భర్తపై క్రిమినల్ కేసు పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. రెండో పెళ్లి కూడా పెటాకుల దిశగా!

యువ టెలివిజన్ నటి రెండో వివాహం కూడా పెటాకుల దశకు చేరుకొన్నది. గత కొద్దికాలంగా తన భర్తతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో వారిద్దరూ విడిపోయేందుకు సిద్దపడ్డారు. అయితే విభేదాలు ముదిరిపోవడంతో ఏకంగా భర్తపై కేసు నమోదు చేసింది. దాంతో వీరిద్దరి దాంపత్య వివాదం జాతీయ మీడియాలో హైలెట్ అయింది. హిందీ టెలివిజన్ రంగంలో యువ నటి దాంపత్య వివాదానికి సంబంధించిన కేసు వివరాల్లోకి వెళితే..

హిందీ టెలివిజన్ రంగంలో యువ తారగా గుర్తింపు పొందిన దల్జిత్ కౌర్ కుల్వద్దు, ఇస్ ప్యార్ కో క్యా మ్ దూ? కాలా టీకా అనే సీరియల్స్ ఈ అందాల భామ భారీ పాపులారిటీ సంపాదించుకొన్నారు. ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్‌ 13, నాచ్ బలియే రియాలిటీ షో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు పొందింది.

Bigg Boss and Television actress Dalljiet Kaur files case on Husband Nikhil Patel

దల్జిత్ గతంలో కుల్వాదు నటుడు షాలిన్ భానోత్‌తో వివాహం 2009లో జరిగింది. వారికి జేడన్ అనే కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత నిఖిల్ పటేల్‌తో రెండో వివాహం 2023లో మార్చిలో జరిగింది. అయితే వారిద్దరూ కెన్యాలో స్థిరపడ్డారు.

అయితే కొన్నాళ్లు బాగానే జరిగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అయితే కెన్యా నుంచి దల్జిత్ తన కుమారుడిని తీసుకొని ఇండియా రావాలని అనుకొన్నారు. దాంతో మా మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. అయితే దాంతో మా మధ్య బంధం ముందుకు కొనసాగడం కష్టమే అని భావన కలిగింది.

Bigg Boss and Television actress Dalljiet Kaur files case on Husband Nikhil Patel

దల్లిత్ కౌర్, నిఖిల్ మధ్య విభేదాలు పెరిగి గొడవలు చోటుచేసుకొన్నాయి. దాంతో వారిద్దరూ మధ్య తీవ్రమైన విబేధాలు నెలకొన్నాయి. దాంతో నిఖిల్‌పై వేధింపులు, చీటింగ్, హింసాత్మక ప్రవర్థన అంశాలతపై కేసు మోదు చేసింది. అనంతరం కోర్టు ద్వారా నోటీసులు పంపించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం ప్రకారం.. నిఖిల్‌పై ఇండియన్ ఐటీ యాక్ట్ 2000 కింద, ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అబ్యూస్ 2012 చట్టం కింద కేసు నమోదు అయ్యాయి. ఆగస్టు 2 తేదీన కేసు నమోదు చేసినట్టు దల్జిత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X