Bigg Boss 9 Telugu: హోరా హోరీగా గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. బిగ్ బాస్ 9 విజేత ఎవరు?
Bigg Boss 9 Telugu Winner: తెలుగు బుల్లితెరపై ఉత్కంఠభరితంగా సాగుతోన్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss 9 Telugu). బిగ్ బాస్ చరిత్ర లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకున్న సీజన్ గా 'బిగ్ బాస్ 9′రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో గొడవలకన్నా బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలు ఎక్కువగా కనిపించాయి. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్‌కు బలంగా కనెక్ట్ అయ్యారు. అదే ఈ సీజన్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఈ సీజన్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 9 విజయానికి కారణమైన ప్రధాన కంటెస్టెంట్లు సంజన, ఇమ్మానుయేల్, తనూజ, రీతూ, పవన్, భరణి పేర్లు వినిపిస్తున్నాయి. షో మొత్తం ఎక్కువగా వీరి చుట్టు తిరిగింది. ముఖ్యంగా భరణి ఏర్పరుచుకున్న బంధాలు, ఆయన చూపించిన విలువలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల భరణి ఎలిమినేషన్ కావడంతో అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్లుగా తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, సంజన గల్రానీ నిలిచారు.

టైటిల్ పోరులో ఐదుగురు ఫైనలిస్టులు ఉన్నా, టైటిల్ రేసు మాత్రం స్పష్టంగా ఇద్దరి మధ్యే నడుస్తోంది. వాళ్లే తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్ పడాల. ఈ ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన పోటీ సాగుతోంది. పవన్ కళ్యాణ్ గేమ్ జర్నీ చూస్తే ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి నాలుగు వారాల్లో ఆయన ఆట పెద్దగా కనిపించలేదు. ప్రియా శెట్టి ఎలిమినేషన్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా డేంజర్ జోన్‌లో ఉండటం ఆయనకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఆ రోజు నుంచి డేంజర్ జోన్ లో నుంచి బయటపడ్డ పవన్ కళ్యాణ్ తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు.
ఇక అసలు గేమ్‌ను తిప్పేసింది ఫ్యామిలీ వీక్. పవన్ కళ్యాణ్ తన కుటుంబం గురించి మాట్లాడిన తీరు, ఆయన తల్లిదండ్రులు చెప్పిన మాటలు ప్రేక్షకులను బాగా టచ్ చేశాయి. ఫ్యామిలీ వీక్ తర్వాత వరుసగా రెండు వారాలు పవన్ కళ్యాణ్‌కు పాజిటివ్ ఎపిసోడ్స్ రావడంతో ఆయన ఓటింగ్ గ్రాఫ్ ఊహించని రేంజ్‌లో పెరిగింది. ఒక దశలో తనూజ ఓటింగ్‌ను కూడా దాటేసే స్థితికి చేరుకున్నాడు.
మరోవైపు తనూజకు గత రెండు వారాలుగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతూ రావడంతో ఆమె నెంబర్ వన్, నెంబర్ 2 స్థానంలో నిలబడింది.సీరియల్ ఆడియన్స్ సపోర్ట్‌తో పాటు సెలబ్రిటీలు కూడా తనూజకు ఓట్లు వేయమంటూ ప్రచారం జరుగుతోంది. ఇక గ్రాండ్ ఫినాలే ఓటింగ్ చిత్రాన్ని పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలే డిసెంబర్ 21న జరగనుంది. జియో హాట్‌స్టార్ ద్వారా ఓటింగ్ కొనసాగుతోంది.
తాజా సోషల్ మీడియా, ఆన్‌లైన్ పోల్స్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ పడాల టాప్‌లో దూసుకుపోతున్నాడు. తొలి రోజు ఓటింగ్‌లోనే ఆయనకు 45 శాతానికి పైగా ఓట్లు పడగా, తనూజకు 27 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఇమ్మానుయేల్ 12 శాతంతో మూడో స్థానంలో, డిమాన్ పవన్ 9 శాతంతో నాలుగో స్థానంలో, సంజన 7 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. టాప్ 1, 2 మధ్య భారీ ఓటింగ్ గ్యాప్ కనిపించడంతో ఈసారి ట్రోఫీ పవన్ కళ్యాణ్ పడాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ఓటింగ్‌కు సమయం ఉండటంతో చివరి నిమిషంలో ఏమైనా ట్విస్టులు ఉంటాయా? లేక పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా నిలుస్తాడా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











