తనూజని టార్గెట్ చేయడానికి కారణం అదే.. ట్రోలింగ్ పై శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్..
బిగ్‌బాస్ 9 విన్నర్‌ను నిర్ణయించే లాస్ట్ వీక్‌లో ఊహించని సర్‌ప్రైజ్‌లు ప్రేక్షకులను షాక్‌కు గురి చేశాయి. ముఖ్యంగా సీరియల్ నటి తనూజపై ఆమెతో పాటు పనిచేసిన సీరియల్ బ్యాచ్ నుంచే వ్యతిరేకత రావడం చర్చనీయాంశంగా మారింది. "ఆమె సంగతి మాకు తెలుసు... మా సపోర్ట్ కళ్యాణ్‌కే" అంటూ వారు బహిరంగంగా చెప్పడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఈ లిస్ట్‌లో ముందుగా నిలిచింది శ్రీసత్య - యష్మీ జోడీ. లాస్ట్ వీక్ ఓటింగ్ పీక్స్‌లో ఉన్న సమయంలో వీరు చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ తీవ్రంగా వైరల్ అయింది. ఆ లైవ్‌లో తనూజ ఫ్యాన్స్‌పై యష్మీ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. అసలు తనూజనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా, ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై శ్రీసత్య చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే.?
బిగ్‌బాస్ 9 నేపథ్యంలో తనుజపై ట్రోలింగ్ వ్యవహారంపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీసత్య తొలిసారి స్పందించింది. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు కారణాలు ఏమిటో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అంశంపై యాంకర్ ప్రశ్నించగా శ్రీసత్య మాట్లాడుతూ, 'వాస్తవానికి నేను ఏ విషయానికీ అంతగా రియాక్ట్ అవ్వను. నేను నవ్వినా కూడా దానికి వేరే అర్థాలు తీసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం ఇచ్చింది. అయితే యాంకర్ మరోసారి 'అసలు ఏం జరిగింది?'అని అడగడంతో ఆమె పూర్తి వివరాలు వెల్లడించింది.

శ్రీసత్య మాట్లాడుతూ, 'నేను ఫస్ట్ నుంచే ఇమ్ముకు సపోర్ట్ చేస్తున్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. మేము సపోర్ట్ చేసిన వ్యక్తికి చాలా మంది అప్రిషియేట్ చేస్తూ మెసేజ్‌లు కూడా చేశారు. కానీ తనూజ పీఆర్ టీం మాత్రం మమ్మల్ని అబ్యూజ్ చేస్తూ కామెంట్స్ చేసింది. మొదట్లో ఇవన్నీ పేడ్ కామెంట్స్, పీఆర్ స్టంట్స్ అనుకుని వదిలేశాను'అని చెప్పింది. అయితే ఆ ట్రోలింగ్ రోజురోజుకు పెరిగిపోయిందని శ్రీసత్య తెలిపింది. ఇక శ్రీజ రీఎంట్రీపై తాను చేసిన ఫైర్ సింబల్ కామెంట్‌ను మరీ దారుణంగా ట్రోల్ చేశారని, 'ఒక హద్దు వరకు ఓకే. కానీ అది హద్దులు దాటిపోయింది. లైన్ ఎక్స్‌టెంట్ అయి ఫ్యామిలీని కూడా తింటారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక పీఆర్ టీంలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, 'డబ్బులు పే చేస్తున్నంత వరకు ఎంత ఇచ్చారో అంత వరకే ప్రమోట్ చేయాలి. అంతకుమించి హద్దులు దాటితే మేమెందుకు భరించాలి? మా దగ్గర అన్ని ప్రూఫ్‌లతో సహా ఉన్నాయి. మా మీద ఎన్నో చెత్త కామెంట్స్ చేశారు' అని వెల్లడించింది. అందుకే తాము లైవ్‌కు రావాల్సి వచ్చిందని, అయితే ఆ లైవ్ వీడియోలను కూడా కొంత భాగం మాత్రమే కట్ చేసి, తప్పుగా ప్రమోట్ చేశారని ఆరోపించింది. ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు శ్రీసత్య స్పష్టం చేసింది.
'ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. మేము లైవ్‌కు రావడానికి కారణం మాపై జరుగుతున్న అభ్యంతరకరమైన ట్రోలింగ్, అబ్యూజివ్ కామెంట్స్ గురించే. మీరు పీఆర్‌గా చేయాల్సిన పని అక్కడివరకే ఉండాలి'అంటూ హెచ్చరించింది. అలాగే, ఎంటర్టైనర్ ఇమ్మూకు విన్నింగ్ అవకాశం తక్కువగా ఉండటంతో ఇన్‌డైరెక్ట్‌గా తాము కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేశామని చెప్పింది. పీఆర్ టీం అతిగా వ్యవహరించడంవల్లే లైవ్‌లో తనుజపై మాటలు రావాల్సి వచ్చాయని, అది వ్యక్తిగత ద్వేషంతో కాదని స్పష్టత ఇచ్చింది. ఇలా బిగ్‌బాస్ 9 లాస్ట్ వీక్‌లో చోటుచేసుకున్న ఈ ట్రోలింగ్ వ్యవహారం రియాలిటీ షో హద్దులు దాటి సోషల్ మీడియా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.


Click it and Unblock the Notifications











