ఈ బాధను భరించలేకోపోతున్నా.. గుండె పగిలేలా ఏడ్చిన బిగ్‌బాస్ బ్యూటీ..

వెండితెరపై మెరిసినా, బుల్లితెరపై సందడి చేసినా తనదైన ముద్ర వేసుకున్న నటి అశ్విని శ్రీ (Ashwini Sri). వెండితెరపై చిన్నచిన్న పాత్రలతో మెరిసిన ఆమె, బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే అశ్విని శ్రీ ఇంట తాజాగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే?

అశ్విని శ్రీ.. తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన పెంపుడు కుక్క 'సోనూ' మరణించడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేయడంతో అభిమానులు సైతం కంటతడి పెడుతున్నారు. సోనూతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. "నేను నా సోనూ బాయ్‌ని కోల్పోయాను.. ఈ బాధను భరించలేకపోతున్నా" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వారికి ఈ బాధ ఎంత తీవ్రమైందో అశ్విని మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Bigg Boss Beauty Ashwini Sri in Tears After Pet Dog Sonu Dies Emotional Post Viral

అశ్విని శ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సోనూ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నాడట. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని చెప్పింది. ఇదే విషయాన్ని ఆమె పెట్ లవర్స్‌కు హెచ్చరికగా వెల్లడించింది. 'మీకు కుక్కలు ఉంటే దయచేసి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. అవి తమకు ఏం సమస్య ఉందో మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగా కనిపించినా లోపల తీవ్రమైన అనారోగ్యం ఉండొచ్చు. ముందస్తు పరీక్షలే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చింది. "నా సోనూను కాపాడుకోవడానికి నాకు ఇంకో అవకాశం దొరికితే ఏమైనా చేసేదాన్ని" అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఇక అశ్విని శ్రీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. వినోదం 100% అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'అమీర్‌పేటలో' (2017), 'బి.టెక్ బాబులు' (2018), 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్' వంటి సినిమాల్లో నటించింది. అలాగే రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్'లో స్పెషల్ సాంగ్‌తో పాటు, పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసి మెప్పించారు.

అయితే అశ్విని శ్రీ కెరీర్‌కు నిజమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu Season 7). వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వెళ్లిన అశ్విని, తన అందం, నిజాయితీ గల ఆటతీరు, స్పష్టమైన మాటలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. షో ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగింది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్, బ్రాండ్ కొలాబరేషన్లతో బిజీగా కొనసాగుతోంది. ప్రస్తుతం అశ్విని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు 'ధైర్యంగా ఉండండి', 'సోనూ ఎప్పటికీ మీ జ్ఞాపకాలలో ఉంటుంది', 'త్వరగా కోలుకోండి' అంటూ ఓదార్పు సందేశాలు పంపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X