బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్‌కు రవితేజ బంపర్ ఆఫర్.. మాట నిలబెట్టుకున్న మాస్ మహారాజ్
బిగ్ బాస్ స్టార్ అమర్ దీప్ చౌదరి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెక్ట్స్ బిగ్ స్క్రీన్ పై మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా తను నటించిన కొత్త సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా తానే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులకు చెప్పారు. తన లైఫ్ టర్న్ అయ్యే పాయింట్ అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తో అమర్ దీప్ చౌదరికి మరింత క్రేజ్..
అనంతపురం జిల్లాకు చెందని అమర్ దీప్ చౌదరి 2016లో తన యాక్టింగ్ కెరీయర్ ను ప్రారంభించారు. పరిణయం షార్ట్ ఫిల్మ్ తో మొదలు పెట్టి ప్రస్తుతం లీడ్ రోల్ లో సినిమాలు చేస్తున్నారు. ఉయ్యాల జంపాల సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అంతకు ముందు చాలానే వెబ్ సిరీస్ ల్లో నటించాడు. జానకీ కలగనలేదు, హిట్లర్ గారి పెళ్లాం, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ తో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్నారు. అలాగే ఆయుష్మాన్ భవ, అనసూయ, కృష్ణార్జున యుద్ధం, శైలాజా రెడ్డి అల్లుడు వంటి చిత్రాల్లోనూ మెరిశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా అమర్ దీప్ చౌదరికి మంచి గుర్తింపు వచ్చింది. రన్నరప్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

అమర్ దీప్ చౌదరి కొత్త సినిమా..
బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత అమర్ దీప్ కు మందచాచి క్రేజ్ దక్కింది. దాంతో ఇంకా సినిమా ఆఫర్లు వరుసగా అందుకోవడం ప్రారంభించాడు. తాజాగా ఓ సినిమాను కూడా పూర్తి చేశాడు. ఆ సినిమా పేరు 'చౌదరి గారి అమ్మాయితో నాయిడు గారి అమ్మయి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో నటి సురేఖా వాణి కూతురు సుప్రితా హీరోయిన్ గా నటించింది. మల్యాద్రి రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మహేంద్ర నాథ్ నిర్మాతగా ఎం3 మీడియా బ్యానర్ పై నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అమర్ దీప్, సుప్రితా, సురేఖా వాణి, దర్శకుడితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో అమర్ దీప్ చౌదరి గుడ్ న్యూస్ చెప్పారు.
రవితేజ నుంచి కాల్ వచ్చింది..
అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ తనకు మాస్ మహారాజా నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు. వెళ్లి మహారాజాను కలిశానని కూడా చెప్పాడు. మంచి విషయం ఒకటి ఉందని, త్వరలోనే అది బయటికి తెలుస్తుందని రవితేజ చెప్పాడు. అయితే మాస్ మహారాజా మొత్తంగా పెద్ద ఆఫర్ ఇచ్చాడనే విషయాన్ని మాత్రం పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడే చెప్పడం దేనికని, మున్ముందు అంతా మీకే తెలుస్తుందని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఈ విషయాన్ని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మాట నిలబెట్టుకున్నమాస్ మహారాజా..
మాస్ మహారాజా రవితేజ అమర్ దీప్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఉన్నప్పుడు ఫైనల్స్ కు మాస్ మహారాజా గెస్ట్ గా హాజరయ్యాడు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఇద్దరు టైటిల్ పోటీలో ఉన్నారు. కానీ తన సినిమాలో అవకాశం ఇస్తే బిగ్ బాస్ టైటిల్ ను వదులుకుంటావా? అని రవితేజ అనడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమర్ దీప్ సరేనని పోటీ నుంచి తప్పుకుంటాడు. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు రవితేజ నిలబెట్టుకున్నాడని తెలుస్తోంది. దీనిపై మున్ముందు అప్డేట్స్ అందనున్నాయి.


Click it and Unblock the Notifications











