అఖిల్ కి ఊహించని గిఫ్ట్, ఆ నటి ఫోన్ తో గూస్‌బంప్స్ .. బిగ్ బాస్ లో ఏమీ రాలేదని ఇలా!
బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో చాలామంది క్రేజ్ లేకుండా ఎంటర్ అయ్యారు. అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ పూర్తయ్యేసరికి వారందరికీ టెలివిజన్ లో మంచి క్రేజ్ లభించింది. అలా ఎలాంటి పరిచయం లేకుండా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయి మంచి క్రేజ్ తెచ్చుకున్న అఖిల్ సార్థక్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఆ వివరాల్లోకెళితే
Recommended Video

మోనాల్ గజ్జర్ తో
బిగ్ బాస్ లో విన్నర్ అవుతారు అని కూడా భావించినా చివరికి ఆయన కేవలం రన్నర్ గా మాత్రం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఆట కంటే ఎక్కువగా మోనాల్ గజ్జర్ తో ఉన్న ప్రేమాయణంతోనే అఖిల్ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అనూహ్యంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు అయితే వచ్చి పడడం లేదు.

అవకాశాలు లేవు
టీవీలో మోస్ట్ డిజైరబుల్ మెన్ అనే టైటిల్ దక్కించుకున్నా సరే అటు సినిమా అవకాశాలు గాని సీరియల్ అవకాశాలు గాని పెద్దగా లభించడం లేదు. అడపాదడపా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్న అఖిల్ మోనాల్ తో కలిసి తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే ఒక వెబ్ సిరీస్ మాత్రం చేస్తున్నారు.

లక్ష రూపాయల గిఫ్ట్
తాజాగా అఖిల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే అఖిల్ బిగ్ బాస్ లో ఏమీ డబ్బు కూడ పెట్టలేదని విషయం తెలుసుకుని ఒక ఆవిడ అఖిల్ కి లక్ష రూపాయల గిఫ్ట్ ఇచ్చారు. ముందు తీసుకోవడానికి ఇష్టం లేకపోయినా ఆమె చూపించిన ప్రేమకు తీసుకోక తప్పలేదు అని అఖిల్ చెప్పుకొచ్చాడు

ఆశీర్వదించబడ్డాను,
''నేను చాలా ప్రేమ, టచ్‌వుడ్‌తో ఆశీర్వదించబడ్డాను, నా పట్ల అపారమైన ప్రేమను, ఆశీర్వాదాలను చూపించినందుకు దేవునికి ధన్యవాదాలు'; అని అఖిల్ పేర్కొన్నాడు. ఈ లక్ష చెక్కు ఇచ్చిన జాన్సీ లక్ష్మి గారు ధన్యవాదాలు, ఇక్కడ నేను బిగ్ బాస్ లో రన్నర్ అని, నాకు డబ్బు ఏమీ రాదని తెలిసి ఆమె నాకు ఇది ఇచ్చిందని పేర్కొన్నాడు.

కన్నీళ్లు తెప్పించింది
నేను దీన్ని తీసుకోవడానికి నిజంగా సిద్ధంగా లేను కానీ మీరు పేర్కొన్న పదాలు మరియు మనవడిగా మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వివరించిన విధానం నాకు నిజంగా కన్నీళ్లు తెప్పించింది, నా చాలా మీద చాలా ప్రేమ చూపించారు అమ్మమ్మ. నాకు భారీ కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు, బిగ్ బాస్ పూర్తయి 8 నెలలు అయ్యింది, కాని ప్రజలు ప్రేమ అంతే స్వచ్చంగా కనిపిస్తోంది అని రాసుకొచ్చారు.

గూస్‌బంప్స్
అలాగే నటి శారద గారు నాతో ఫోన్‌లో మాట్లాడినందుకు ధన్యవాదాలు నిజంగా గూస్‌బంప్స్ వస్తున్నాయి, ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అని అఖిల్ పేర్కొన్నాడు. అలాగే నా కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు విజయ్ లక్ష్మి గారికి ధన్యవాదాలు అని అఖిల్ పేర్కొన్నాడు. మొత్తం మీద అఖిల్ రాసిన ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











