నాన్న డెత్.. 30 లక్షల అప్పు.. సూసైడ్‌కి ఫిక్స్ అయ్యా : బిగ్ బాస్ 9 కంటెస్టెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎంపిక ఆసక్తికరంగా జరుగుతోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు పోటీదారులను హౌజ్ లోకి పంపించేందుకు కఠినమైన టాస్క్ లు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే పలువురిని బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించేందుకు ఎంపిక ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో వరంగల్ నుంచి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ అనుష పోటీలో ఉంది. ఈమెకు బిగ్ బాస్ జడ్జీలు హౌజ్ లోకి పంపించేందుకు అనుమతినిచ్చారు. ఇంకా బిగ్ బాస్ నుంచి ఫైనల్ డిసీషన్ రావాల్సి ఉంది.
ఈ సందర్భంగా అనుష తన జీవితం గురించి బిగ్ బాస్ అగ్నిపరీక్ష వేదికపై చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె కథ అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. చిన్న వయస్సుల్లోనే ఆమె లీడ్ చేసిన లైఫ్ జర్నీ స్ఫూర్తిదాయకంగానూ ఉండటం విశేషం. ఇక ఆమె మాట్లాడుతూ.. 'నా పూర్తి పేరు అనూష రత్న. నాది వరంగల్. కానీ గత 5 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉద్యోగరీత్యా ఉంటున్నాను. ఇక గతంలో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీకి 5 ఏళ్లు టీమ్ లీడ్ గా వర్క్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్ గా మారిపోయాను. రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్. మాది చిన్న కుటుంబం. నేను అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నాము.

2022లో మా నాన్న చనిపోయారు. మా అమ్మ చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య సమస్యలు రావడంతో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే మా డాడీ చనిపోవడాని కంటే 2 నెలల ముందు మా చెల్లిని యూకేకు పంపించాం. అప్పుడు నా జాబ్ పై 15 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాం. ఆ తర్వాత మా డాడీ చనిపోయాక మరో 15 లక్షలు అప్పు మొత్తంగా 30 లక్షల అప్పు తేలింది. ఆ బాకీ మొత్తం తీర్చాల్సిన బాధ్యత నాపైనే పడింది. ఒక్కసారిగా నా ప్రపంచం తలకిందులై పోయింది. దాంతో పనిభారం పెరిగింది.
ఎక్ట్స్రా వర్క్ చేస్తూ ఉండే దాన్ని, నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తూ వచ్చాను. రోజుకు కేవలం 2, 3 గంటలే నిద్రపోతూ ఉండే దాన్ని. ఎందుకంటే నాకు ఎక్కువ డబ్బులు అవసరం ఉండి దారుణంగా కష్టపడాల్సి వచ్చింది. ఆర్థికంగా, పని ఒత్తిడి కారణంగా ఒక సమయంలో నేను సూసైడ్ కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోచించాను. మా నాన్న లేరు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇక నేను కూడా లేకపోతే ఆ భారం మొత్తం నా చెల్లి పడుతుందని ఆగిపోయాను. ఎలాగైనా మా నాన్న నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేయాలని అనుకున్నాను. మళ్లీ వర్క్ మొదలు పెట్టాను.
2023 ఆగస్టులో నాకున్న అప్పుల్లో 70 శాతం తీర్చేశాను. ఇదే సమయంలో నా చెల్లికి యూకేలో మంచి జాబ్ కూడా వచ్చింది. దాంతో తను కూడా సగం బాధ్యతలను తీసుకుంది. ఆ తర్వాత నా జీవితంలో బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాను. ఇక అదే సమయంలో ఇన్ స్టా గ్రామ్ లో అందరూ వైరల్ అవుతున్నారు. ఇక నా రియల్ లైఫ్ స్టోరీని అందరికీ చెప్పాలని అనుకున్నాను. ఒక్కరినైనా నా జీవితం మార్చగలితే చాలనుకున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న జడ్జీ అభిజీత్ ఎమోషనల్ అయ్యారు. నీ లాంటి వారు హౌజ్ లోకి వెళ్లాలి. నీలో ఒక వారియర్ ఉన్నారు. నీకు చాలా టాలెంట్ ఉంది. అందుకే నిన్ను హౌజ్ లోనికి పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











