Bigg Boss 9 Telugu Week 11 Voting: దుమ్మురేపుతోన్న కళ్యాణ్.. డేంజర్ జోన్‌లో ఆ టాప్ కంటెస్టెంట్స్?

Bigg Boss 9 Telugu Week 11 Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ కు ఎండ్ కార్డు పడబోతుంది. ఈ నేపథ్యంలో పదకొండో వారం హౌస్ లో పలు ఆసక్తికర పరిణమాలు చోటు చేసుకుంటాయి. నామినేషన్స్ తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్.. ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ప్రతి లెవెల్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సాగుతోంది. ముఖ్యంగా ఈ వారం రీతూ-డెమోన్ పవన్ ల ఫైట్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ, అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఓటింగ్ ప్యాటర్న్స్.. ఇవన్నీ కలిపి రియాలిటీ షోకి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో 11 వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఓటింగ్‌లో ఎవరు సత్తా చాటుతున్నారు? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? అనేది ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ సీజన్ 9 లో 11 వారం నామినేషన్ టాస్క్ పూర్తిగా సినిమా స్టైల్‌లో ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా కెప్టెన్ తనూజాకే నామినేషన్ పవర్ ఇచ్చి, ఆమెను నచ్చిన కంటెస్టెంట్స్‌కు 1,2 టోకెన్లు ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో దిష్టిబొమ్మను పగలగొట్టడం ద్వారా సరైన కారణాలతో నామినేషన్ చేయాలని రూల్ పెట్టారు బిగ్ బాస్. ఈ మొత్తం ప్రాసెస్ చూసిన వారు 'బిగ్ బాస్ స్క్రీప్టెడ్ అని, కంటెస్టెంట్స్ కేవలం యాక్టర్స్" అనే కామెంట్లు చేస్తున్నారు. టాస్క్‌తో పాటు ఫ్యామిలీ వీక్ ప్రారంభమవడంతో హౌస్‌లో ఎమోషన్స్ డబుల్ అయ్యాయి. కొందరు కంటెస్టెంట్స్ మాటల్లో నిజాయితీ కనిపించగా, కొందరి యాక్టింగ్ స్పష్టంగా కనిపించిందని నెటిజన్లు స్పందిస్తున్నారు.

Bigg Boss 9 Telugu Week 11 Voting Results Kalyan in Top Demon Pawan Sanjana Divya in Danger Zone

ఇక 11వ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి ఎక్కవ టార్గెట్ అయింది. మొదట రీతూ-ఇమ్మూ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. తరువాత డెమోన్ పవన్ కూడా రీతూను టార్గెట్ చేయడం బిగ్ బాస్ ప్రేక్షకులను షాక్ గురి చేసింది. "నీ వల్ల నాకు ఎప్పుడూ తప్పు నాదేనన్న భావన వచ్చింది" అంటూ ఏడ్చేయడం, రీతూ కూడా భావోద్వేగానికి గురవడం ఎపిసోడ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. వీరిద్దరి బాండ్, వారి మధ్య ఉత్కంఠ, లవ్ యాంగిల్ వంటి అంశాలు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయ్యాయి. ఈ అంతా జరిగిన తర్వాత కెప్టెన్ తనూజ చివర్లో రీతూని సేవ్ చేయడం ఎపిసోడ్ కే కాదు, సీజన్ మొత్తానికి హైలెట్ అనే చెప్పాలి.

కెప్టెన్ తనూజ ద్వారా రీతూ చివరి క్షణంలో సేవ్ కావడంతో ఈ వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అందులో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్ (ఇమ్మూ), డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా లు నామినేషన్స్ లో నిలిచారు. ఇలా ఆరుగురు నామినేషన్స్ లో నిలిచారు. ఈ లిస్ట్ బయటకి వచ్చిన వెంటనే.. బిగ్ బాస్ లవర్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ సేవ్ చేయడానికి ఆన్‌లైన్ ఓటింగ్ లో పాల్గొంటున్నారు.

ఓటింగ్ ట్రెండ్స్ 75 శాతం ఓట్లు ముగ్గురికే!
సోమవారం నుండి ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే అభిమానులు భారీగా ఓటింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఆన్‌లైన్ ట్రెండ్స్ ప్రకారం టాప్ 3 కంటెస్టెంట్స్ మొత్తం 75 శాతం ఓట్లు సాధించారు. అందులో కళ్యాణ్ పడాల 32.72 శాతం ఓట్లతో దూసుకెళ్తున్నారు. కేవలం ఈ వారంలోనే కాదు..వరుసగా పలువారాల ఓటింగ్ లో కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు. ఇక ఈ వారం కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ మూడు సార్లు కెప్టెన్ గా కావడం, ఇమ్మ్యూనిటీ ఆధారంగా సేఫ్‌గా ఉన్న ఇమ్మూ, ఈసారి నామినేట్ అయ్యినా 26.65 ఓట్ల ద్వారా మళ్లీ సేఫ్ జోన్‌లోకి వచ్చాడు. ఇక భరణి శంకర్ కూడా దుసుకెళ్తున్నారు. తన ఫ్యాన్ బేస్‌ 15.69 శాతం ఓటింగ్ తో 3 వ స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. ఈ ఓటింగ్ చూస్తే.. ఈ ముగ్గురు కంటెస్టెంట్లు ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్టు తెలుస్తోంది.

డేంజర్ జోన్ టాప్ కంటెస్టెంట్స్..
ఇక డెమోన్ పవన్ 9.47 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో, సంజనా 8.94 ఓట్లతో ఐదో స్థానంలో, దివ్య 6.53 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠభరితంగా మారింది.కానీ, ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లు టెలికాస్ట్ అవుతున్నందున భావోద్వేగాలు ఓటింగ్ ప్యాటర్న్‌ను మార్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి దివ్యకు తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కవగా ఉంది. ఇక సంజన-డెమోన్ పవన్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

అయితే.. ఈ వారం బిగ్ బాస్ నిజంగా ఎలిమినేషన్ చేస్తాడా? లేక సర్‌ప్రైజ్ ట్విస్ట్ ఉంటుందా? డేంజర్ జోన్‌లోని ఎవరు సేఫ్ అవుతారు?రీతూ - డెమోన్ ట్రాక్‌లో కొత్త ట్విస్ట్ వస్తుందా? ఫ్యామిలీ వీక్ ప్రభావంతో ఓటింగ్ ట్రెండ్ మారుతుందా? అనేది సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదకొండో వారం... సస్పెన్స్, ఎమోషన్, డ్రామాతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ఇక శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓటింగ్ కొనసాగుతుండటంతో చివరి నిమిషం వరకు ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X