వైట్ టాప్‌లో కొత్త తెలుగు యాంకర్ హొయలు.. తన్మయత్వం చెందేలా చేస్తున్న ఈమెను గుర్తించారా?
తెలుగు బుల్లితెరపై అనేక మంది యాంకర్లు, నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ యాంకర్లుగా వచ్చిన వాళ్లను మాత్రం చాలా మంది అస్సలే మర్చిపోరు. ఎందుకంటే తెలుగు యాంకర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అలా వేళ్ల మీద లెక్కపెట్టే వాళ్లలో.. అనసూయ, రష్మి, సుమ, శ్రీముఖి, ఒకప్పుడు ఝాన్సి, శ్యామలలు కూడా. ఇలా అదిరిపోయే షోలు చేస్తూ విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న వీళ్లకు పోటీగా మరో క్యూట్ బ్యూటీ యాంకర్ అవతారం ఎత్తింది. యూట్యూబర్ స్థాయి నుంచి యాంకర్ గా మారిన ఆ ముద్దుగుమ్మ ఎవరు, ఎక్కడ గ్లామర్ షో చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షోలో అనసూయ, రష్మిలు చేసి వెళ్లిపోయారు. వారి తర్వాత బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబర్ స్థాయి నుంచి యాంకర్ గా మారిన ఈమె గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా కెరియర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ లో వీడియోలు చేసేది సిరి హన్మంత్. యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అనేక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మెప్పించింది. మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి డ్యాన్స్ వీడియోలు కూడా చేసేది.

ఇలా వచ్చిన క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకు వెళ్లింది. అక్కడ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చాలా క్లోజ్ గా ఉంటూ విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకుంది. కానీ బయటకు వచ్చాకా శ్రీహాన్ తో దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం అతడితో కలిసి ఉంటున్న ఈ క్యూట్ బ్యూటీ.. ఫోకస్ మొత్తం కెరియర్ పైనే పెట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే కామెడీ షో.. జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తోంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో పాటు జవాన్ సినిమాలోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ.
ఇలా కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా సరికొత్త స్టైల్ దుస్తులు ధరిస్తూ స్టన్నింగ్ షో చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ టాప్ వేసుకుంది. హెయిర్ లీవ్ చేసి తక్కువ మేకప్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా లెస్ మేకప్... హెవీ మీ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. విపరీతంగా సిగ్గుపడిపోతూ కనిపించింది. ఫుల్ బ్లష్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అచ్చం ఆకాశంలో ఉండే చందమామలాగే కనిపిస్తున్నావని.. కానీ నేలపైకి మాకోసమే నడిచి వచ్చినట్లు అనిపిస్తుందని తెలిపుతున్నారు. సిరి హన్మంత్ సరికొత్త ఫొటోలపై అందరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. తమ మనసులోని భావాలను కవితలుగా, కామెంట్లుగా రాస్తూ తెగ సంబురపడిపోతున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. పుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











