjana Divya in Danger Zone

నామినేషన్ టాస్క్‌లో ఎక్కువగా టార్గెట్ అయిన కంటెస్టెంట్ రీతూ చౌదరి. మొదట రీతూ-ఇమ్మూ మధ్య వాగ్వాదం చెలరేగింది. మరోవైపు డెమోన్ పవన్ కూడా రెండు టోకెన్లతో ఫస్ట్ కళ్యాణ్, తరువాత రీతూని నామినేట్ చేశారు. రీతూ విషయంలో "నీ వల్ల నాకు ఎప్పుడూ తప్పు నాదే అన్న భావన వచ్చింది" అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య క్లోజ్ బాండ్, లవ్ యాంగిల్ హైలైట్ గా మారింది. పవన్ గట్టిగా అరవడం, రీతూ ఏడవడం ఎపిసోడ్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఇంతగా రీతూని టార్గెట్ చేస్తూనే, చివర్లో కెప్టెన్ పవర్‌తో తనూజా రీతూని సేవ్ చేయడం... "ఇది కూడా స్క్రిప్ట్‌లో భాగమే" అనే చర్చకు దారితీసింది.

ఎవరెవరు నామినేట్ అయ్యారు?
నామినేషన్స్ పూర్తయ్యేసరికి 11 వ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా ఉన్నారు. రీతూ చౌదరి మీద మొత్తం హౌస్ ఫైర్ అయినా.. కెప్టెన్ తనూజ .. ఆమెను సేవ్ చేయడంతో నామినేషన్స్ లిస్ట్ నుంచి ఆమె తప్పించుకోవడం ఎపిసోడ్ కు హైలెట్ అని చెప్పాలి.

ఇక 11వ వారం ఓటింగ్ సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి జోరుగా కొనసాగుతోంది. సోషల్ మీడియా పోల్స్, ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. మరోసారి కళ్యాణ్ పడాల ఫ్యాన్ బేస్ సత్తా చాటుతోంది. 34.44 శాతం ఓట్లతో టాప్‌లో దూసుకెళ్తున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ దాదాపు మూడు వారాల గ్యాప్ తర్వాత నామినేషన్స్‌లోకి వచ్చినా, 23.55 శాతం ఓట్లతో సెకండ్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నారు. గత పదివారాల్లో మూడు సార్లు కెప్టెన్, ఇమ్మ్యూనిటీ పవర్ వల్ల సేఫ్‌గా ఉన్న ఇమ్మూ, ఇప్పుడు కూడా ఓట్లతో సెఫ్ జోన్‌లోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇక భరణి 16.61% ఓట్లతో మరోసారి సత్తా చాటుకున్నారు. థర్డ్ పొజిషన్‌లో నిలుస్తూ తన ప్లేస్‌ను కన్‌ఫర్మ్ చేసుకున్నాడు.ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

డేంజర్ జోన్‌లో ఎవరు?
డెమోన్ పవన్ 11.14 శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో, సంజనా 7.84 శాతం ఓట్లతో 5వ శాతంలో, దివ్య 6.41 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్‌ ప్రకారం వీళ్లు డేంజర్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ, శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగుతుండటంతో, ఫలితాలు మారే ఆస్కారం ఉంది. మరోవైపు.. బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. ఈ వారం ఎలిమినేషన్ నిజంగా జరుగుతుందా? డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య - సంజన - డెమోన్ లో ఎవరైనా బయటకు వెళ్లారా? రీతూ - డెమోన్ ట్రాక్‌పై ఇంకా ఎన్ని డ్రామాలు చూడబోతున్నామా? అన్న సందేహాలు కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X