మా అక్కను పెళ్లి చేసుకో.. నేను కూడా నీకే.. అడివి శేష్ కు బిగ్ బాస్ బ్యూటీ షాక్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా అశ్విని శ్రీ ఎంతగానో దగ్గరైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత అశ్విని శ్రీకి మరింత క్రేజ్ దక్కింది. దీంతో పలు టీవీ షోల్లో మెరుస్తూ సందడి చేస్తోంది. ప్రేక్షకులను తన దైన శైలిలో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా పాపులర్ డ్యాన్స్ షో ఢీలో మెరిసింది. ఇక తాజాగా ఢీ గ్రాండ్ ఫినాలే సందర్భంగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విన్నర్ ను ప్రకటించేందుకు ఈ షోకు విచ్చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ అశ్విని శ్రీ అడివి శేష్ తో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
ఢీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్..
దశాబ్దానికి పైగా ఢీషో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. ప్రస్తుత ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ జోడీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా పూర్తైంది. ఈ ఫుల్ ఎపిసోడ్ బుధవారం, గురువారం రాత్రి 9:30 నిమిషాలకు ఈటీవీ ఛానెల్ లో ప్రసారం కానుంది. ఈ షోకు టైటిల్ విన్నర్ ను అనౌన్స్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ అడివి శేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈషోకు స్టార్ హీరోయిన్ హన్సిక, గణేశ్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. నందూ యాంకర్ గా ఉన్నారు. మరోవైపు హైపర్ ఆది, బుల్లితెర స్టార్స్ టీమ్ కు సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేకి బిగ్ బాస్ అశ్విని శ్రీ కూడా హాజరైంది.అడివి శేష్ తో ఆసక్తికరంగా మాట్లాడింది.

అడివి శేష్ కే షాక్ ఇచ్చిన అశ్విని శ్రీ..
బిగ్ బాస్ అశ్విని శ్రీ ఢీ జోడీ గ్రాండ్ ఫినాలే సందడి చేసింది. ఇక ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో అడివి శేష్ తో ఆసక్తికరంగా మాట్లాడింది... మీరంటే మా అక్కకి చాలా ఇష్టం. మీరు అక్కను పెళ్లి చేసుకుంటే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది. మా అక్కతో పాటు నేను కూడా వచ్చేస్తానంటూ షాకింగ్ గా మాట్లాడింది. ఆమె మాట్లాలతో అందరూ షాక్ అయ్యారు. ఇక అడివి శేష్ నవ్వుతూ మౌనంగా ఉండిపోయారు. తాజాగా వదిలిని ఢీ జోడీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోలో అశ్విని మాటలు ఆసక్తికరంగా మారాయి.
బిగ్ బాస్ తర్వాత అశ్విని శ్రీ..
అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అశ్విని శ్రీ అలరించింది. ఈ రియాలిటీ గేమ్ షో తర్వాత ఢీ జోడీలో అవకాశం దక్కించుకుంది. హైపర్ ఆదితో కలిసి నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తోంది. తను గతంలో అమీర్ పేట్ లో అనే షార్ట్ పిల్మ్ తో కెరీయర్ ను ప్రారంభించింది. వరంగల్ నిట్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత నువ్వు నేను ఓసేయ్ ఓసేయ్, బీటెక్ బాబులం అనే రెండు చిత్రాల్లోనూ నటించింది. అలాగే సంపూర్ణేష్ బాబు సరసన వినోదం 100 శాతం అనే చిత్రంలో నటించి కాస్తా గుర్తింపు దక్కించుకుంది.
అడివి శేష్ రాబోయే చిత్రాలు..
క్షణం, గుఢాచారి వంటి చిత్రాలతో అడివి శేష్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పంజా, బాహుబలి వంటి చిత్రాల్లోనూ అడివి శేష్ కీలక పాత్రలు పోషించి అదరగొట్టారు. ఇక చివరిగా 'హిట్ 2' చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం డెకాయిట్, గుఢాచారి 2 వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











