Bigg Boss Telugu 7: ప్రశాంత్‌ను ఆగం చేసిన బిగ్ బాస్.. శివాజిని గెలిపించేందుకు మాస్టర్ ప్లాన్

బిగ్ బాస్... బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని రియాలిటీ షో ఇది. అంతలా దీన్ని తెలుగు ఆడియెన్స్ అక్కన చేర్చుకున్నారు. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో ఈ షోను సక్సెస్ చేశారు. అందుకే ఇది ఇక్కడ వరుసగా సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను కూడా రంజుగా నడుపుతున్నారు. ఇక, ఈ షోలో కామన్ మ్యాన్‌గా వచ్చి సత్తా చాటుతోన్న పల్లవి ప్రశాంత్‌కు బిగ్ బాస్, శివాజితో కలిసి అన్యాయం చేశాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

ప్రయోగాలు చేస్తూ రంజుగా:గత సీజన్ల కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. బిగ్ బాస్ నిర్వహకులు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. దీంతో ఇది సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది.

Bigg Boss And Sivaji Injustice to Pallavi Prashanth For Secret Task

బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్క్‌తో:బిగ్ బాస్ ఏడో సీజన్ 12వ వారంలో మొదట ఎవిక్షన్ పాస్ టాస్కును ఇచ్చారు. ఇందులో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బిగ్ బాస్ మ్యాన్షన్' టాస్క్ ఇచ్చారు. ఇందులో ఓ హంతకుడు హత్యలు చేస్తుంటాడు. అతడిని కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇందులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులవుతారు.

శివాజికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి:తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో శివాజికి మ్యాన్షన్ మేనేజర్ పాత్రను ఇచ్చారు. ఇది చెప్పడానికి అతడిని కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్.. అసలు హంతకుడు మీరే అని చెప్పాడు. అంతేకాదు, మ్యాన్షన్‌లో మిస్సెస్ బిగ్ బాస్‌‌తో పాటు మరిన్ని హత్యలు కూడా చేయాలని.. ఎవరిని ఎప్పుడు ఎలా చంపాలి అనేది బిగ్ బాస్ ఫోన్ ద్వారా సూచిస్తాడని శివాజికి వివరించాడు.

Bigg Boss And Sivaji Injustice to Pallavi Prashanth For Secret Task

ప్రశాంత్‌ను చంపాలంటూ:సీక్రెట్ టాస్కులో భాగంగా పల్లవి ప్రశాంత్‌ను చంపాలని శివాజికి బిగ్ బాస్ ఫోన్ ద్వారా సూచించాడు. అందుకోసం అతడు ఎంతగానో ప్రేమగా దాచుకుంటోన్న మొక్కను ఎవరూ చూడకుండా తీసుకుని వెళ్లి పోస్టు బాక్సులో వేయాలని చెప్పాడు. ఒకవేళ ఈ సీక్రెట్ టాస్కును చేయడంలో విఫలం అయితే శివాజి కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలగాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు.

ప్రశాంత్‌ను స్టోర్ రూమ్‌లో:బిగ్ బాస్ టాస్కు ఇచ్చిన తర్వాత శివాజి.. ప్రశాంత్ దగ్గరకు వెళ్లి 'ఎందుకు ఏమిటి అని అడగకు. నిన్ను ఎక్కడైనా దాచేయమని బిగ్ బాస్ చెప్పారు. అందుకే నువ్వు వెళ్లి స్టోర్ రూమ్‌లో దాక్కో. మళ్లీ నేను చెప్పే వరకూ బయటకు రావొద్దు' అని అందులో దాచి పెట్టాడు. ఆ తర్వాత 'బిగ్ బాస్ మళ్లీ నేను చెప్పే వరకూ స్టోర్ రూమ్ లాక్‌ను తీయవద్దు' అని శివాజి రిక్వెస్ట్ చేశాడు.

Bigg Boss And Sivaji Injustice to Pallavi Prashanth For Secret Task

మొక్కను దాచేసిన శివాజి:పల్లవి ప్రశాంత్‌ను స్టోర్ రూమ్‌లో దాచిన శివాజి.. ఆ తర్వాత అతడు కనిపించడం లేదని, అసలు నేరస్తుడు అతడే అని ఇంటి సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుండడంతో పాటు ప్రియాంకను కిచెన్‌లోకి వెళ్లింది. ఇదే అదును అని భావించిన శివాజి.. ప్రశాంత్ మొక్కను పోస్టు బాక్సులో వేసి టాస్క్ పూర్తి చేసేశాడు.

స్టోర్ రూమ్‌లో ఆగం ఆగం:శివాజి మాటతో స్టోర్ రూమ్‌లో ఉన్న ప్రశాంత్ 'బిగ్ బాస్ డోర్ లాక్ తీయండి. అన్న చెప్పండని లోపలికి వచ్చినా.. నాకు ఆగం ఆగం అయితంది. స్టోర్ రూమ్ కెమెరా యాక్టివ్ యాక్టివ్' అంటూ యమా నవ్వించాడు. ఆ తర్వాత శివాజి చెప్పడంతో బిగ్ బాస్ లాక్ తీశాడు. ఆ తర్వాత కాసేపటికి ప్రశాంత్ డెడ్ అయ్యాడని ప్రకటించారు. దీంతో అతడు దెయ్యంలా మారిపోయాడు. మొత్తానికి శివాజిని గెలిపించేందుకు ప్రశాంత్‌ను బిగ్ బాస్ ఆగం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X