Deepthi Sunaina: లాంగ్ ఫ్రాక్‌తో కుర్రాళ్ల మనసు లాగేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఎంతందంగా ఉందో?

యూట్యూబర్, బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాధించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మరింత బిజీ అయింది. అంతేనా సోషల్ మీడియా వేదికగా రచ్చ కూడా స్టార్ట్ చేసింది. ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల మనసు దోచే ఈ ముద్దుగుమ్మ తాజాగా లాంగ్ ఫ్రాక్ లో కనిపించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టిక్ టిక్ లో వీడియోలు చేస్తూ.. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్మ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునైనా. తన ప్రియుడు షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి డ్యాన్స్ వీడియోలు చేసే ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2కు సెలెక్ట్ అయింది. అక్కడే హీరో తనీష్ తో చాలా క్లోజ్ గా ఉంటూ రచ్చ చేసింది. అదంతా బయటే ఉండి చూసిన ఆమె ప్రియుడు చాలా ఫీల్ అవుతూ వీడియోలు పోస్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె అతడికి నచ్చజెప్పుకుంది.ఆ తర్వాత నుంచి వీరిద్దరి ప్రేమ కంటిన్యూ అవుతూనే వచ్చింది.

Bigg Boss Beauty Deepthi Sunaina Stunning Look Photos Goes Viral

బయటకు వచ్చాక కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ వీడియోలు చేసిన ఈమె షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాకా బ్రేకప్ చెప్పేసింది. ముఖ్యంగా ఆయన సిరి హన్మంత్ తో క్లోజ్ గా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయిన ఆమె అతడితో కలిసి ఉండలేనని తేల్చేసింది. ఆ తర్వాత నుంచి ఎవరి జీవితాల్లో వారు ముందుకు వెళ్తున్నారు. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న దీప్తి సునైనా ఫోకస్ మొత్తం కెరియర్ పైనే పెట్టింది. ఓవైపు డ్యాన్స్ వీడియోలు, మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఓ ఇళ్లు, కారు కూడా కొనేసింది. లైప్ లో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Bigg Boss Beauty Deepthi Sunaina Stunning Look Photos Goes Viral

ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పూర్తి అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాంక్ వేసుకుని సోకులు ఆరబోసింది. సింపుల్ గా రెడీ అయినా.. చాలా అందంగా కనిపిస్తున్న ఈమె అంతకు మించిన ఫొజోలు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Bigg Boss Beauty Deepthi Sunaina Stunning Look Photos Goes Viral

దీప్తి సునైనా షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తున్న నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. చీకట్లో చందమామలా కనిపిస్తున్నావని కొందరు, ఆ చందమామకు అయినా మచ్చ ఉంటుంది కానీ నీ అందాల ఎలాంటి మచ్చ లేదంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఈ ముద్దుగుమ్మ మెస్మరైజింగ్ షోపై ఓ లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X