చీర కట్టుకొని మరీ ప్రియుడి కోసం రోడ్ల వెంట తిరుగుతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
బిగ్ బాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని సొంతం చేసుకుని, విపరీతమైన క్రేజ్ దక్కించుకుందీ క్యూట్ బ్యూటీ దివి వాద్త్యా. బిగ్ బాస్ షోలోకి రావడం కంటే ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసింది. అందంతో పాటు అభినయం ఉన్నా పెద్దగా అవకాశాలు కూడా రాబట్టుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ కు వచ్చిన వెళ్లిన తర్వాత నుంచి ఈ అమ్మడుకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే అడపా దడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ అందరినీ తెగ అలరిస్తోంది. ఓవైపు సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్స్, వీడియో సాంగ్స్ చేస్తుంది.

ఇంత బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తుంది. సన్నజాజి లాంటి ఫిగర్ తో.. యూత్ హృదయాలను కొల్లగొడుతుంటుందీ పొడుగు కాళ్ల సుందరి. అంతేనా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంటుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో నారాయణ పేట లంగావోణీ కట్టుకొని అందాలు ఆరబోసింది. అద్భుతమైన ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది. నడుము అందాలతో పాటు ఒంపుసొంపులన్నీ కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. ఇన్ స్టా వేదికగా ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ఈ చీర కట్టడానికి గల కరాణాన్ని కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా "చీర కట్టుకొని రోడ్లు గల్లీలు వెతికేస్తుంటే... ఎక్కడున్నావ్ రా బాబు" అంటూ రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ తనకు కాబోయే వాడి కోసమే ప్రియుడి కోసమే వెతుకుతున్నట్లు అర్థం అవుతుంది.

దివి వాద్త్యా చేసిన ఈ పోస్ట్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే దొరికేస్తాడు లే, నీ అందాలు చూసి అతనే వస్తాడులే అంటూ మరికొంత మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. పద్ధతైన డ్రెస్ లో పరువాలు ఆరబోసిన ఈ పొడుగు కాళ్ల సుందరి అందాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం..!


Click it and Unblock the Notifications











