Bigg Boss 9 Telugu 12th Week Voting: బిగ్‏బాస్ ముద్దుబిడ్డ దూకుడు.. ఓటింగ్‏లో వెనుకబడ్డ టాప్ 5 కంటెస్టెంట్స్.

Bigg Boss 9 Telugu 12th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పడు 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఇంకో మూడు వారాల్లో ఈ సీజన్ కు కూడ ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో అప్పుడే బిగ్ బాస్ విన్నర్, రన్నరప్, టాప్-5 కంటెస్టెంట్ల పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 12వ వారం జరిగినా నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. ఈ నామినేషన్ వార్ తో కంటెస్టెంట్ల మధ్య కల్లోలం చోటుచేసుకుంది. ఇంతకీ ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఓటింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? వివరాల్లోకెళ్తే..

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్.. 12 వారంలోకి అడుగుపెట్టింది. గ్రాండ్ ఫీనాలే కు చేరువతున్న కొద్దీ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య సైకాలజికల్ వార్ పీక్‌కు చేరింది.గత వారంత హోస్ట్ నాగార్జున ఆశ్చర్యపరిచే విధంగా "ఈ వారం నో ఎలిమినేషన్" అని ప్రకటించడంతో హౌస్‌లో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోఈ వారం రెండు దశల నామినేషన్ స్ట్రక్చర్ ఫాలో చేశారు. మొదటి దశలో ప్రైవేట్ నామినేషన్. హౌస్‌మేట్స్ ఒక్కొక్కరు డెన్‌లోకి వెళ్లి, నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి పేరును కార్డుపై రాసి బాక్స్‌లో వేసి, తన అసహనాన్ని ప్రజల ముందు చెప్పాలి.

Bigg Boss 9 Telugu Week 12 Voting Thanuja Kalyan Lead Suman Bharani Divya Into Danger Zone

ఇలా మొదటగా ఇమ్మాన్యుయేల్ వచ్చి డీమాన్ పవన్‌ను నామినేట్ చేశారు. "కంటెండర్‌గా వచ్చిన తర్వాత ఫైటింగ్ స్పిరిట్ తగ్గింది... ఇతరుల కోసం ఆడుతున్నాడు" అని పేర్కొన్నారు. తరువాత కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ, "గిఫ్ట్ ఇచ్చేవారినే పట్టించుకుంటాడు" అని విమర్శించాడు. అయితే భరణి చేసిన నామినేషన్ హౌస్‌లో పెద్ద షాక్. అతను తనుజను నామినేట్ చేస్తూ, "దివ్య-తనుజ గొడవలో నా పేరును అనవసరంగా లాగారు... చిన్న పిల్లల్లాగా ప్రవర్తించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీమాన్ పవన్ వచ్చి కళ్యాణ్‌ను నామినేట్ చేస్తూ, "ఏడు వారాలుగా నాకు కంటెంట్ ఇచ్చే అవకాశాలు బ్లాక్ చేశాడు" అని ఆరోపించాడు. ఇక ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ దివ్య నుంచి వచ్చింది. ఆమె నేరుగా భరణినే నామినేట్ చేస్తూ, "నాకు అవసరమైనప్పుడు భరణీ లేదు, ఎన్నిసార్లు మోసం చేశాడు" అని ఎమోషనల్‌గా కామెంట్స్ చేసింది.

ఈ ప్రక్రియ పూర్తి కాగానే.. ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ నిర్వహించారు. ఈ నామినేషన్స్ తో హౌస్ షేక్ అయ్యింది. ముఖ్యంగా డీమాన్,కళ్యాణ్ ల మధ్య జరిగిన ఫిజికల్ క్లాష్, హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్‌తో ఎపిసోడ్ హై వోల్టేజ్ గా మారింది. చివర్లో సంజన-రీతూ మధ్య మాటల తూటాలు మరింత తీవ్రత తెచ్చాయి. కెప్టెన్ రీతూ నామినేషన్స్‌లో సంజనను నామినేట్ చేస్తూ.. "నీ గేమ్ కనిపించడం లేదు" అని కామెంట్ చేసింది.

దీనికి సంజన కౌంటర్ ఇస్తూ రీతూపై వ్యక్తిగత కామెంట్స్ చేసింది. "డీమాన్‌తో నువ్వు రాత్రంతా అంటుకొని తిరగడం నేను చూడలేను" అన్న సంజన మాటలకు హౌస్‌మేట్స్ షాక్ అయ్యారు. సంజనకు సపోర్టు చేసే ఇమ్మానుయేల్ కూడా "మీరు తప్పుగా మాట్లాడుతున్నారు" అంటూ హెచ్చరించినా, సంజన వెనక్కి తగ్గలేదు. ఈ మధ్య దివ్య-తనూజ మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి. ఇరువురు ఒకరినొకరు నామినేట్ చేసినా, ఎమోషనల్ మాటల తర్వాత హగ్ చేసుకొని ఫ్రెండ్స్ అయ్యారు.

ఇలా రసవత్తరంగా సాగిన నామినేషన్స్ లో మొత్తం 8 మంది నామినేట్ కాగా. కెప్టెన్ రీతూ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచింది. నామినేట్ అయిన వారిలో తనూజ పుట్టాస్వామి, కళ్యాణ్ పడాలా, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి , దివ్య నిఖితా ఉన్నాయి. ఇక తమ అభిమాన కంటెస్టెంట్స్ ను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఓటింగ్ పాల్గొంటున్నారు.ఈ వారం నామినేషన్స్‌లో ఎదురు చూసినట్లే కఠినమైన పోటీ కొనసాగుతోంది.

సోషల్ మీడియా పోల్స్, ఆన్ లైన్ ట్రెండ్స్ చూస్తే.. తనూజ పుట్టాస్వామి మరోసారి దూసుకెళ్తుంది. 30.07 శాతం ఓటింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత కళ్యాణ్ పడాలా రెండో స్థానంలో నిలిచారు. 28.23 శాతం ఓటింగ్ తో తలపడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉన్నట్లు కనిపిస్తోంది.ఇక ఇమ్మాన్యుయేల్ 3వ స్థానంలోనిలిచారు. ఇతడు 11 శాతం ఓటింగ్ తో నిలిచాడు.

ఇక హౌస్ లో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన సంజన గల్రాణీ 6.92 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ వారం హౌస్‌లో ఫిజికల్ ఫైట్లకు కారణమైన డీమాన్ పవన్ ఓటింగ్‌లో మాత్రం 6.29 శాతం ఓట్లు మాత్రమే సాధించాడు. ఆయన తర్వాత సుమన్ శెట్టి 5.96 శాతం ఓట్లు, భరణి 5.93 శాతం ఓట్లుతో మరోసారి బాటమ్ జోన్‌లోకి జారిపోయారు. జాబితాలో చివరగా దివ్య నిఖితా 5.6 శాతం ఓట్లు తో డేంజర్ జోన్ లో ఉంది.

ఈ ఓటింగ్ చూస్తే.. టాప్ 2లో తనూజ vs కళ్యాణ్ మధ్య తలసరి పోటీ నెలకొన్నప్పటికీ, బాటమ్‌లో సుమన్, భరణి, దివ్య త్రయం ఎలిమినేషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్ కి శుక్రవారం అర్థరాత్రి వరకు అవకాశం ఉండటంతో ఏ క్షణమైనా ఓటింగ్ మారవచ్చు. వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు టాప్ 5 లోకి వెళ్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X