Divi Vadthya: ఇన్నాళ్లకు దివి బ్రేకప్ స్టోరీ రివీల్.. అతడి మరణం వల్లే అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ!

బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో నటిస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలా వచ్చిన గుర్తింపుతోనే ఆమె బిగ్ బాస్ కు వెళ్లి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే బిగ్ బాస్ లో ఉండగా.. తనకు గతంలో ప్రేమాయణం ఉందని బ్రేకప్ అయిపోయిందని చెప్పింది. కానీ కారణాలు మాత్రం వివరించలేదు. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బ్రేకప్ స్టోరీ గురించి పూర్తి వివరాలు చెప్పింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పొడుగుల కాళ్ల సుందరి అయిన దివి వాద్త్యాకు అతి తక్కువ కాలంలోనే విపరీతమైన గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే దివికి ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తనకు మంచి ఆఫర్ వస్తే, తనకు సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిందీ క్యూట్ బ్యూటీ.

Bigg Boss Beauty Divi Vadthya Reveal Her Break Up Story Check Details

ప్రస్తుతం దివి కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఆ మధ్య 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దివి పర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మను జోర్దార్ సుజాత ఇంటర్వ్యూ చేసింది. ఈక్రమంలోనే తన లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాల గురించి ప్రశ్నలు అడిగింది. ముఖ్యంగా కెరియర్ ఎలా స్టార్ అయింది.. ఎలా నడుస్తోందని తెలుసుకుంది.

Bigg Boss Beauty Divi Vadthya Reveal Her Break Up Story Check Details

ఆ తర్వాత తన ప్రేమాయణం, బ్రేకప్ స్టోరీ గురించి చెప్పమనగా.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందీ క్యూట్ బ్యూటీ. అయితే తాను బీటెక్, ఎంటెక్ చేస్తుండగా.. ఓ అబ్బాయిని ప్రేమించిందట. ఆ ఆరేళ్లు వారిద్దరూ చాలా సంతోషంగా గడిపారట. తన లైఫ్ మొత్తం అతడికి తెలుసట. అయితే దివికి పెళ్లి చేయాలని తన కుటుంబ సభ్యులు అనుకోగానే.. అతడు వచ్చి వీళ్ల ఇంట్లో మాట్లాడడట. దివిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వారిని ఒప్పించాడట కూడా. అయితే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకునే సరికి ఆ అబ్బాయి వాళ్ల సోదరుడు చనిపోయాడట.

Bigg Boss Beauty Divi Vadthya Reveal Her Break Up Story Check Details

దీంతో వీళ్ల పెళ్లికి చాలా కాలం పాటు బ్రేక్ వచ్చిందట. ఇక తమ్ముడి చనిపోవడంతో ఇంటి బాధ్యత తన మీద పడడం.. ముఖ్యంగా తల్లిదండ్రులను వదిలి వచ్చి హైదరాబాద్ లో ఉండలేక ఊళ్లోనే ఉండిపోయాడట. దివి అక్కడకు వచ్చి ఉండలేదని.. ఆమెకు కెరియర్ ఉందని భావించిన అతడు బ్రేకప్ చెప్పేశాడట. కానీ ఆ సమయంలో అతను తనను అడిగి ఉంటే తాను అతడి కోసం అన్నీ వదిలేసి కచ్చితంగా ఊరెళ్లిపోయేదాన్ని అని దివి వివరించింది. అలాగే ఇప్పటికీ తాను అతడిని ప్రేమిస్తున్నానని.. కానీ అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X