Bigg Boss: ఎలిమినేషన్ తప్పించుకున్న ఇద్దరు.. చివర్లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!
ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని.. గతంలో దేనికీ దక్కనంత రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ కారణంగానే ఇది ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత నెలలో ఐదోది కూడా ప్రారంభం అయింది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉంటున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

ఎంటర్‌టైన్‌మెంట్ భారీగా పెంచారు
అంతకు ముందు సీజన్లు సూపర్ హిట్ అవడంతో భారీ అంచనాల నడుమ గత నెలలో ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్. అలా రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోందీ సీజన్. దీంతో వీకెండ్స్‌లోనే కాదు.. వీక్ డేస్‌లో సైతం దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా రేటింగ్ కూడా అదే రితిలో వస్తోన్న విషయం తెలిసిందే.

19 మందిలో ఎనిమిది మంది అవుట్
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి సర్‌ప్రైజ్‌లు లేకుండా వీరిలో వారానికి ఒకరు చొప్పున.. ఎనిమిది వారాలకు ఎనిమిది మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. అందులో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి షారి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారంలో హమీదా ఖటూన్, ఆరో వారంలో శ్వేత వర్మ, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబోలు ఎలిమినేట్ అయిపోయారు. మొత్తంగా ఇందులో ఆరుగురు లేడీస్, ఇద్దరు జెంట్స్ వెళ్లిపోయారు.

తొమ్మిదో వారం నామినేషన్స్ కొత్తగా
నామినేషన్స్ ప్రక్రియే బిగ్ బాస్ షోలో ఎంతో ముఖ్యమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా మొదలు అవుతుంది. ప్రతి సోమవారం ఈ ఎపిసోడ్ వస్తుంటుంది. ఇక, తొమ్మిదో వారానికి సంబంధించి హౌస్‌లో 11 మంది సభ్యులు ఉండగా.. అందులో కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ మినహా అందరూ నామినేట్ అయ్యారని బిగ్ బాస్ ప్రకటించి షాకిచ్చాడు.

ఇమ్యూనిటీ టాస్క్.. విజేత మాత్రమే
ఈ వారానికి నామినేట్ అయిన 10 మందికి బిగ్‌బాస్ 'జీవితమే ఒక ఆట'అనే ఇమ్యూనిటీ టాస్క్‌ఇచ్చాడు. ఇందులో విజేతగా నిలిచిన వాళ్లు అంటే ఒకరు మాత్రమే ఈ వారానికి గానూ నామినేషన్స్ తప్పించుకుని సేఫ్ కావొచ్చు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాను మూడు జోన్‌లుగా విభజించారు. అందులో బ్యాగేజ్ జోన్‌లో నామినేట్ అయిన ప్రతి ఒక్కరి సభుల ముఖంతో ఒక బ్యాగ్ ఉంటుంది. సేఫ్ జోన్‌లో ఇమ్యూనిటీ కోసం పోటీ పడుతున్న సభ్యులు ఉంటారు. చివరిగా డేంజర్ జోన్‌లో గేమ్‌లో ఓడిపోయి ఇమ్యూనిటీని కోల్పోయే సభ్యులు మాత్రమే ఉంటారు.

వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉంటారు
ఈ టాస్క్ ప్రకారం.. బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా పరుగెత్తుకుంటూ వెళ్లి.. బ్యాగేజ్ జోన్‌లో ఉన్న బ్యాగుల నుంచి ఎవరైనా ఇతర సభ్యుల ముఖంతో ఉన్న ఒక దానిని తీసుకొని సేఫ్ జోన్‌లోకి వెళ్లాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారితో పాటు వారి చేతిలో ఏ కంటెస్టెంట్ బ్యాగ్ ఉందో వాళ్లు కూడా డేంజర్ జోన్‌లో ఉండిపోతారు. అలా చివరిలో ఉన్న ఇద్దరిలో నుంచి ఎవరిని సేఫ్ జోన్‌లోకి తీసుకురావాలి? ఎవరిని నామినేషన్స్‌లోకి నెట్టాలి? అన్నది సేఫ్ జోన్‌లో ఉన్న సభ్యులు నిర్ణయించాలి. అలా చివరకు ఒక్కరు మాత్రమే ఆటలో మిగులుతారు. వారే టాస్క్ విజేత.

శ్రీరామ్‌కు షాక్.. టాస్క్‌లో విజేత ఆనీ
కామెడీ, గొడవలతో ఎంతో ఆసక్తికరంగా సాగిన 'జీవితమే ఒక ఆట' టాస్కులో మొదట శ్రీరామ్.. కాజల్ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఇందులో కాజల్ ఔట్ అయింది. ఆ తర్వాత జెస్సీ, సన్నీలో సన్నీ వెళ్లిపోయాడు. మూడో రౌండ్‌లో జెస్సీ, సిరిలో జెస్సీ టాస్క్ నుంచి ఔట్ అయ్యాడు. నాలుగో రౌండ్‌లో విశ్వ, ఐదో రౌండ్‌లో సిరి హన్మంత్, ఆరో రౌండ్‌లో ప్రియాంక, ఏడో రౌండ్‌లో రవి, ఎనిమిదో రౌండ్‌లో మానస్ డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. చివరిగా శ్రీరామ్, ఆనీ మాస్టర్ మిగిలారు. వీళ్లలో హౌస్‌లోకి కంటెస్టెంట్లు అందరూ కలిసి ఆనీని సేఫ్ చేయగా ఆమెకు ఇమ్యూనిటీ దక్కింది.

చివర్లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఆనీకి ఛాన్స్
ఆనీ మాస్టర్‌కు ఇమ్యూనిటీ లభించడంతో ఈ వారం నామినేషన్స్‌లో తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. ఇలాంటి సమయంలో ఇంకొకరు కూడా సేఫ్ కావొచ్చంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీని కోసం గతంలో ఆనీ మాస్టర్‌కు లభించిన పవర్ షీల్డ్‌ను వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో ఆమె దాన్ని తీసుకొచ్చి మానస్‌ను ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ చేసింది. గతంలో మానస్ తన కోసం లెటర్ త్యాగం చేసి డైరెక్ట్ నామినేట్ అయ్యాడని.. అందుకే అతడికి ఇచ్చేస్తున్నానని ఆనీ చెప్పింది. దీంతో సన్నీ, పింకీ, సిరి, శ్రీరామ్, రవి, విశ్వ, జెస్సీ, కాజల్‌లు నామినేట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











