రికమండేషన్స్ ఉంటేనే అవకాశాలు.. అలా ఛాన్స్‌లు కోల్పోయా: బిగ్ బాస్ నటుడు షాకింగ్ కామెంట్స్

అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సందడి చేసిన ఈయన.. మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టి సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కళ్యాణ్, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయి? రికమండేషన్స్ ఎంత ప్రభావం చూపుతాయి? తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఏంటి? వంటి అనేక విషయాలను ఓపెన్‌గా వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన అర్జున్ కళ్యాణ్, విదేశాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. హీరోగా 'చిన్న సినిమా' వంటి చిత్రాలతో పాటు, పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశారు. అలాగే వెబ్ సిరీస్‌ల ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనడం ద్వారా ఆయన పేరు మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. షోలో తన ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత BB Jodi లో పాల్గొని తన డ్యాన్స్ టాలెంట్ కూడా చూపించారు. ప్రస్తుతం టెలివిజన్ సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Bigg Boss Arjun Kalyan Shocking Comments on Recommendations and Lost Chances in Film Industry

ఇండస్ట్రీలో రికమండేషన్ లేకపోతే కష్టం
తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఎక్కువ చర్చకు దారితీశాయి. ఇండస్ట్రీలో అవకాశాల గురించి మాట్లాడుతూ, "రికమండేషన్ ఉంటేనే చాలా అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు ఆడిషన్‌కి పిలిచి, అన్నీ బాగున్నాయి, మీరు ఫైనల్ అనిపించే స్థితికి తీసుకెళ్తారు. కానీ చివరి నిమిషంలో ఎవరైనా సిఫారసుతో వచ్చేస్తే, వాళ్లకే ఆ అవకాశం ఇస్తారు" అంటూ చెప్పారు. ఇంకా "నేను ఎన్నో ప్రాజెక్ట్స్‌లో ఇలా అవకాశాలు కోల్పోయాను. కొన్ని సందర్భాల్లో షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత కూడా నన్ను తీసేసిన సందర్భాలు ఉన్నాయి" అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

చాలామంది కొత్తవారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని, అర్జున్ చెప్పిన మాటలు నిజమేనని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు కూడా తొలుత ఒప్పుకోలేదట. "వేరే రాష్ట్రాల వాళ్లు వస్తారు, రికమండేషన్స్ ఎక్కువగా ఉంటాయి, నిన్ను ఎంకరేజ్ చేయరు, తొక్కేస్తారు" అని కుటుంబ సభ్యులు చెప్పారని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలు చూసి, వాళ్లు చెప్పింది కొంతవరకు నిజమేనని అర్థమైందని అర్జున్ పరోక్షంగా వెల్లడించారు.

ఇక ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితంపై కూడా అర్జున్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "నేను ఊరికే ఐ లవ్ యు అనను. నిజంగా పెళ్లి చేసుకోవాలనిపిస్తేనే ఆ మాట చెబుతాను" అన్నారు. తన గత ప్రేమ విఫలమైందని చెబుతూ, "ఆమెనే నా జీవితం అనుకున్నాను. కానీ చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఆ ప్రేమ ఇప్పుడు చచ్చిపోయింది" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, బ్రేకప్ తర్వాత రెండు సంవత్సరాలు పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నానని తెలిపారు.

"అది కరోనా సమయం. ఒకవైపు నా తల్లిదండ్రులు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు బ్రేకప్ బాధ. ఇవన్నీ కలిసి మానసికంగా నన్ను చాలా కుంగదీశాయి. కానీ మన వాళ్ల కోసం, ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం మనం బలంగా నిలబడాలి అనుకుని బయటపడ్డాను" అంటూ భావోద్వేగంగా చెప్పారు. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, తన కెరీర్‌లో ఇంకా పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నానని అర్జున్ తెలిపారు. మంచి పాత్ర, మంచి కథ, నటుడిగా తనను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X