Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ప్రేమలో అషురెడ్డి.. ఇండైరెక్ట్‌గా రివీల్.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్!
సుడిగాలి సుధీర్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన ప్రస్తుతం హీరోగా మారాడు. సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే గతంలో రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ... విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రేమలో తాజాగా మరో అమ్మాయి పడిపోయింది. ముఖ్యంగా బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సుధీర్ తో ప్రేమలో ఉన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు 10 సంవత్సరాలకు పైగా యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ కనిపించిన సుధీర్.. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఈయన.. ఈ మధ్య అనేక టీవీ షోలు కూడా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్స్, సర్కార్ అనే షోలను హోస్ట్ చేస్తూ.. మళ్లీ బుల్లితెరపై తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే రష్మితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోగా.. ఇప్పుడు మాత్రం సింగిల్ గానే టీవీ షోలు చేస్తోంది. అయితే తాజాగా ఆయన ప్రేమలో ఓ క్యూట్ బ్యూటీ పడినట్లు తెలుస్తోంది.

తాజాగా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్స్ షో ప్రోమోలో సుడిగాలి సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది. అదిరిపోయే పాటకు స్టెప్పులు వేస్తూ చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. చాలా చిన్న గ్యాప్ ఇచ్చానురా మచ్చా.. ఇప్పుడు చూస్తావుగా మనం చేసే రచ్చ అంటూ డైలాగ్ కొట్టాడు. ఇక ఆ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ 3డీలో కనిపిస్తుందంటూ చెప్పగా.. ఆషోకు వచ్చిన గెస్టులు, కంటెస్టెంట్లను చూపిస్తారు. ఇలా ఈ ప్రోమో అదిరిపోగా.. ఆ తర్వాత అషురెడ్డి వస్తుంది. అలాగే యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా ఆమె పక్కనే ఉంటుంది. వీరితో పాటు మరో అమ్మాయి కూడా స్టేజీ మీద ఉండగా.. అషురెడ్డి షాకింగ్ కామెంట్లు చేసింది.
ముఖ్యంగా ఇండైరెక్టుగా సుధీర్ పై ఉన్న ప్రేమను వెల్లడించింది. సుధీర్ ను బావా అని పిలిచేసింది. స్టేజీపై అందరి ముందే సుధీర్ బావా అంటూ ఏదో చెప్పింది. ముఖ్యంగా మీ ఇద్దరూ సుధీర్ బావ జోలికి రావొద్దంటూ యాంకర్ స్రవంతి చొక్కారపుతో పాటు మరో అమ్మాయికి చెప్పింది. అయితే ఇదంతా విన్న స్రవంతి చొక్కారపు... ఏంటీ మీ బావలో అంత మ్యాటర్ ఉందా అని అడగ్గా.. అంతా ఒకటే నవ్వడం.

ముఖ్యంగా యాంకర్ స్రవంతి చొక్కారపు చేసిన ఈ కామెంట్లు విన్న సుధీర్ కూడా చాలా సేపు నవ్వుతూనే ఉన్నాడు. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ప్రోమో చివర్లో.. అంతా ఎమోషనల్ అయ్యారు. తమ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఈషోకు వచ్చిన ప్రతీ ఒక్కరూ వివరించారు. అవన్నీ తెలియాలంటే ఈ పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











