మరోసారి శివాజి హెల్త్ సీరియస్.. డాక్టర్ రిపోర్టులో షాకింగ్ విషయాలు.. దానికి ఒప్పుకోకపోతే ఎలిమినేట్!
విదేశీ కల్చర్‌కు అద్దం పట్టే కంటెంట్‌తో ప్రసారం అవుతున్నా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకున్న షోనే బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది ఎన్నో అనుమానాలతో వచ్చి తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయింది.
ఫలితంగా నిర్వహకులు ఏకధాటిగా సీజన్లను జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టాగా రన్ చేస్తున్నారు. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన శివాజికి మరోసారి సీరియస్ అయింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

టైటిల్ రేసులో ముందుగా: ఉల్టా పుల్టా కాన్సెప్టుతో మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురిని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోనికి తీసుకు వచ్చారు. అయితే, ఇందులో ఆరంభం నుంచే శివాజి టైటిల్ ఫేవరెట్‌గా మారాడు. ఆటతీరుతో పాటు తెలివితేటలతో మెప్పిస్తూ క్రేజ్‌ను పెంచుకున్నాడు. తద్వారా విన్నర్ రేసులో ముందుకొచ్చాడు.
గాయపడినా.. కాస్త డౌన్‌గా: ఓ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కును ఆడుతోన్న సమయంలోనే శివాజి భుజానికి గాయం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఫిజికల్ గేమ్‌లు ఆడలేకపోతున్నాడు. అయినప్పటికీ బుర్రకు పని చెప్తున్నాడు. మధ్యలో ఈ సమస్య తగ్గడంతో మళ్లీ పుంజుకున్నాడు. కానీ, వ్యక్తిగత దూషణలతో డౌన్ అవుతున్నాడు.
వెళ్లిపోతానని... ఆపేశారు: శివాజి తన గాయాన్ని హైలైట్ చేస్తూ చాలా మంది విమర్శిస్తుండడంతో ఇంటికి వెళ్లిపోతానని ఆ మధ్య రచ్చ చేశాడు. దీంతో బిగ్ బాస్ కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి విషయం అడగ్గా.. తనకు ఇబ్బందిగా ఉందని, ఇంటికి వెళ్లిపోతానని చెప్పాడు. కానీ, దీనికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు. పైగా ఆ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా శివాజికి సూచించడంతో షోలో కంటిన్యూ అయ్యాడు.
మళ్లీ గాయం.. అడిగాడు: గాయం నుంచి కోలుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చిన శివాజి.. ఇటీవలే ఇటుకల టాస్కులో మరోసారి గాయపడ్డాడు. అప్పటి నుంచి తరచూ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజిని బిగ్ బాస్ కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి, గాయం తీవ్రత గురించి అడగ్గా.. చాలా ఇబ్బందిగా ఉందని శివాజి వెల్లడించాడు.
షాకింగ్‌గా డాక్టర్ రిపోర్టు: శివాజి సమస్యను విన్న బిగ్ బాస్ 'మిమ్మల్ని దగ్గరుండి పరీక్షించిన ఒక వైద్యుడు మీరు క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. మరో ఇద్దరు వైద్యులు మాత్రం మీ చేతికి రెస్ట్ అవసరం అని సూచించారు. దానికి రెస్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పారు. మీరు షోలో కొనసాగుతారా? లేదా? అనేది మీరే తేల్చుకుని చెప్పండి' అని చెప్పాడు. అలాగే రిపోర్టులూ ఇచ్చారు.
ఉంటానని.. వెళ్లిపోతాను: రిపోర్టులను చూసిన తర్వాత శివాజి 'షో చివరికి వచ్చింది. కాబట్టి ఈ చాన్స్ మళ్లీ మళ్లీ రాదు. అందుకే షోలో కంటిన్యూ అవుతాను. ఏ రిస్క్ అయినా నేనే తీసుకుంటా' అన్నాడు. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లి ఏదో పని చేస్తూ ఇబ్బంది పడ్డ శివాజి మళ్లీ కన్‌ఫెషన్ రూమ్‌కు వచ్చాడు. ఈ సారి మాత్రం షోలో కొనసాగలేనని, బయటకు వెళ్లిపోతానని బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేసుకున్నాడు.
నాగార్జున సూచించగానే: శివాజి మాటలు విన్న బిగ్ బాస్ 'ఏ నిర్ణయం అనేది త్వరలో వెల్లడిస్తాం' అని చెప్పాడు. ఇక, వీకెండ్ ఎపిసోడ్‌లో అతడిని నాగార్జున కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి షోలో కొనసాగమని, పరిస్థితి తీవ్రం అయితే తనకు చెప్పమని చెప్పాడు. దీంతో శివాజి తన నిర్ణయం మార్చుకున్నాడు. కానీ, అతడి పరిస్థితి చూస్తుంటే ఫినాలేకు ముందే వెళ్లిపోతాడేమో అని అందరూ అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











