మార్ఫింగ్ ఫోటోలతో ఆరియానాకు వేధింపులు.. ఏకంగా అలాంటి ఫోటోలు.. వీడియో పోస్ట్ చేసి డిలీట్!
సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ? ఎలా స్టార్ అవుతున్నారో చెప్పలేని పరిస్థితి. యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ చేసే యాంకర్ అరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయి ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడానికి రాంగోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ అసలు కారణం అని అంటూ ఉంటారు.. ఆ సంగతి అలా ఉంచితే ఈ భామ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. దానిని ఆమె కొద్ది సేపటికే డిలీట్ కూడా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

క్రేజ్ రాలేదు కానీ
యాంకర్ గా మొదలుపెట్టి జెమినీ కామెడీ మొదలు అనేక యూట్యూబ్ ఛానల్స్ లో అరియానా గ్లోరీ పని చేసింది.. కానీ ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు కానీ రాంగోపాల్ వర్మతో చేసిన ఒకే ఇంటర్వ్యూ మాత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది. సాధారణంగానే వర్మ పెద్దగా లోపల దాచుకోకుండా అనే మాట్లాడుతూ ఉంటాడు.

తొడలు బాగున్నాయని
అందులో భాగంగా ఆయన నీ తొడలు బాగున్నాయని కామెంట్ చేశాడు. యాంకర్ తొడల మీద కామెంట్ చేయడంతో అలా ఈ భామ ఫేమస్ అయింది. ఫేమస్ అవడమే కాక గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా మారింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఆమె తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసి డిలీట్ చేసింది.

ఫోటోలు మార్ఫింగ్ చేసి
అరియనా అంటే మన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అయితే గత కొన్ని రోజులుగా అరియనా పై సోషల్ మీడియాలో ఒకతను అరియనా ఫోటోలు మార్ఫింగ్ చేసి తెరపై బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎంత చెప్పినా వినక పోవడంతో అరియనా అతని మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది అరియానా గ్లోరీ.

లిటరల్లీ ఒక నెల నుంచి
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక ఖాతాను షేర్ చేసిన అరియానా 'ఆ పేజ్ లిటరల్లీ ఒక నెల నుంచి బ్లాక్ చేస్తున్నాయా, రిపోర్ట్ చేస్తున్నా మళ్ళీ అదే పేరుతో క్రియేట్ చేసుకుని ఒక నలుగురినే ఫాలో అవుతూ, ఎంత మెంటల్ గా అంటే అంత మెంటల్ గా హెరాస్ చేస్తున్నారని ఆమె పేర్కొంది.

ఎంత ఇగ్నోర్ చేస్తున్నా
ఎంత ఇగ్నోర్ చేస్తున్నా ఈ పేజీ వాడు ఎవడో కానీ, ఓ గాడ్ బాగా హెరాస్ చేస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంత పర్సనల్ గ్రడ్జ్? రెడీగా ఉండండి అని ఆమె వార్నింగ్ ఇచ్చింది. నేను సైబర్ క్రైమ్ వాళ్లకు కూడా కంప్లైంట్ ఇచ్చానని, నువ్వు పిల్ల బచ్ఛావి అని తెలిస్తే నిన్ను వదిలేది లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఏం నొప్పి అవుతుంది? ఎందుకు అంత కుళ్ళు? నువ్వు పిల్ల బచ్ఛావి అని తెలిస్తే నిన్ను పగలగొడతానని ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











