అషురెడ్డిని ఆ కోరిక తీర్చమన్న జబర్దస్త్ కమెడియన్.. ఇండస్ట్రీలో నీలాంటి వాళ్లే అంటూ బిగ్ బాస్ బ్యూటీ ఫైర్

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. యంగ్ బ్యూటీ తేజస్వి మందివాడ హోస్ట్ గా నిర్వహిస్తున్న కాకమ్మ కథలు సీజన్ 2 ప్రొగ్రామ్ కు గెస్ట్ గా వెళ్లింది. ఈ షోలో మొదటి నుంచి తేజస్వి మదివాడ బోల్డ్ ఇంటర్వ్యూలతో సెన్సేషన్ గా మారుతోంది. అయితే తాజా ఎపిసోడ్ కు బిగ్ బాగ్ మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డితో బుల్లితెర హాస్య నటుడు ఎక్స్ ప్రెస్ హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వి వారిద్దరిపై షాకింగ్ ప్రశ్నలను సంధించింది. అందుకు అషు రెడ్డి కూడా కాస్తా బోల్డ్ గానే సమాధానం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

అషు రెడ్డి ఇలా.. ఎక్స్ ప్రెస్ హరి అలా..
బుల్లితెర ప్రేక్షకులకు అషురెడ్డి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ద్వారా పరిచయం అయ్యింది. అక్కినేని నాగార్జున్ హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా చేరింది. హౌజ్ లో తనదైన శైలిలో టాస్క్ ల్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను పంచింది. తన ఎనర్జీ లెవల్స్ తో ఆకట్టుకుంటుంది. కానీ అషు రెడ్డి ఆ సీజన్ లో 4వ వారంలోనే బయటికి వచ్చింది. హౌజ్ లో ఎక్కువ కాలం లేకపోయినా.. బయటికి వచ్చిన తర్వాత ఫుల్ క్రేజ్ పెరిగింది. దాంతో పలు టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు అందాయి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి టీవీ షోలతో అలరించింది.. ఇక ఎక్స్ ప్రెస్ హరి 'పటాస్' కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. సీజన్ 1, 2 ద్వారా ప్రేక్షకులను అలరించి సెలబ్రెటీగా మారిపోయాడు. ఆ తర్వాత కమెడీ స్టార్స్, అదిరింది షోల్లో స్కిట్లు చేసి ఆకట్టుకున్నారు.

Bigg Boss Ashu Reddy Affair

అషురెడ్డితో ఎక్స్ ప్రెస్ హరి రిలేషన్ షిప్?
అషురెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి ఇద్దరూ కలిసి కామెడీ స్టార్స్ షోలో పనిచేశారు. ఎక్స్ ప్రెస్ హరి టీమ్ లో అషురెడ్డి మెరిసింది. ఈ క్రమంలో హరి అషురెడ్డితో పులిహోర కలిపే ప్రయత్నాలు ఎన్నో చేశారు. దాంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ అదంతా స్కిట్ వరకే అని తెలిసినా కొందరు మాత్రం రిలేషన్ లో ఉన్నారనే వారు. దానిపై తాజాగా అషు రెడ్డి హరి ఇలా స్పందించారు.

హరిని ఉంచుకున్నాను అనుకుంటున్నారు..
తాజాగా అషురెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి వీరిద్దరూ కలిసి యంగ్ బ్యూటీ తేజస్వి మదివాడ హోస్ట్ గా కొనసాగుతున్న కాకమ్మ కథలు సీజన్ 2 లోని 9వ ఎపిసోడ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వి వారిద్దరికి వెల్కమ్ చెబుతుంది. నువ్వు హరిని ఎందుకు పెంచుకుంటున్నావని ప్రశ్నిస్తుంది. అందుకు అషురెడ్డి షాకింగ్ గా బదులిచ్చింది. పెంచుకోపోతే ఉంచుకోమని అంటారని పెంచుకుంటున్నాని చెప్పింది. దాంతో హరి మళ్లీ అషురెడ్డితో పులిహోర కలుపుతాడు. కాలం మా ఇద్దరినీ కలపాలని చూస్తుందని అంటాడు.

ఈ షోలోని టాస్క్ ల్లో గెలిస్తే అషురెడ్డితో హగ్ లు, కిస్ లు ఏమైనా ఇప్పిస్తారా? అని ఎక్స్ ప్రెస్ హరి అడుగుతాడు. అందుకు అషురెడ్డి మండిపోతుంది. ఇలాంటి వాడి వల్లే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి చాలా బయపడుతున్నారని ఫైర్ అవుతుంది. అయితే వీరద్దరూ 4 ఏళ్ల తర్వాత ఇలా కలిసి ఇంటర్వ్యూ రావడం ఆసక్తికరంగా మారింది. ఇక అషు రెడ్డితో హరి నానా రచ్చ చేశాడు. ఆర్జీవీ అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూను కూడా రీ క్రియేట్ చేశాడు. దీంతో కాకమ్మ కథలు సీజన్ 2 ఎపిసోడ్ 9 ప్రోమో ఫుల్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X