అఖిల్ విషయంలో బిగ్ బాస్ తప్పుడు పనులు: నిజమనుకుని బూతులు తిడుతున్నారు.!
తెలుగు బుల్లితెరపై ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసి.. ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుని కొత్త చరిత్రను లిఖించుకుంది బిగ్ బాస్ షో. ఇప్పటి వరకు పూర్తయిన మూడు సీజన్లలోనూ అదే తరహా రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక, ప్రస్తుతం జరుగుతోన్న నాలుగో సీజన్‌కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మరోవైపు, ఈ సారి బిగ్ బాస్ నిర్వహకులు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సార్థక్ విషయంలో షో నిర్వహకులు తప్పుడు పనులు చేశారు. ఫలితంగా ఆ కంటెస్టెంట్‌ను బూతులు తిట్టారు. ఆ వివరాలు మీకోసం.!

వివాదాలమయం.... బిగ్ బాస్ షో
బిగ్ బాస్ అంటేనే వివాదాలతో కూడుకుని ఉన్న షో అనే పేరుంది. ఇప్పటి వరకు ఈ షో ప్రసారం అయిన అన్ని భాషల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ షో పట్ల చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఒకానొక దశలో కాస్టింగ్ కౌచ్ విషయంలో తెలుగు బిగ్ బాస్ షో గురించి ఢిల్లీలో పోరాటం చేయడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిందీ రియాలిటీ షో.

ఈ సారి అలాంటివేమీ లేకుండానే
బిగ్ బాస్ షోలో జరిగే వ్యవహారాలు ఒక వర్గం ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచేశాయి. దీంతో ఈ షో ఎప్పుడు ప్రసారం అయినా దీనిని నిషేదించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించేవి. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి అస్సలు కనిపించలేదు. నాలుగో సీజన్ ప్రారంభానికి ముందు కానీ, మొదలైన తర్వాత కానీ దీనికి వ్యతిరేకంగా ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ విషయంలో మాత్రం విమర్శలు
బిగ్ బాస్ షోను ఆపేయాలని అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమమే జరిగింది. అయితే, ఇప్పుడలాంటివి ఏమీ లేకున్నా.. ఓటింగ్ సిస్టమ్, ఎలిమినేషన్ ప్రాసెస్ సహా పలు అంశాలపై ప్రేక్షకుల్లో అనుమానాలు తలెత్తాయి. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం వల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ షోపై విమర్శల వర్షం కురుస్తోంది.

సరికొత్త ప్లాన్.. టీఆర్పీ కోసమేనా
అప్పుడప్పుడూ చప్పగా సాగినా... ఓవరాల్‌గా మాత్రం మంచి స్పందననే అందుకుంటోంది బిగ్ బాస్ సీజన్ 4. అయినప్పటికీ షోను మరింత రసవత్తరంగా నడిపించేందుకు నిర్వహకులు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వారం మధ్యలోనే అఖిల్‌ను ఇంటి నుంచి బయటకు పంపి సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. దీంతో షో ఆసక్తికరంగా మారింది.

అఖిల్ విషయంలో తప్పుడు పనులు
బలమైన కంటెస్టెంట్‌ను ఎంపిక చేసి ఇంటి నుంచి బయటకు పంపాలని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు.. కంటెస్టెంట్లు అందరూ అఖిల్‌ను ఎలిమినేట్ చేశారు. అయితే, నిర్వహకులు మాత్రం అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచి ఆటను లైవ్‌లో చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్‌నే హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షో యూనిట్ కొన్ని తప్పుడు పనులు చేస్తోంది.
Recommended Video

నిజమనుకుని బూతులు తిడుతున్నారు.!
గత ఎపిసోడ్‌లో అఖిల్.. అభిజీత్ లెటర్‌ను కట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. అలాగే, వీళ్లిద్దరూ తిట్టుకున్నట్లూ ప్రసారం చేశారు. ఇది నిజమనుకున్న కొందరు ప్రేక్షకులు అఖిల్‌ను బండ బూతులు తిడుతున్నారు. వాస్తవానికి అఖిల్ అలా చేయలేదు. కానీ, ప్రోమో అలా కట్ చేయడంతో ప్రేక్షకులు పొరపాటు పడ్డారు. ఈ అంశం వల్ల అఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











