Priyanka Jain: ప్రియాంక జైన్, శివ్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. చివరిసారి పుట్టింట్లో అంటూ ఎమోషనల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన మంచితనంతో టాప్ కంటెస్టెంట్ గా నిలిచిందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి ఫుల్ గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఈమె తాజాగా తన పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. త్వరలోనే తాము పెళ్లిచేసుకోబోతున్నామని చెప్పి పుట్టింట్లో ఓ వ్రతం కూడా చేసుకుంది. అక్కడ అదే తన చివరి వ్రతం అంటూ ఎమోషనల్ అయింది.
కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్స్ చేసిన ఈమె అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకు వెళ్లింది.అక్కడ తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఈమె టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలతో కలిసి ఎక్కువగా గేమ్ ఆడుతూ... సీరియల్ గ్రూపులో ఉంటూ సూపర్ గా గేమ్ ప్లే చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి తన ప్రియుడితో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. పుణ్యక్షేత్రాలతో పాటు ఇతర ట్రిప్ లకు కూడా వెళ్తూ సందడి చేస్తుంది.

వాటిని వీడియోలుగా తీసి తన యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్ లో పోస్ట్ చేస్తుంది. అయితే ఇటీవలే తల్లి క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ఆంజనేయ స్వామి గుడిలో అన్నదాన కార్యక్రమం చేపట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బెంగళూరు వెళ్లింది. తన పుట్టిల్లు అదే కావడంతో... గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈరోజు తాజాగా మోర వీడియో పోస్ట్ చేసిన ఈమె అందులో వైభవలక్ష్మీ వ్రతం చేసుకుంటూ కనిపించింది. అయితే తన పుట్టింట్లో ఇదే తన చివరి వ్రతం అని చెప్పింది.
చివరి వ్రతం అనడానికి కారణం.. ఈ ఏడాదిలో కచ్చితంగా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరికొన్ని రోజుల్లోనే తమ వివాహం ఉండడంతో.. చాలా ఏళ్లుగా చేస్తున్న వైభవ లక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేయాలని అనుకుందట ప్రియాంక జైన్. అందుకే తాను బెంగళూరుకు వెళ్లినట్లు చెప్పింది. అయితే కొన్ని వారాల పాటు ఈ పూజ చేసిన చివరి వారంలో చిన్న పిల్లలను పిలిచి వాయినాలు ఇవ్వాలని.. కానీ చాలా ఏళ్లుగా తనకు ఇది కుదరట్లేదని చెప్పింది. అందుకే ఇప్పటికైనా సరే తాను ఆ వ్రతాన్ని పూర్తి చేయాలని భావించినట్లు వెల్లడించింది.

అందుకే పుట్టింటికి వెళ్లి మరీ వైభవ లక్ష్మీ వ్రతం చేసుకుంది. తల్లితో కలిసి చేసుకున్న ఈ వ్రతం అయిపోగానే.. చిన్న పిల్లలు అందరినీ పిలిచి వాయినాలు ఇచ్చింది. బహుమతులు కూడా ఇచ్చి వారిని సర్ ప్రైజ్ చేసింది. ఇక చివరగా మాట్లాడుతూ.. తన పుట్టింట్లో ఇదే తన చివరి వ్రతం అని, మరికొన్ని రోజుల్లో తమకు పెళ్లి అవుతుందని.. ఆ తర్వాత ఈ పూజలు మెట్టినింట్లో చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఆగస్టు నెలలో శ్రావణమాసం వస్తుండడం.. అప్పుడే పూజలు ఉంటాయి. అయితే ఆలోపే ఈ ముద్దుగుమ్మ ప్రియుడు శివ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











