బిగ్ బాస్ కంటెస్టెంట్ల రచ్చ.. మూడు సీజన్లను కలిపేస్తూ కొత్త షో.. పిక్స్ వైరల్
బిగ్ బాస్ షో బుల్లితెర మీద సక్సెస్ అయింది. ముఖ్యంగా తెలుగు నాట బిగ్ బాస్ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతీ సీజన్‌కు టీఆర్పీ రేటింగ్‌లలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందుకే బిగ్ బాస్ షోను గ్రాండ్‌గా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసేశారు. ఇక మళ్లీ జూన్, జూలైలో ఐదో సీజన్‌ను ప్రారంభించే పనిలో పడ్డారు. అయితే అంతకు ముందే ఓ కొత్త ప్రోగ్రాంను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.

ఒక్కో షో కంటెస్టెంట్లు..
మామూలుగా బిగ్ బాస్ షోకు సంబంధించిన ఒక సీజన్ కంటెస్టెంట్లు కలిస్తే అక్కడంతా రచ్చ రచ్చగా ఉంటుంది. పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో బిగ్ బాస్ ఇంటి సభ్యులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాంటిది మూడు సీజన్ల కంటెస్టెంట్లను ఒకే స్టేజ్ మీద ప్రవేశపెడితే సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

స్పెషల్ ప్లాన్..
బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్ల కంటెస్టెంట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. దాదాపు మూడు సీజన్ల కంటెస్టెంట్లందరూ హాజరయ్యారు. మొదటి సీజన్‌కు సంబంధించి ఓ ఐదారుగురు తప్ప అందరూ కలిశారు. అయితే ఈ గెట్ టుగెదర్‌కు కారణం ఒకటి ఉంది. ఈ అందరితో కలిసి స్టార్ మా వాడు ఓ కొత్త షోను ప్లాన్ చేసినట్టుంది.

అందరూ ఒకే చోట..
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఒకే చోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. షూటింగ్ స్పాట్‌లో దిగిన సెల్ఫీలను, అల్లరి వీడియోలను అందరూ షేర్ చేశారు. షూటింగ్‌లో కంటెస్టెంట్లు అంత అల్లరి చేశారంటే రేపు షో బయటకు వచ్చాక జనాలు కూడా అంతే ఎంటర్టైన్ చేస్తారేమో.

ఆ ముగ్గురు అలా..
అయితే ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ విజేతలు బాగానే హల్చల్ చేశారు. మొదటి సీజన్ విజేత శివ బాలాజీ, రెండో సీజన్ విజేత కౌశల్, మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లు ఒకే ఫ్రేంలో కనిపించి సందడి చేశారు.విన్నర్స్ అంటూ రాహుల్ షేర్ చేసిన పిక్ బాగానే వైరల్ అవుతోంది.
Recommended Video

సామ్రాట్ ఇలా..
బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నారు. ఆ ఫోటోతో పాటు కొన్ని హ్యాష్ ట్యాగ్‌లను కూడా యాడ్ చేశాడు. #entertainment #tvshow #starmaa #staytuned అని పేర్కొనడంతో.. స్టార్ మా ఏదో మంచి ప్లానే వేసినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











