Bigg Boss Telugu 7: శివాజికి బిగ్ బాస్ సర్‌ప్రైజ్.. హౌస్‌లో స్పెషల్ పవర్స్.. ఇక విన్నర్ అయినట్లే!
సాధారణంగా బుల్లితెరపైన ఎన్నో రకాల కాన్సెప్టులతో షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలకు చేరువగా వచ్చి సక్సెస్ అవుతుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా తెలుగులో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. ఇప్పుడు ఏడో దానితో ఆడియెన్స్‌ను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ షోలో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శివాజికి బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట పద్నాలుగు మంది, ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందరిలో అతి తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. వారిలో సీనియర్ హీరో శివాజి ఒకడు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే తనదైన ఆట తీరును, మైండ్ గేమ్‌ను ప్రదర్శిస్తున్నాడు. దీంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నాడు.

ఏడో సీజన్‌లో టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న శివాజిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపుతున్నట్లు ఆదివారం రాత్రి ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్రోమోలో చూపించారు. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. చాలా మంది అతడిని మళ్లీ తీసుకు వస్తారని చెబుతున్నా.. శివాజి అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇక, సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ శివాజిని కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి చేయి ఎలా ఉందని అడిగాడు. దీనికి అతడు చాలా వరకూ ఇబ్బందిగానే ఉందని సమాధానం ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్ 'శివాజి.. మీరు వైద్య పరీక్షల కోసం బయటకు రావాల్సి ఉంటుంది. స్కానింగ్ అయిన తర్వాత మళ్లీ లోపలికి పంపుతాము. ఈ విషయాన్ని అందరికీ చెప్పి రండి' అని వివరించాడు.
బిగ్ బాస్ సూచన మేరకు శివాజి హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి 'నేను వెళ్లొస్తాను' అంటూ మెయిన్ గేట్ వైపు వెళ్లాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆయన ఎలిమినేట్ అవుతున్నాడని అనుకుని తెగ బాధ పడ్డారు. అప్పుడు శివాజి వాళ్లకు అసలు విషయం చెప్పాడు. అయినప్పటికీ ఎవరూ నమ్మలేదు. ప్రశాంత్, యావర్ అయితే తెగ ఏడ్చేశారు.
శివాజి వెళ్లిన కాసేపటి తర్వాత స్టోర్ రూమ్‌లో బెల్ మోగింది. అందులో కాఫీ పౌడర్‌ను పంపించారు. అది చూసిన అమర్‌దీప్ 'కాఫీ పంపించారు అంటే శివాజి అన్న మళ్లీ వస్తున్నారు' అన్నాడు. దీంతో అందరూ సంతోషపడ్డారు. ఆ వెంటనే శివాజి కూడా హౌస్‌లోకి అడుగు పెట్టాడు. తనకు బిగ్ బాస్ కాఫీ పౌడర్‌ను పంపించడంతో శివాజి సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యాడు.

అనంతరం కెప్టెన్ ప్రిన్స్ యావర్‌ను తనకు సహాయం చేయడం కోసం ఇద్దరు డిప్యూటీలను ఎంపిక చేసుకోవాలని చెప్పాడు. దీంతో అతడు శివాజి, సందీప్‌ను తీసుకున్నాడు. అప్పుడు వాళ్లిద్దరికి కూడా కెప్టెన్‌కు లభించిన ఇమ్యూనిటీ మినహా అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పాడు. ఇలా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శివాజికి బిగ్ బాస్ కాఫీని, యావర్ డిప్యూటీ పవర్‌ను ఇచ్చారు.
ఇక, శివాజి పట్ల బిగ్ బాస్ చూపిస్తున్న ప్రేమను చూసిన ఒక వర్గం వాళ్లు దీన్ని తప్పుబడుతున్నారు. అతడికి కాఫీ అంటే ఇష్టం అని లగ్జరీ బడ్జెట్‌లో కాకుండా స్పెషల్‌గా పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే శివాజీనే విన్నర్‌గా ప్రకటిస్తారేమో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి శివాజి వెళ్లడం, రావడం షోకు హైప్ పెంచేసింది.


Click it and Unblock the Notifications











