బిగ్ బాస్ నీచమైన ప్లాన్: అభిజీత్ కామెంట్లతో బయటపడిన రహస్యం.. నాగార్జునను వదల్లేదు!

తెలుగు బుల్లితెరపై సరికొత్త కార్యక్రమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేస్తూ చానెళ్లు అన్నీ ఎన్నో ప్రోగ్రామ్‌లను పరిచయం చేస్తున్నారు. ఇలా ప్రసారమైన వాటిలో కొన్ని మాత్రమే ఆడియన్స్ అభిమానాన్ని చూరగొంటున్నాయి. వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. కొత్తగా రూపొందిన షోనే అయినా.. ఇక్కడి వాళ్లకు చేరువైందిది. అందుకే నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అభిజీత్ చేసిన కామెంట్లతో బిగ్ బాస్ కన్నింగ్ ప్లాన్ ఒకటి బయట పడింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

మోనాల్‌కు దూరమై.. హారికకు దగ్గరైన అభి

మోనాల్‌కు దూరమై.. హారికకు దగ్గరైన అభి

నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉండేవాడు అభిజీత్. ఆ తర్వాత ఆమె దూరం అవడంతో కొద్ది రోజులు ఒంటరిగా ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే దేత్తడి హారిక అతడికి క్లోజ్ అయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. వీళ్లతో పాటు నోయల్ సీన్, లాస్య మంజునాథ్ కూడా గ్రూప్‌గా ఏర్పడ్డారు. దీంతో ఈ జంట బాగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరిస్తూ

ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరిస్తూ

రోజులు గడిచిన కొద్దీ బిగ్ బాస్ హౌస్‌లో దేత్తడి హారిక - అభిజీత్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఇద్దరూ హగ్గులు, ముద్దులు, రొమాంటిక్‌గా మాట్లాడడం వంటివి చేయడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అంతేకాదు, ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడుతున్నట్లు అనిపించింది కూడా. దీంతో వీళ్లిద్దరూ లవర్స్ అని ప్రచారం మొదలైంది.

అభిజీత్ హారిక పెళ్లిపై కామెంట్స్ చేసిన తల్లి

అభిజీత్ హారిక పెళ్లిపై కామెంట్స్ చేసిన తల్లి

అభిజీత్ - హారిక బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం సాగిస్తున్నారని అంతా అనుకున్నారు. దీంతో వీళ్లిద్దరి పేర్లను కలిపేసి ‘అభిక' అని క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేశారు ఇరువురి అభిమానులు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. దీంతో హారిక తల్లి దీనిపై స్పందిస్తూ అభి పేరెంట్స్‌కు అభ్యంతరం లేకపోతే తమకూ ఓకే అని చెప్పి షాకిచ్చారు.

దూరం పెరిగింది.. లెటర్ కూడా రాసిన అభి

దూరం పెరిగింది.. లెటర్ కూడా రాసిన అభి

కొద్ది రోజుల క్రితం ఏ టాస్కులో భాగంగా సరిగా ఆడలేదని అభిజీత్‌ను, కెప్టెన్‌గా విఫలమయ్యావని హారికను నాగార్జున విమర్శించాడు. అతడి కోసమే గేమ్ ఆడుతున్నావని ఆమెపై ఫైర్ అయ్యాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో హారికను తనతో టైమ్ స్పెండ్ చేయమని కోరుతూ ఓ లెటర్ కూడా రాశాడు అభిజీత్. ఇది బాగా హైలైట్ అయింది.

హారికతో రిలేషన్‌పై అభి సెన్సేషనల్ కామెంట్స్

హారికతో రిలేషన్‌పై అభి సెన్సేషనల్ కామెంట్స్

తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను, కేరింగ్‌ను చూపించుకుంటూ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బాగా పాపులర్ అయ్యారు అభిజీత్, దేత్తడి హారిక. అంతేకాదు, షో తర్వాత వీళ్లిద్దరూ ఓ టూర్ కూడా వెళ్తున్నట్లు గతంలోనే చెప్పారు. దీంత వీళ్లిద్దరి ట్రాక్ కొనసాగుతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ‘హారిక నాకు చెల్లి లాంటిది' అని అభిజీత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బయటపడిన బిగ్ బాస్ ప్లాన్.. నాగార్జునపైనా

బయటపడిన బిగ్ బాస్ ప్లాన్.. నాగార్జునపైనా

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హారికతో రిలేషన్ గురించి అభిజీత్ మాట్లాడుతూ ‘హారిక నా సిస్టర్ లాంటిదని చాలా సార్లు అన్నాను. కానీ, అది షోలో చూపించలేదు. అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. బయటకు వచ్చాక ఇది తెలిసి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి' అని అన్నాడు. దీంతో బిగ్ బాస్ నీచమైన ప్లాన్ బయట పడడంతో నిర్వహకులతో పాటు నాగ్‌పైనా విమర్శలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X