అమర్ దీప్ - తేజస్విని గౌడ విడాకులు.. కారణం ఏంటీ.. క్లారిటీ ఇచ్చిన తేజూ
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీరియల్ నటి తేజస్విని గౌడ్. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చెందిన ఈమె తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. మొదటగా తమిళంలో వచ్చిన విద్యా నెం.1 సిరీయల్ ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆ సీరియల్ మంచి ఫేమ్ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించింది. ఆ సీరియల్ లో తేజస్విని గౌడ కోయిలమ్ (చిన్ని) పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకుంది.
అంతే అటు కన్నడ టెలివిజన్ రంగంలోనూ 'బిలి హెంద్తి' అనే సీరియల్ లో నటించింది. రమ్య అనే పాత్ర ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టార్ సువర్ణ ఛానెల్ లో ప్రసారమైన ఈ సీరియల్ ద్వారా కన్నడిగులను బాగానే అలరించింది. తెలుగు, కన్నడలోనే కాకుండా తమిళంలోనే మరో సీరియల్ లోనూ నటించింది. విద్యా నెం.1తో పాటు సుందరి నీయుమ్ సుందన్ నానుమ్ అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ ద్వారా మరింతగా క్రేజ్ దక్కించుకుంది. ఇలా మూడు భాషల్లోని టెలివిజన్ సీరియల్స్ లో నటించి మెప్పింది.

కానీ తేజస్విని గౌడకు తెలుగు ఆడియెన్స్ లోనే మంచి గుర్తింపు దక్కింది. ఇక్కడ టెలివిజన్ ప్రేక్షకులు కూడా ఈమెను ఎంతగానో ఆదరించారు. అయితే తేజస్విని గౌడ నటుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ ను మూడేళ్ల కిందనే పెళ్లి చేసుకుంది. 2022 డిసెంబర్ 11న వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. సీరియల్స్ ద్వారా తేజస్విని మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అమర్ దీప్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం అమర్ దీప్ సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నారు. డ్యాన్సర్స్ గానూ పలు షోల్లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న అమర్ దీప్ చౌదరి - తేజస్విని గౌడ విడిపోతున్నారని పుకార్లు పుట్టకొచ్చాయి. వారి మధ్య అభిప్రాయ బేధాలున్నాయని, ఆ విషయం డివోర్స్ వరకు వచ్చిందనే రూమర్లు బాగానే ప్రచారం జరిగాయి. అయితే దీనిపై తాజాగా అమర్ దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ స్పందించింది.
జబర్దస్త్ వర్ష యాంకర్ గా తాజాగా రన్ అవుతున్న టాక్ షో 'కిస్సిక్ టాక్స్'. ఈ షోకు బుల్లితెర సెలబ్రెటీలు, సినీ నటులు వస్తూ సందడి చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో సీరియ్ నటి, అమర్ దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ హాజరయ్యారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో డివోర్స్ రూమర్లపైనా స్పందించింది. అవన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చింది. భార్యభర్త అన్నాక గొడవలు సహజమన్నారు. అంతమాత్రానా ఎవరూ విడిపోరని వివరించింది.
తనను అమర్ దీప్ ఎంతగానో ప్రేమిస్తాడని, అమర్ దీప్ కంటే ఎక్కువగా నేనే అతన్ని ప్రేమిస్తున్నానని కూడా చెప్పింది. మేం ఇద్దరం హాయిగా సంతోషంగా ఉన్నామని వివరించింది. అలాంటి రూమర్లను నమ్మొదని అభిమానులకు సూచించింది. ఇక త్వరలోనే పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్టు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.


Click it and Unblock the Notifications











