Divi Vadthya: భువి నుంచి దిగి వచ్చిన ఈ బిగ్‌బాస్ బ్యూటీ.. అందాలతోనే అందరినీ ఆగం చేస్తోందిగా!

భువి నుంచి దిగి వచ్చావా బిగ్ బాస్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ..! అదేంటీ ఆ పాట కాస్త తేడాగా ఉంది అనిపిస్తోందా... కాస్త తేడాగా ఉన్న మాట వాస్తవమే అయినా దివి వాద్త్యా ఫొటోలను చూస్తే ఇలాగే పాట పాడాలనిపిస్తుంది మరి. బిగ్ బాస్ తో పాపులారిటీని సంపాదించిన ఈ ముద్దుగుమ్మ రోజురోజుకూ తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో తన అందమైన ఫొటోలను పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. తాజాగా ఆమె వేసుకున్న ఓ టాప్.. అందులో ఆమె అందాలు చూస్తే మాత్రం కచ్చితంగా హీటెక్కిపోతారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పొడుగుల కాళ్ల సుందరి అయిన దివి వాద్త్యాకు సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ గుర్తింపు పొందింది. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, క్యారెక్టర్ తో తెలుగు సినీ ప్రియులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే దివికి ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తనకు మంచి ఆఫర్ వస్తే, తనకు సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిందీ క్యూట్ బ్యూటీ.

Bigg Boss Beauty Divi Vadthya Beautiful Look Photos Goes Viral

ఓవైపు సినిమాలు, పలు షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో జీన్స్ వేసుకున్న ఈమె.. పైన మాత్రం బ్రా లాంటి ఓ టాప్ వేసుకుంది. అందులో ఈమె అందాలు అదుర్స్ అనిపిస్తుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు.

Bigg Boss Beauty Divi Vadthya Beautiful Look Photos Goes Viral

చాలా అందంగా ఉన్నావు దివి.. దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగే కనిపిస్తున్నావంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లైకులు, షేర్లు చేస్తూ దివి ఫొటోలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోల్లో దివి చాలా అందంగా కనిపిస్తోంది. నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామని కొందరు.. నీ అందాల విందుకు అల్లాడిపోతున్నామంటూ మరికొందరు వివరిస్తున్నారు.

అసలే సమ్మర్ తో చెమటలు కక్కుతూ.. ఆగం అవుతుంటే నీ అందాల ఆరబోతతో మాకు మరింత హీటెక్కిస్తున్నావేంటి పాపా అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఆమె సరికొత్త లుక్ ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X