Priyanka Jain: ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఓ రేంజ్‌లో వయ్యారాలు ఒలకబోసిన పొట్టిపిల్ల.. ఎంతందమో?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మౌన రాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు 7 షోకు కూడా వెళ్లింది. అక్కడే తన అద్భుతమైన ఆట తీరుతో.. అందరినీ మెప్పించింది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలిసి గేమ్ ఆడుతూ వచ్చిన ఈమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ టాప్ 5లో నిలిచి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అక్కడే తన ప్రియుడితో ప్రేమ గురించి, లివింగ్ రిలేషన్ గురించి వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది.

Bigg Boss Beauty Priyanka Jain Beautiful Looking Photos Goes Viral

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి కేవలం యూట్యూబ్ పై మాత్రమే ఫోకస్ పెట్టిందీ ముద్దుగుమ్మ. తన ప్రియుడితో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. వాటిని వీడియోలుగా తీసుకుని నెట్టింట పెడుతోంది. అలా లక్షలకు లక్షలు సంపాదిస్తూ.. ఇటీవలే ఇంటి కోసం స్థలం కొనుగోలు చేసింది. అతి త్వరలోనే ఇళ్లు కట్టుకని, పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రియాంక జైన్ అయితే తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తన క్రేజీ క్రేజీ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.

అందులో ఆరెంజ్ కలర్ లాంగ్ ఫ్రాంక్ వేసుకుని సోకులు ఆరబోసింది. ఓ వైపు ఫుల్ హ్యాండ్ ఉన్న ఈ డ్రెస్ కు మరోవైపు స్లీవ్ లెస్ హ్యాండ్ ఉంది. ఇలా స్టైలిష్ డ్రెస్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుందీ పొట్టిపిల్ల. అంతేకాకుండా పొడవాటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. అదిరిపోయే ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అచ్చం బార్బీ డాల్ లాగానే కనిపిస్తున్నావంటూ చెప్పుకొస్తున్నారు.

పొట్టిపిల్లవే అయినా అందంలో నిన్ను మించిన వాళ్లు అస్సలే లేరంటూ పలువురు అభిమానులు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫొటోలకు.. ఆమె ప్రియుడు శివ్ కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. నిన్ను చూస్తుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయ్ బేబీ అంటూ వివరించారు. అలాగే మరికొందరు ఈ కత్తిలాంటి ఫిగర్ ని సినిమాల్లోకి తీసుకోవచ్చుగా.. అందాలతో మతి పోగొట్టేస్తుంది బాబోయ్ అంటూ వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ బ్యూటీ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X