Geetu Royal: డిప్రెషన్‌లోకి గీతూ రాయల్.. 5 నెలలుగా నరకం.. అసలేం జరిగిందంటే?

గలాటా గీతూ, గీతూ రాయల్.. బిగ్ బాస్ బిగ్ ఫైర్ బ్రాండ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం.. అంతకు మించిన మాటలు... అసలైన చిత్తూరు యాసతో అదరగొట్టే ఈ అమ్మాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ గా వెళ్లింది. అద్భుతమైన ఆట తీరు కనబర్చి అనేక మంది అభిమానులను సంపాధించుకుంది. బిగ్ బాస్ రీవ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ.. సెలబ్రిటీగా మారిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. గత 5 నెలలుగా ఓ అనారోగ్య సమస్యతో బాధ పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ రీవ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు కూడా వెళ్లింది. అలాగే జబర్దస్త్ వంటి షోలతో పాటు అనేక షోలలో కనిపించి తెగ సందడి చేసింది. అంతేకాదండోయ్ బిగ్ బాస్ తెలుగు 7 బిగ్ బాస్ బజ్ షోకు యాంకర్ గా కూడా చేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ముక్కుసూటిగా ప్రశ్నలు అడుగుతూ.. వారందరినీ ఓ ఆట ఆడుకుందీ క్యూట్ బ్యూటీ. ముందు ఉన్నది ఎవరు అనేది చూడకుండా తాను అడగాలనుకున్నవన్నీ అడిగేసి అందరినీ అదరగొట్టి, బెదరగొట్టింది. ఆ తర్వాత కూడా అనేక షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం యాంకర్ ధనుష్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన.. పలు విషయాలపై మాట్లాడుతోంది.

Bigg Boss Beauty Geetu Royal Went into Depression And Hospitalized Check Details

అయితే చాలా రోజుల క్రితం ఈ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేయగా.. ఈ మధ్య అసలు కనిపించట్లేదు. అయితే తాజాగా ధనుష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో గీతూ రాయల్ ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పాడు. ముఖ్యంగా ఆమె ప్రస్తుతం డిప్రెషన్ లో ఉందని చెప్పాడు. అలాగే ఐదారు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ఈమె ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని వివరించాడు. అంతేకాకుండా నేరుగా ఆమె వద్దకు వెళ్లి వీడియోను తీసి పోస్ట్ చేశాడు.

ఈక్రమంలోనే గీతా రాయల్ మాట్లాడుతూ.. తాను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నట్లు చెప్పింది. బొద్దింకలు, పిట్టలు వంటి అనేక రకాల ఆహార పదార్థాలను ట్రై చేసినట్లు వివరించింది. ముఖ్యంగా చనిపోయేలోపు అన్ని చూడాలి, ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా తిన్నానని.. దాని వల్లే తనకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా తాను విజయవాడకు అమ్మవారి దర్శనం కోసం అక్కడకు వెళ్లి.. దర్శించుకోలేదని, అలాగే తిరుచానూరుకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేసినట్లు వివరించింది.

కేవలం తన వల్లే తనతో వచ్చిన వాళ్లు కూడా అమ్మావార్లను దర్శించుకోలేకపోయారని.. అందువల్ల కూడా తనకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చాయోమో అని అనుమానం వ్యక్తం చేసింది. కోటి మందిలో ఒకరికి వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు వచ్చిందని చిన్నచిన్న ఆస్పత్రలు చుట్టూ తిరిగితే దాని గురించి తెలియదని.. ఇంత కాలంగా ఆ సమస్యతో ఇబ్బంది పడగా.. తాజాగా ఓ పెద్దాసుపత్రికి రాగా ఆ ఇన్ఫెక్షన్ బయట పడిందని చెప్పుకొచ్చింది. అలాగే దానికి రెండేళ్ల పాటు కంటిన్యూస్ గా ట్రీట్ మెంట్ తీస్కోవాలని.. ప్రతీ వారం ఇంజెక్షన్ వేయించుకోవాలని వివరించింది. ఈ సమస్య వల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు.. అనేక ఇబ్బందులు పుడుతున్నట్లు వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X