twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనీష్, గీతాకు క్లాస్ పీకిన నాని.. ఆ నలుగురికి టెన్షన్.. బిగ్‌బాస్‌ అవుటయ్యేది ఎవరంటే?

    By Rajababu
    |

    బిగ్‌బాస్ షోలో 88, 89వ రోజు సరదాగా గడిచిపోయింది. అయితే ఈ వారం ఇంటి నుంచి నిష్క్రమించే సెలబ్రిటీల ఎ ఎవరనే క్లూ ఇవ్వకుండా సస్పెన్స్‌తో ముగించారు. నామినేట్ అయిన నలుగురు సభ్యులకు టెన్షన్ మిగిల్చారు. శనివారం ఎపిసోడ్ చప్పగా సాగింది. ఆటపాటలతో కాలక్షేపం చేశాడు నాని. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. చివరికి ఎలిమినేషన్‌ ప్రక్రియను ఆదివారానికి వాయిదా వేశాడు. ఇంకా ఏం జరిగిందంటే...

    తనీష్ క్షమాపణ చెప్పేందుకు

    తనీష్ క్షమాపణ చెప్పేందుకు

    టికెట్ ఫినాలే టాస్క్‌‌ సందర్బంగా కారులో తాను వ్యవహరించిన తీరుపై దీప్తికి క్షమాపణ చెప్పేందుకు తనీష్ ప్రయత్నించాడు. కానీ దీప్తి తనకు క్షమాపణ అవసరం లేదు. నీ వ్యూహంలో భాగంగా నీవు ఆట ఆడావు అని చెప్పింది. నాకు సారీలు అవసరం లేదు అని నిక్కచ్చిగా తనీష్ ముఖం మీదే అనేసింది.

     దీప్తి, శ్యామలను నిలదీసిన కౌశల్

    దీప్తి, శ్యామలను నిలదీసిన కౌశల్

    టికెట్ ఫినాలే టాస్క్‌లో శ్యామల, దీప్తి నల్లమోతు సరిగా ఆడకపోవడంపై కౌశల్ తప్పుపట్టారు. కారులో తనీష్ ఒక్కడే ఉన్నప్పుడు మీరేందుకు అతడిని బయటకు తోయడానికి ప్రయత్నించలేదని దీప్తి, శ్యామలను నిలదీశాడు. కానీ వారు తమకు ఆ విషయం తట్టలేదని దీప్తి చెప్పగా.. నేను నీకు హింట్ ఇచ్చాను అని శ్యామల పేర్కొన్నది.

    టాస్క్‌లలో సెలబ్రిటీల గురించి

    టాస్క్‌లలో సెలబ్రిటీల గురించి

    శనివారం ఎపిసోడ్‌లో గత నాలుగు రోజులుగా సాగిన టాలీవుడ్ మరథాన్, టికెట్ టూ ఫినాలే వీక్ అనే కార్యక్రమాలకు సంబంధించిన సెలబ్రిటీ ఆట తీరు తెన్నులను సమీక్షించారు. ప్రతీ ఒక్కరికి పేరు పేరున ప్రశంసిస్తూ వారి ప్రతిభ గురించి వివరించాడు.

     గుడ్డుకొట్టుకోరా గణేషా?

    గుడ్డుకొట్టుకోరా గణేషా?

    శనివారం ఎపిసోడ్‌లో గుడ్డు కొట్టుకోరా గణేషా అనే టాస్క్‌ను ఆడారు. ఆయ సెలబ్రిటీలకు సంబంధించిన ఆటతీరుపై వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ప్రతీ సభ్యుడి గురించి అడిగిన ప్రశ్నలకు వారు అవునో.. కాదో అనే సమాధానం ఇవ్వాలి. అదే ప్రశ్నకు సభ్యుడు ఇచ్చిన జవాబుకు ఇంటి సభ్యులు ఇచ్చిన సమాధానం విరుద్ధంగా ఉంటే ఆ సెలబ్రిటీ కోడిగుడ్లు కొట్టుకోవాలి. ఈ టాస్క్‌లో కౌశల్, శ్యామల ఎక్కువగా కోడిగుడ్లు కొట్టుకొన్నారు.

    తనీష్, గీతాకు నాని క్లాస్

    తనీష్, గీతాకు నాని క్లాస్

    గేమ్‌లో అనేక తప్పిదాలు చేసిన తనీష్‌కు మరోసారి నాని క్లాస్ పీకారు. పరిస్థితిని బట్టి నీ ఆటతీరు మారిపోతుంది. ఆటలో, వ్యూహంలో స్థిరత్వం లేదు. అదే కౌశల్‌ను చూస్తే మొదటి నుంచి ఎలా ఉంటున్నాడో.. ఇప్పటికీ అలానే ఉంటున్నాడు. కానీ నీవు మాత్రం మారిపోతున్నావు. కారులో దీప్తికి బదులు.. దీప్తి సునైనా ఉంటే అలానే చేశేవాడివా అని ప్రశ్నించాడు. గీతా అబద్దాలు ఆడటంపై నాని ఆమె తప్పులను ఎత్తి చూపాడు.

     ఎలిమినేషన్ ప్రక్రియ వాయిదా

    ఎలిమినేషన్ ప్రక్రియ వాయిదా

    చివరగా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తానని చెప్పిన నాని ఇంటి సభ్యులకు టెన్షన్ మిగిల్చాడు. ఇంటి నుంచి వెళ్లడానికి నామినేట్ అయిన కౌశల్, దీప్తి, అమిత్, శ్యామల‌లో సెఫ్ జోన్‌లోకి ఎవరిని పంపిస్తారని ఎదురు చూసిన ప్రేక్షకులక అసంతృప్తిని మిగిల్చాడు. ఎలిమినేసన్ ప్రక్రియను వాయిదా వేశాడు.

     శ్యామల, అమిత్‌లో ఎవరు?

    శ్యామల, అమిత్‌లో ఎవరు?

    ఆదివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో శ్యామల, అమిత్‌‌లో ఎవరైనా ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. వీరిద్దరూ చాలా సేఫ్ గేమ్ ఆడటమే కారణంగా కనిపిస్తున్నది. ఎక్కువగా శ్యామలకు ఈ ముప్పు పొంచి ఉన్నది.

    English summary
    Bigg Boss 2 88 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 85 days of the game, Ganesh Eliminated from the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X