శాకుంతలం డిజాస్టర్ కావడానికి కారణం.. నాగచైతన్య అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్!
సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం శాకుంతలం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అస్సలు ప్రేక్షకులు ఏ విధంగా కూడా ఈ మూవీకి కనెక్ట్ కాలేకపోయారు. దీనికి కారణం అందరికి తెలిసిన రొటీన్ డ్రామా కావడం, ఆపై కథనం గుణశేఖర్ ఆసక్తికరంగా చెప్పలేకపోవడం, నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోప్ ఇలా అన్ని కోణాల్లో కూడా సమంత ఫెయిల్యూర్ కి కారణాలు కనిపిస్తున్నాయి.
ఇక శకుంతల పాత్రకి సమంత లుక్ సెట్ కాలేదని, ఆమె డబ్బింగ్ కూడా క్యారెక్టర్ కి అస్సలు షూట్ కాలేదనే టాక్ బయటకి వచ్చింది. గతంలో చిన్మయి గొంతు సమంత సినిమాలలో వినిపించేది. శాకుంతలం సినిమాకి చిన్మయి డబ్బింగ్ చెప్పలేదు. ఓవరాల్ గా మేకింగ్ పరంగా శాకుంతలం ఫెయిల్యూర్ కి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ ఫేమ్, న్యూస్ యాంకర్ ఆరోహిరావ్ మరో రీజన్ కూడా చెబుతోంది.

తాజాగా ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శాకుంతలం సినిమా మరీ అంత తీసిపారేసే విధంగా అయితే ఏమీ లేదు. చిన్నపిల్లల పంచతంత్ర కథల మాదిరిగా ఉంది. కాని ఈ మూవీ రిలీజ్ తర్వాత నాగ చైతన్య ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టి సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు. సమంత పెర్ఫార్మెన్స్ బాగోలేదని పోస్టులు పెట్టారు.
ఇవన్ని కూడా సినిమాకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడానికి కారణం అయ్యిందని ఆరోహి కామెంట్స్ చేసింది. అలాగే సినిమాలో అల్లు అర్హ పెర్ఫార్మెన్స్ భాగానే చేసింది. అంతకంటే గొప్పగా చేసే చైల్డ్ ఆర్టిస్ట్స్ చాలా మంది బయట ఉన్నారని వివాదాస్పద కామెంట్స్ కూడా ఆరోహి చేయడం విశేషం. శాకుంతలం సినిమాలో కేవలం అల్లు అర్హ నటన మాత్రమే బాగుందని అందరూ అంటూ ఉంటే ఆరోహి రావు కాస్తా భిన్నంగా రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా నాగ చైతన్య ఫ్యాన్స్ కి శాకుంతలం సినిమాని ఫ్లాప్ చేసేంత కోపం ఉందా అనే ప్రశ్న టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











