ఐదు బ్రేకప్స్.. వాళ్ల శాపనార్థాల వల్లే ఇలా ఉన్నా!
బుల్లితెర ప్రేక్షకులకు అర్జున్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 6'లో పాల్గొన్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించారు. షోలో తన అమాయకత్వం, నిజాయితీ, సరదా మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్జున్.. ప్రస్తుతం పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీగా కొనసాగుతున్నారు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, బ్రేకప్‌లు, పెళ్లి గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్వ్యూలో యాంకర్.. "మీకు ప్రస్తుతం ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్ ఉన్నారా?" అని ప్రశ్నించగా.. అర్జున్ కళ్యాణ్ కాస్త ఎమోషనల్‌గా స్పందించారు. "ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత "ఇంతవరకు ఎంత మందిని ప్రపోజ్ చేశారు?" అని అడగగా.. ఆయన ఆసక్తికరంగా స్పందించారు. "నంబర్లు చెప్పడం అవసరం లేదు. కానీ నేను ఎవరికైనా బీభత్సంగా ఇష్టపడితే తప్ప 'ఐ లవ్ యు' చెప్పను. నా మనసుకు చాలా స్పెషల్‌గా అనిపించిన వ్యక్తికే ప్రేమను వ్యక్తం చేస్తాను. అలాగే పెళ్లి చేసుకోవాలనిపించిన అమ్మాయికే నేను ప్రపోజ్ చేస్తాను" అని అన్నారు.

వెంటనే యాంకర్.. "అంటే ఎవరికైనా ప్రపోజ్ చేశారా?" అని అడగగా.. "చెప్పాను" అని సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. "మరి పెళ్లి ఎప్పుడు?" అని అడిగితే.. "అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి.. లేకపోతే లేదు" అంటూ కాస్త డల్‌గా మాట్లాడారు. దీంతో యాంకర్.. "మీ జీవితంలో ఎవరో ఉన్నట్టే కదా?" అని చమత్కరించగా.. అర్జున్ వెంటనే స్పందిస్తూ.. "నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి ఒప్పుకోవాలి కదా. నేను ప్రపోజ్ చేసి చాలా కాలం అయింది.. ఇప్పుడు కాదు. ఆ అమ్మాయి మీద ప్రేమ కూడా చచ్చిపోయింది" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇక తన ప్రేమ కథల గురించి మాట్లాడుతూ.. "నేను వన్‌సైడ్ లవర్స్ బ్రాండ్ అంబాసిడర్‌ను" అంటూ నవ్వులు పూయించారు.
ప్రేమలో ఎక్కువగా అబ్బాయిలే ముందుకు వచ్చి చెప్పాల్సి వస్తుందని, అమ్మాయిలు చాలా అరుదుగా ముందుగా ప్రేమను వ్యక్తం చేస్తారని అన్నారు. "ఒక అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి వచ్చి 'ఐ లవ్ యు' అంటే అందులో ఉండే కిక్ వేరే ఉంటుంది" అంటూ సరదాగా చెప్పారు. లవ్ బ్రేకప్ గురించి కూడా అర్జున్ కళ్యాణ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. "ఒకసారి బ్రేకప్ అయిందని దానిని పట్టుకుని ఏడవకూడదు. జీవితంలో ముందుకు సాగాలి. మరో మంచి రిలేషన్ వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు మాయమవుతాయి. ఒక అమ్మాయి వెళ్లిపోయిందంటే.. మరో మంచి అమ్మాయి వస్తుందన్న మాట. లవ్ ఫెయిల్యూర్ ఒక్కసారిగా జరగదు.. ముందే సంకేతాలు కనిపిస్తాయి. అవి అర్థమైతే కొంచెం సైడ్ అవ్వడం మంచిది" అంటూ యువతకు సలహా ఇచ్చారు.
అలాగే బ్రేకప్ సమయంలో మనసు మార్చుకోవడానికి పనిలో బిజీ కావాలని సూచించారు. "ఏదైనా వర్క్‌లో బిజీ అయిపోవాలి. వేరే విషయాలపై ఫోకస్ పెట్టాలి. లేకపోతే అదే బాధలో ఇరుక్కుపోతాం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనసు మార్చుకోవాలి" అంటూ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ఇక యాంకర్.. "బ్రేకప్ విషయంలో అమ్మాయిలదే తప్పా? అబ్బాయిలదే తప్పా?" అని అడగగా.. అర్జున్ చాలా మెచ్యూర్‌గా స్పందించారు. "రైట్ టైమ్‌లో రాంగ్ పర్సన్, రాంగ్ టైమ్‌లో రైట్ పర్సన్ కలుస్తారు. అందుకే చాలా రిలేషన్లు వర్కౌట్ కావు. బ్రేకప్ అనేది ఇద్దరి మధ్యా అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్లే జరుగుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడుకుని.. తర్వాత ఒకరిపై ఒకరు నిందలు వేయడం కరెక్ట్ కాదు" అని అన్నారు.
అందులో భాగంగా తన వ్యక్తిగత విషయాన్ని కూడా వెల్లడించారు. "నాకు ఇప్పటివరకు ఐదు బ్రేకప్స్ అయ్యాయి. అందులో ఒకటి మాత్రమే మ్యూచువల్. మిగతావన్నీ వన్‌సైడ్ బ్రేకప్సే" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. దీంతో యాంకర్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. చివరగా ఇంజనీరింగ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. "నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ముగ్గురు అమ్మాయిలు నన్ను ప్రపోజ్ చేశారు. కానీ నేనే వాళ్లను రిజెక్ట్ చేశాను. ఇప్పుడు చూస్తుంటే వాళ్లే నాకు శాపాలు పెట్టినట్టున్నారు.. వాళ్ల శాపనార్థాల వల్లే నేను ఇంకా ఇలా సింగిల్‌గా ఉండిపోయాను అనుకుంటా" అంటూ నవ్వుతూ ఎమోషనల్ అయ్యారు.
అలాగే అబ్బాయిలకు ఒక సూచన కూడా ఇచ్చారు. "ఎవరైనా అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేస్తే సాఫ్ట్‌గా హ్యాండిల్ చేయండి. వాళ్లతో రఫ్‌గా బిహేవ్ చేయకండి. అది వాళ్ల మనసును నొప్పిస్తుంది" అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం ఆయన సరదా స్టైల్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications