నా బట్టలు నా ఇష్టం.. ఏం వేసుకోవాలో తెలుసు.. ప్రియాంక జైన్ ఆగ్రహం!

గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి నటికి సోషల్ మీడియా ఒక వరమైతే... అదే సమయంలో శాపంగా మారే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ముఖ్యంగా మహిళా నటీమణుల విషయంలో ఈ ట్రోలింగ్ మరింత తీవ్రంగా కనిపిస్తోంది. అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వారిలో ఒకరు టాలీవుడ్ సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్. తాజాగా ఆమె ఓ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ప్రియాంక జైన్ కొత్త పేరు కాదు. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కన్నడ బ్యూటీ, బిగ్‌బాస్ తెలుగు సీజన్-7లో పాల్గొని మరింత పాపులర్ అయింది. విజేతగా నిలవకపోయినా, తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఆమె కెరీర్‌లో కొత్త మార్పులు వచ్చాయి. సీరియల్స్‌తో పాటు టీవీ షోలు, ఈవెంట్స్, ఓటీటీ ప్రోగ్రామ్‌లలో కనిపిస్తూ మరింత బిజీ అయింది.

Bigg Boss Beauty Priyanka Jain Fires on Trolls My Dress My Choice Statement

ఈ క్రమంలోనే ఆహా ఓటీటీలో ప్రసారమైన 'డ్యాన్స్ ఐకాన్ 2' షోలో పాల్గొంది. ఈ షోలో ఆమె గ్లామరస్ అవతారంలో కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రియాంక వేసుకున్న మెరుపులాంటి జిగేల్ డ్రెస్ అభిమానులను ఆకట్టుకున్నా, కొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఇది ప్రియాంకేనా?', 'సీరియల్ హీరోయిన్‌కీ ఇంత గ్లామర్ అవసరమా?', 'ఇలా ఎందుకు మారిపోయింది?' వంటి కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు మరింతగా వ్యక్తిగతంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేశారు.

ఈ నేపథ్యంలో జబర్దస్త్ వర్ష హోస్ట్ చేసిన 'కిస్సిక్ టాక్' షోలో ప్రియాంక ఈ విషయంపై స్పందించింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. 'నిజంగా చెప్పాలంటే... ఆ ట్రోల్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఏంటి.. ప్రపంచం మొత్తం ఆగిపోయిందా అన్నట్టుగా నాపై కామెంట్లు చేశారు. ఒక్కసారిగా అంతమంది ఇలా రియాక్ట్ అవుతారని నేను ఊహించలేదు' అంటూ ఎమోషనల్ అయ్యారు.

తన వృత్తి గురించి మాట్లాడుతూ..'నేను ఒక యాక్టర్‌ను. నేను నటించే పాత్రలో ఉన్నంతసేపు మాత్రమే ఆ లుక్‌లో ఉంటాను. కానీ నా పర్సనల్ లైఫ్‌లో కూడా అదేలా ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? నాకు కూడా ఫ్రీడమ్ ఉంది కదా. నాకు నచ్చినట్టు డ్రెస్‌ వేసుకోవడంలో తప్పేముంది?' అంటూ ప్రశ్నించింది. ఇంకా ఆమె మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. 'కొంతమంది చాలా హద్దులు దాటారు. సెన్స్ లేదా? మ్యానేర్స్ లేదా? అంటూ దారుణంగా కామెంట్లు చేశారు. కొన్ని కామెంట్లు చదివిన తర్వాత... నాపై నాకే అసహ్యం వేసింది. ఎందుకిలా చేస్తున్నారు? నేను ఏం తప్పు చేశాను? అనిపించింది' అంటూ భావోద్వేగానికి గురైంది.

ఈ సమయంలో తనకు అండగా నిలిచింది తన ప్రియుడు శివకుమార్ అని ప్రియాంక తెలిపింది. 'నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి శివ్. 'వాటిని ఎందుకు చదువుతున్నావ్? ఎందుకు పట్టించుకుంటున్నావ్? వదిలేయ్' అంటూ నన్ను ఓదార్చాడు. ఆ సమయంలో అతని సపోర్ట్ నాకు చాలా అవసరం అయ్యింది,' అని చెప్పింది. డ్రెస్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆమె ఘాటుగా స్పందించింది. 'డ్యాన్స్ ఐకాన్ 2లో నేను వేసుకున్న డ్రెస్‌లో అతిగా ఏమీ చూపించలేదు. ఎక్కడ ఎలా డ్రెస్‌ వేసుకోవాలో నాకు తెలుసు. ఇది నా ప్రొఫైల్‌, నా స్టైల్‌. ఇతరులు దానిలో జోక్యం చేసుకోవడం సరికాదు' అని స్పష్టం చేసింది.

ఇంకా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వదంతులపై కూడా క్లారిటీ ఇచ్చింది. 'నా డ్రెస్సింగ్‌పై అమ్మ నన్ను కొట్టిందట అని రాసారు. అది పూర్తిగా అబద్ధం. ఎవరికి తోచినట్లు వాళ్లు రాస్తారు. అందులో నిజం ఏమీలేదు,' అంటూ ఫేక్ న్యూస్‌పై కూడా మండిపడింది. బిగ్‌బాస్ తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ... 'బిగ్‌బాస్‌కి ముందు నేను సీరియల్స్‌లో నటించేదాన్ని. ఇప్పుడు షోలు, ఈవెంట్స్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో పాల్గొంటున్నాను. అందుకే నా డ్రెస్సింగ్ కూడా మారింది. అప్పటి ప్రియాంక వేరు... ఇప్పటి ప్రియాంక వేరు. ఇది నా స్టైల్‌, నా ఐడెంటిటీ' అని చెప్పింది. 'నా బట్టలు నా ఇష్టం' అనే ఒక్క మాటతోనే ప్రియాంక జైన్ తన స్టాండ్‌ను స్పష్టంగా చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X