బిగ్‌బాస్ తనూజ షాకింగ్ డిసిషన్.. అందరూ చూస్తుండగా కళ్యాణ్ పడాలతో అలా..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు, కామనర్స్ కలయికతో సాగిన ఈ సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ రియాలిటీ షో చివరికి ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్‌లో కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్‌గా నిలవగా, తనుజ రన్నరప్‌గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించింది. ఈ ఇద్దరూ షో సమయంలోనే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే, షో ముగిసిన తర్వాత కళ్యాణ్ పడాల, తనుజ మధ్య ఏదో ప్రత్యేకమైన బాండింగ్ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా, "ఏదో ఉంది" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరూ తమ రిలేషన్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఫ్రెండ్స్ మాత్రమేనా? లేక దాని కంటే ఎక్కువ ఏదైనా ఉందా? అన్నది ఎప్పటినుంచో సస్పెన్స్‌గానే ఉంది. తాజాగా ఓ ఈవెంట్‌లో తనుజ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా కళ్యాణ్ పడాలని స్టేజ్‌పైకి పిలిచి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..

Bigg Boss 9 Thanuja Puttaswamy Shocks Fans Invites Kalyan Padala on Stage Shares Award Live Moment

స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 వేడుకలు ఈసారి మరింత గ్రాండ్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి భాగం ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు రెండో భాగం మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందని తాజాగా విడుదలైన ప్రోమో స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ కానున్న పార్ట్ 2లో ఎమోషన్, ఫన్, సర్ప్రైజ్ అన్ని ప్యాకేజ్‌గా ఉండబోతోంది.

ఈ వేడుకలో 'ఇల్లు ఇల్లాలు' సీరియల్‌కు ఉత్తమ పరివారం అవార్డు లభించింది. ఈ సందర్భంగా సీనియర్ నటి ఆమని స్టేజ్‌పై మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురయ్యారు. 'బుల్లితెరపై తీసుకుంటున్న మొదటి అవార్డు ఇది' అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. అయితే వెంటనే హోస్ట్ ప్రదీప్ తన స్టైల్‌లో 'మేడమ్ బ్లాక్ శారీలో చూస్తుంటే చిలక ఏ తోడు లేక అనే పాట గుర్తొస్తోంది' అంటూ సరదా కామెంట్స్ చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న నిహారిక మాత్రం 'ఎదురింటి మంగళగౌరి వేసుకున్న నగలు చూడు' అంటూ పాటను హమ్ చేస్తూ స్టేజ్‌పై ఫన్ క్రియేట్ చేసింది.

ఇక 'కార్తీక దీపం' సీరియల్‌లో పారిజాతం పాత్రతో ప్రేక్షకులను అలరించిన నటికి ఉత్తమ అమ్మమ్మ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న వెంటనే ఆమె స్టేజ్‌పై మాస్ స్టెప్పులు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎనర్జీ చూసి రాజీవ్ కనకాల కూడా ఫన్నీగా స్పందిస్తూ 'నాకు అయితే దిమ్మ తిరిగిపోయింది'అంటూ నవ్వులు పూయించాడు.

ఇవన్నీ ఒక ఎత్తైతే... బిగ్‌బాస్ టీమ్‌కు ఇచ్చిన అవార్డులు మరో హైలైట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ సీజన్ 9కు ఫేవరెట్ కంటెంట్ అవార్డు లభించగా, దాన్ని తనుజ అందుకుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, తనుజ స్టేజ్‌పై ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. 'ఈ అవార్డు నేను ఒంటరిగా తీసుకోలేను... కళ్యాణ్ పడాలతో షేర్ చేసుకోవాలి'అంటూ కళ్యాణ్‌ను స్టేజ్‌పైకి పిలిచింది.

అక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. తనుజ తనకు వచ్చిన అవార్డును కళ్యాణ్‌కు అందించడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇది చూసిన యాంకర్ శ్రీముఖి కూడా వెంటనే స్పందిస్తూ 'మీ ఇద్దరిని చూస్తుంటే పాపులర్ జోడి అవార్డు కూడా ఇవ్వాలనిపిస్తోంది' అంటూ కామెంట్ చేయడం మరో హైలెట్ మారింది.

అంతటితో ఆగకుండా, కళ్యాణ్ పడాల - తనుజ ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్‌కు లవ్లీ స్టెప్పులు వేయడంతో ఈవెంట్ హైలైట్ మోమెంట్‌గా మారింది. వారి కెమిస్ట్రీ, స్టేజ్ ప్రెజెన్స్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా బిగ్‌బాస్ అభిమానులు ఈ జంటను ప్రశంసిస్తూ, 'ఇది ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువేనా?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss telugu thanuja kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X