ఈ కట్టె కాలేవరకు నీతోనే.. బిగ్‌బాస్ అమర్‌దీప్ ఎమోషనల్
అమర్‌దీప్ చౌదరి.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. తొలుత సీరియల్స్ ద్వారా తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన ఈ కుర్రాడిని బిగ్‌బాస్ రియాలిటీ షో మరింత పాపులర్ చేసింది. హౌస్‌లో తన వ్యక్తిత్వం, బిహేవియర్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు అమర్. ప్రస్తుతం సీరియల్స్, ఇతర ఈవెంట్స్‌తో బిజీగా ఉన్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
అనంతపురం టూ హైదరాబాద్
రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన అమర్‌దీప్ తండ్రి ఆర్టీసీ డ్రైవర్, తల్లి కూచిపూడి డ్యాన్సర్. దీంతో చిన్నప్పటి నుంచి తల్లి పెంపకంలో డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న అమర్.. డ్యాన్స్ నేర్చుకుని కొన్ని పోటీల్లోనూ పాల్గొన్నాడు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన అనంతరం లండన్‌లో మాస్టర్ చేశాడు. కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత నటనపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిల్మ్స్ వైపు అడుగులు వేశాడు. 2016లో పరిణయం అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనను ప్రారంభించిన అమర్‌దీప్ చౌదరి ఆ తర్వాత దూసుకెళ్లాడు. పిజ్జా వర్సెస్ గొంగూర, మంగమ్మగారి మనవడు, సూపర్ మచ్చి, రాజుగారి కిడ్నాప్, నా పబ్ జీ నా వైఫ్, గర్ల్ ఫ్రెండ్, డబుల్ డేట్ వంటి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించాడు.

జానకి కలగనలేదు సీరియల్‌తో ఫేమ్
ఈ ఫేమ్‌తో అమర్‌దీప్‌కు తెలుగు టెలివిజన్ రంగం నుంచి ఆహ్వానం అందింది. 2017లో ఉయ్యాల జంపాలా సీరియల్‌లో నటించిన అమర్‌దీప్ ఆ తర్వాత సిరిసిరి మువ్వలు, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్స్ చేశాడు. ఈ దశలో జానకి కలగనలేదు సీరియల్ అమర్‌దీప్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అమర్‌దీప్ చౌదరి.. సినిమాల్లోనూ అవకాశాల కోసం ట్రై చేశాడు. ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, కృష్ణార్జున యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు తదితర సినిమాలలో నటించాడు.
తృటిలో మిస్ అయిన బిగ్‌బాస్ టైటిల్
ఈ ఫేమ్‌తో తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అమర్‌దీప్ చౌదరి అవకాశం అందుకున్నాడు. ఫైనల్ వరకు పోటీలో నిలిచిన అమర్.. టైటిల్ గెలుస్తాడని అంతా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో పల్లవి ప్రశాంత్‌కు అవకాశం దక్కింది. 15 వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నందుకు భారీ మొత్తాన్ని ఇంటికి పట్టికెళ్లాడు అమర్. వారానికి రూ.2.5 లక్షల చొప్పున 15 వారాలకు గాను దాదాపు 37 లక్షలు సంపాదించాడట. ఇక కర్ణాటకకు చెందిన బుల్లితెర నటి తేజస్విని గౌడతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లాడాడు.
అరియానాతో బాండింగ్
ఇదిలాఉండగా.. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు అమర్‌దీప్. ఈ ఆదివారం ఫ్రెండ్ షిప్ డే కావడంతో ఆ థీమ్‌తో స్పెషల్ షో డిజైన్ చేశారు. ఈ వారం అమర్‌దీప్‌తో పాటు అరియానా గ్లోరి, శోభాశెట్టి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ శెట్టిలు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు తమ మిత్రులకు ఫ్రెండ్ షిప్ బాండ్ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే తమ మిత్రుల గొప్పదనాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో అమర్‌దీప్ గురించి అరియానా చెబుతూ.. నువ్వు నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్స్.. నువ్వు ఇచ్చినంత రెస్పెక్ట్ ఇండస్ట్రీలో ఎవరూ ఇవ్వరని చెప్పింది. తర్వాత అమర్ మాట్లాడుతూ.. అరియానా నా లైఫ్‌లో ఉందనే ధైర్యమని .. ఈ కట్టె కాలే వరకు నీతోనే అని చెప్పడంతో అరియానా కంటతడి పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











