తనూజతో ఫ్రెండ్‌షిప్ లేదా ఇంకేదైనా? రిలేషన్‌పై కళ్యాణ్ పడాల క్లారిటీ!

Kalyan Padala: బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్‌ కళ్యాణ్ పడాల చాలా రోజుల తర్వాత మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. షో ముగిసిన తర్వాత పెద్దగా మీడియా ముందు కనిపించని ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్లాన్స్, ముఖ్యంగా తనూజతో ఉన్న బాండింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన ఆ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని స్పష్టం చేస్తూ, అభిమానుల సందేహాలకు క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం కళ్యాణ్ తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నాడు. త్వరలో ఒక పాటతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడని, అదే తన మొదటి స్టెప్ అని చెప్పాడు. అంతేకాదు, సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించాడు. అయితే ఏదోలా సినిమాల్లోకి రావడం కాదు, తనకు సరిపోయే మంచి కథలతో, గుర్తింపు వచ్చేలా ఉండే ప్రాజెక్ట్‌లను మాత్రమే ఎంచుకుంటానని స్పష్టం చేశాడు. ఇప్పటికే పలు స్క్రిప్ట్‌లు విన్నానని, వాటిలో కొన్ని బాగా నచ్చాయని, వాటిపై వర్క్ జరుగుతోందని తెలిపాడు.

Bigg Boss 9 Winner Kalyan Padala Opens Up About Thanuja Puttaswamy Bond

ఈ సందర్భంగా తనూజతో రిలేషన్ గురించి అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ చాలా క్లియర్‌గా సమాధానం ఇచ్చాడు. "బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా ఉన్నామో, బయట కూడా అలాగే ఉన్నాం" అని చెప్పాడు. తమ మధ్య ఉన్నది ప్రేమకథ కాదని, అది ఒక మంచి ఫ్రెండ్‌షిప్ అని స్పష్టం చేశాడు. "మేము టామ్ అండ్ జెర్రీలా కాదు.. ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, సలహాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం" అంటూ తన బాండింగ్ గురించి వివరించాడు.

బిగ్‌బాస్ షో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కళ్యాణ్ చెప్పాడు. "బిఫోర్ బిగ్‌బాస్, ఆఫ్టర్ బిగ్‌బాస్ అన్నంత మార్పు వచ్చింది. ముందుగా నేను చాలా ఓవర్ థింక్ చేసేవాడిని. కానీ షో తర్వాత నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది" అని తెలిపాడు. తన జీవితాన్ని బిగ్‌బాస్ ఒక ట్రైలర్‌లా మార్చిందని చెప్పడం విశేషం. ఆ ట్రైలర్‌లోనే తనలో ఉన్న అన్ని ఎమోషన్స్, స్ట్రెంగ్త్స్ బయటపడ్డాయని చెప్పాడు.

ముఖ్యంగా సోషల్ ఇంటరాక్షన్ విషయంలో కూడా పెద్ద మార్పు వచ్చిందని కళ్యాణ్ పేర్కొన్నాడు. "బిగ్‌బాస్‌కు ముందు నేను చాలా పరిమితంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు 50 మందితో అయినా సులభంగా మాట్లాడగలను" అని తెలిపాడు. ఇది తనకు వచ్చిన పెద్ద మార్పు అని చెప్పాడు. అలాగే సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిందని వెల్లడించాడు. "ముందు నాకు కేవలం 64 ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అది 6 లక్షలకు పెరిగింది" అని చెప్పాడు.

తనూజతో ఉన్న బాండింగ్ గురించి మరింత వివరంగా మాట్లాడుతూ, "మేము రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం. నాకు ఏదైనా డౌట్ వచ్చినా ఆమెను అడుగుతాను. ఆమె కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది" అని చెప్పాడు. ఇటీవల తన పాట గ్లింప్స్ విడుదలైనప్పుడు తనూజ ఫోన్ చేసి అభినందించిందని కూడా తెలిపాడు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'కుకూ విత్ జాతిరత్నాలు' అనే షోలో కూడా పాల్గొంటున్నారని, అక్కడ కూడా తమ కెమిస్ట్రీ బిగ్‌బాస్‌లానే ఉంటుందని చెప్పాడు.

ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నా, తమది పక్కా ఫ్రెండ్‌షిప్ అని కళ్యాణ్ మళ్లీ స్పష్టం చేశాడు. "మేమిద్దరం ఒకరికొకరం స్టాండ్ తీసుకుని నిలబడతాం. అదే మా బాండింగ్ స్ట్రెంగ్త్" అని చెప్పాడు. "లైఫ్‌లాంగ్ కూడా ఇదే ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుంది" అని చెప్పడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

కళ్యాణ్ పడాల ప్రయాణం కూడా ఎంతో ప్రత్యేకం. ఆర్మీ జవాన్‌గా పనిచేసిన ఆయన, ఆ ఉద్యోగాన్ని వదిలేసి బిగ్‌బాస్‌లో పాల్గొనడం పెద్ద సాహసం. కామన్ మాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి, నెమ్మదిగా తన గేమ్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ చివరకు టైటిల్ గెలుచుకోవడం ఆయన కష్టానికి నిదర్శనం. మరోసారి కామన్ మాన్ టైటిల్ గెలవడం ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చింది.

Read more about: bigg boss telugu thanuja kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X