Bigg Boss Telugu: శ్రీలీలలా చేసుంటే స్టార్ హీరోయిన్ అయిపోయేదాన్ని... బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయి.. ఆకట్టుకుంది. అయితే ఈ భామ బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్ వల్ల సినిమా అవకాశాలు దక్కించుకోవాలి అనుకుంది. కానీ ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. అయితే ఈ క్రమంలో ఈ బ్యూటీ తాజాగా శ్రీలీల, కృతి శెట్టిలా చేసుంటే.. అవకాశాలు వచ్చేవంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఇనయా సుల్తానా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ భామ మొదట రామ్ గోపాల్ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించి.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఒక్క వీడియో వల్ల ఆమెకు బిగ్ బాస్ సీజన్ 6లో ఛాన్స్ వచ్చిందని టాక్. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తో బయటకు వచ్చాకా ఆమెకు అవకాశాలు వరుస కడతాయని ఆశించింది. కానీ ఫలితం దక్కలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇనయా సుల్తానా షాకింగ్ కామెంట్స్ చేసింది.

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్ లోనే అడుగుపెడుతున్నారు. ఇక ఆ క్రమంలోనే స్టార్ హీరోయిన్లుగా క్రేజ్ కొట్టేస్తున్నారు. 16, 17 ఏళ్ల వయసులోనే వారు స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. కృతిశెట్టి, శ్రీలీల వంటి వారు కూడా ఆ వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ నేను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాను. వాళ్లతో పోల్చుకుంటే... నేను 7 ఏళ్లు వృథా చేసుకున్నా... వాళ్లలాగా చేసి ఉంటే... ఇండస్ట్రీలో నా లైఫ్ మరోలా ఉండేది.. అంటూ... చెప్పుకు వచ్చింది ఈ భామ.
ఇనయా మాట్లాడుతూ... ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి బతకడం కష్టం.. ఎప్పుడు పోతామా తెలియదు.. నా వయసు ఇప్పుడు 25 ఏళ్లు.. దేవుడు దయవల్ల మహా అయితే ఇంకో పాతికేళ్లు బతుకుతా.. అంటూ సిద్దాంతం చెప్పుకువచ్చింది. ఈ జీవితంలో తాను ఎంజాయ్ చేసేది మాగ్జిమమ్ 10 నుంచి15 ఏళ్లు మాత్రమే అంటూ వెల్లడించింది. ఆ తర్వాత ఎంజాయ్ చేద్దామని ఉన్నా మనకు శరీరం సహాకరించదని తెలిపింది. కాబట్టి ఇప్పుడున్న సమయాన్ని ఆనందంగా గడుపుతున్నా అంటూ వెల్లడించింది.

షోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే ఫోటోలు శాంపిల్స్ మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది. ఇంకా నా దగ్గర మస్త్ షేడ్స్ ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేసింది. అవన్నీ పోస్ట్ చేస్తే ఏమైపోతారో... అంటూ చివరగా హాట్ కామెంట్స్ చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాకా... అవకాశాల గురించి చాలా ఆఫీసులు తిరిగాను కానీ.. ఏ ఒక్క ఆఫర్ లభించలేదని తెలిపింది.
అలాంటి సమయంలో కూడా తాను ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లలేదని చెప్పుకువచ్చింది. . సినిమాల్లో స్థిరపడాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అడుక్కున్నట్లుగానే అవకాశాల కోసం అడుక్కున్నప్పటికి ఫలితం లేకుండా దక్కలేదని బాధపడింది. ప్రస్తుతం ఇనయా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ ఏంటి ఇంత తెగించి మాట్లాడింది అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











