‘నా మెంటల్ కండీషన్ బాలేదు.. మైండ్‌లో సూసైడ్ ఆలోచనలే’
తెలుగునాట మెగా రియాలిటీ షోగా ఉన్న బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని తృటిలో టైటిల్ మిస్ అయ్యారు బుల్లితెర నటుడు అమర్‌దీప్ చౌదరి. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పుట్టి హైదరాబాద్‌కు మకాం మార్చిన ఈ కుర్రాడు తన కష్టంతో ఇక్కడి వరకు వచ్చాడు. జీవితంలో అన్నీ తనకు ఈజీగా దక్కలేదని.. దాని వెనుక ఎంతో కష్టం ఉందని అమర్‌దీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ ఛానెల్‌లో జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్న అమర్‌దీప్ చౌదరి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ వివరాల్లోకి వెళితే..
అమర్‌కు రాఖీ కట్టిన వర్ష
ప్రోమో ప్రారంభం నుంచే అమర్‌దీప్ గురించి ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చింది వర్ష. అనంతరం రాఖీ పౌర్ణమి నేపథ్యంలో తన ముద్దుల తమ్ముడికి ఆమె రాఖీ కట్టింది. తర్వాత వర్ష పాదాలు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు అమర్‌దీప్. నువ్వొక పెద్ద హీరో అవ్వాలని ఈ అక్క మనస్పూర్తిగా కోరుకుంటోందని వర్ష ఆకాంక్షించింది. నీ పంచ ప్రాణం, నీ లైఫ్ కంటే, నీ వైఫ్ కంటే ఎక్కువ.. నీకిష్టమైనది ఏదైనా ఉందంటే అది నేనే చెప్పనా? నువ్వే చెబుతావా? అని వర్ష అడుగుతుంది.

నా దేవుడే నా గురించి చెప్పాడు
దీనికి అమర్‌దీప్ ఆన్సర్ ఇస్తూ.. 'సింధూరం టైం నుంచి నేను ఎప్పుడైతే ఆ సినిమా చూశానో, అప్పటి నుంచి నా మైండ్‌లో రన్ అయిన ఒకే ఒక్క హీరో రవితేజ గారు. నీ పేరు నేను ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నార్రా నా లిస్ట్‌లో అంటే.. అవకాశం వస్తే అది నీకు ఉపయోగపడేలా ఉండాలి అన్నారు. నేను ఊహించుకున్న నా దేవుడే నా గురించి మాట్లాడినప్పుడు ఇది కదా నా సక్సెస్ ' అని చెప్పాడు అమర్‌దీప్ చౌదరి.
నా మెంటల్ కండీషన్ బాలేదు
అదృష్టం, దేవుడిచ్చిన వరం, అబ్బా ఇంకా తలనొప్పిరా బాబు అనే ఈ మూడు ఉంటేనే అది ప్రేమ, అది పెళ్లి, అది పెళ్లాం అని తేజస్విని గౌడపై తన ప్రేమను చాటుకున్నారు అమర్‌దీప్ చౌదరి. నేను దేనిని క్యారీ ఫార్వర్డ్ చేయను, నాకు ఆల్రెడీ క్యారీలు చాలా ఉంటాయ్.. ఈ క్యారీలను మోసుకుంటూ .. ఈ క్యారీని కూడా మోశానంటే ఆ తర్వాత నన్నెవరైనా క్యారీ చేయాల్సి వస్తుందని అమర్ సెటైర్లు వేశాడు. బయట మా గురించి రకరకాల రూమర్స్ రాసేవారంతా పోతార్రా.. నాశనమై పోతారంటూ శాపనార్ధాలు పెట్టాడు. నేనో పెద్ద ఓవర్ థింకర్.. చాలా ఓవర్ థింక్ చేస్తా. అంటే నాకది అది తెలియదు.. ఎందుకంటే నా మెంటల్ స్టేటస్ అస్సలు బాగోదు.
అన్నాచెల్లెలి బంధంపై మచ్చ
నీ వయసుకు ఇంకా చాలా చూడాలి, చేయాలి ఎందుకంత స్ట్రగుల్ అవుతున్నావ్? అని వర్ష అడగ్గా.. కర్మ.. కర్మ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుందని అమర్ చెప్పాడు. నేను ఎంతో మందిని అప్పట్లో బాధపెట్టి ఉన్నాను కాబట్టే నేను తిరిగి ఈరోజు అనుభవిస్తున్నాను.. దానిని నేను సంతోషంగా తీసుకుంటానని తెలిపాడు. జీవితమంతా వెన్నుపోట్లే ఉన్నాయి.. నా షర్ట్ విప్పి చూస్తే అవే ఉంటాయన్నాడు. చెప్పులు ఎప్పుడూ డోర్ బయటే ఉండాలి.. బెడ్ రూం వరకు రాకూడదు. అన్నాచెల్లెలు అనే పదానికి ఒక స్వచ్ఛత ఉంది, అది పాడు చేయొద్దు. ఇలాంటివి చాలానే జరిగాయని అమర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అమర్‌దీప్ ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











