Bigg Boss Telugu: బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్... అసలు ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ బ్యూటీ, సోషల్ మీడియా ఫేమ్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా మంచి క్రేజ్ సంపాదించుకొని... బిగ్ బాస్ రియాల్టీ షోలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎంతో పాపులర్ అయిపోయింది. అయితే ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయనకి ప్రమాదం జరిగిందంటూ యూట్యూబ్ లో తెగ ప్రచారం జరిగింది. దీనిపై ఆ బ్యూటీ తాజాగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

సోషల్ మీడియా ఫేమ్ దీప్తి సునయన యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులర్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక క్రేజ్ సొంతం చేసుకుంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా... వెబ్ సిరీస్ ల్లో, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన కాలంలో... అప్పుడు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించి తెగ పాపులర్ అయిన వారిలో దీప్తి సునయన ఒకరు.

Bigg Boss

ఇక అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునయనకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆ సీజన్లో ఆటలు, పాటలు దాంతో పాటు గొడవ పడుతూనే... గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టింది ఈ భామ. నచ్చావులే ఫేమ్ తనీష్ తో చనువుగా ఉంటూ... ఆ షోలో హాట్ టాపిక్ గా మారింది. వీరు లవ్ బర్డ్స్ లా షోలో మెలిగేవారు.

ఇక వరుసగా ఆఫర్లు దక్కించుకున్న దీప్తి సునయన... యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. షణ్ముఖ్ జశ్వంత్ కూడా దీప్తి సునయనతో ప్రేమాయణం సాగించారు. అలా కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో షణ్ముఖ్ కు అవకాశం వచ్చింది. ఇక అప్పుడు సిరితో షణ్ముఖ్.. ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చనువుగా ఉన్నారు.

Bigg Boss

ఇక బిగ్ బాస్ ఐదో సీజన్ ముగిశాక షణ్ముఖ్ కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఆ విషయం పక్కన పెడితే దీప్తి సునయనకు ప్రమాదం జరిగిందంటూ ఇటీవల వరుస కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. యూట్యూబ్ వేదికగా తన గురించి కొంత మంది న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఈ వార్తలపై దీప్తి సునయన స్పందించారు.

తనకు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెల్చి చెప్పింది దీప్తి. తాను క్షేమంగానే ఉన్నానని కొన్నాళ్ల క్రితం అలియా ఖాన్‌ అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసినట్లు చెప్పుకువచ్చింది. అందులోనే క్లిప్స్ ఆధారంగా చేసుకుని ఇలాంటి అసత్య వార్తలు సృష్టించిరాని మండిపడింది. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

Bigg Boss

ఇక దీప్తికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఆమె తరచూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ దీప్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X